Friday, October 9, 2015

Rudramadevi Movie Review


కాకతీయ సామ్రాజ్యాన్ని 1261 నుండి 1289 వరకు ఏంతో సమర్ధవంతంగా  పరిపాలించింది రాణి రుద్రమదేవి ..  మన దేశం లో రాజ్యాలు ఏలిన అతి తక్కువ రాణుల్లో ఒకరైన "రుద్రమదేవి" కథని దర్శకుడు గుణశేఖర్ ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి మన తెలుగు తెరకు తెచ్చాడు .. 

ఘన చరిత్ర మనది .. 
ఓరుగల్లు రాజధాని గా కాకతీయ రాజ్యాన్ని పరిపాలించే గణపతిదేవుడు ..రాజ్య సంరక్షణ కోసం తనకి పుట్టిన ఆడ బిడ్డ రుద్రమదేవి ని మగవాడిగా(రుద్రదేవుడు) ప్రకటించి అలాగే పెంచుతాడు .. 

రుద్రదేవుడి గా ఎలా తన రహస్యాన్ని కాపాడుకుంది .. ఎలా ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి ఒచ్చింది .. ఆ నిజం ఎలా బయటపడింది .. తిరిగి ఎలా రాజ్యాన్ని కాపాడింది.. వీరభద్ర చాలుక్యుడి తో ప్రేమ .. గోన గన్నా రెడ్డ్డి సహాయం .. ఇలా  అనే అనేక అంశాలతో ఆసక్తికరమైన కథ ఆమెది .. 

ఎందరో ... అందరికి ... 
అనుష్క .. మొన్న జేజమ్మ .. నిన్న దేవసేన .. ఇప్పుడు రుద్రమదేవి ..ఈ పాత్రలు అలా స్వీటీ ని వెతుక్కుంటూ వరించాయి.. రుద్రమగా పాటల్లో ఎంత అందంగా ఉందొ .. రుద్రుడిగా ఇంకెంతో హుందాగా చేసింది ..  ఇప్పుడు అనుష్క ని నిన్నటి తారలు ఎవరితో పోల్చాలి .. సౌందర్య సిమ్రాన్ లను దాటేసింది ..  అసలు పోలికే లేని విధంగా తన దారి రహదారి అనిపించుకుంటుంది ..  

 రుద్రమదేవి కోసం ఇలా నేనున్నా అని ముందుకొచ్చి ఈ సినిమాకి కొండంత బలాన్ని ఇచ్చిన రోజే నిజమైన  హీరో అయిపోయాడు బన్ని .  .. తన దయిన శైలి లో అచ్చ తెలంగాణ యాసలో అల్లు అర్జున్ దుమ్ము దులిపాడు .. చప్పట్లు కొట్టించుకొవాలంటే హీరో పాత్రే అవ్వక్కర్లేదని నిరూపిస్తూ ఓ మరుపురాని గోన గన్నా రెడ్డి పాత్ర తన ఖాతా లో ఎస్కున్నాడు అల్లు అర్జున్  .. "గమ్మునుండవొయి" "నా మొలతాడు లో తాయత్తు " "  పదంవ్యుహంలొ చిక్కుకొనికె నె అభిమన్యుడ్ని కాదు వ్యుహకర్తల అమ్మమొగుడు శ్రికృష్ణుడు అశువంటొడ్ని. " నాకు కట్టమొస్తే నేను ఏడువ .. నా ప్రజలకు అన్యాయం జరిగితే ఎవ్వరిని ఇడువ ".. అబ్బో చాల ఉన్నాయి లెండి .. సినిమా లో చూడాల్సిందే .. 

రుద్రమదేవికి  వెన్ను దన్నుగా ఉండి కథని నడిపించే శివదేవయ్య పాత్ర లో ప్రకాష్ రాజ్ అద్భుతంగా చేసాడు .. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలో ఆమెకి సహాయంగా . ఆమె ప్రియుడి పాత్ర లో రానా , తండ్రి గా కృష్ణంరాజు గారు .. రుద్రమని అర్డంచేసుకుని పెళ్లి చేసుకునే నిత్యమీనన్ .. సేనాది పతి గా అజయ్ .. 

విలన్లు హరిహర దేవుడి గా సుమన్ .. మరో సామంత రాజు గా జయప్రకాశ్ రెడ్డి .. మాహదేవుడి గా విక్రంజీత్ .గూడచారి గా హంసానందిని . అలాగే బాబా సెగల్ , శివాజీరాజ, సన .. అమ్మో.. చాలామంది ఉన్నారు .. బాగా చేసారు 

గుణశేకరుడి కల .. 

సినిమా అంటే పిచ్చి .. రుద్రమదేవి కథపై నమ్మకం .. ఎన్ని అవాంతరాలు ఎదురయ్యినా పట్టిన పట్టు విడవకుండా తను అనుకున్న కథ మొత్తం తెరకి ఎక్కించిన గుణ గారికి హాట్స్ ఆఫ్ . తనకి ఉన్న బడ్జెట్ లో కొన్ని సన్నివేశాలు బొమ్మలతో చెప్పాడు .. తను అనుకున్న స్త్రీ చైతన్యం అనే అంశాన్ని కథగా మాటలుగా బాగా చేరవేశాడు .. రాజసింహ గోన గన్నా రెడ్డి పాత్ర కి అత్యత్భుతమయిన మాటలిచ్చాడు .. చిరంజీవి గారి వాయిస్ ఓవర్ కూడా సహాయ పడింది . పాటలు లో హీరోఇన్లు ఎక్కువ మంది ఉండటం వల్ల బోలెడంత గ్లమరసం ఉంది .. ఇళయరాజా గారి స్థాయి సంగీతం కాదు .. 

ఇంకొంచెం డబ్బులు ఉంటె .. 
రాజమౌళి గారికి బాహుబలి కి ఉన్నంత బలం బలగం రుద్రమదేవికి లేనందున "బాహుబలి" మాయాజాలాన్ని చూసిన కళ్ళకి ఈ సినిమాలోని కొన్ని గ్రాఫిక్స్ ఆనవు .. యుద్ధ సన్నివేశాలు ముఖ్యంగా చాలా తేలిపోయాయి  కథాబలంతో ఏంటో కొంత ఆ విషయాన్ని అధిగమించాడు గుణశేఖర్ . 


చివరగా 
మన చరిత్ర తెలుసుకునే కొద్ది ఇంకా తెలుసుకోవాలనేంత తియ్యగా ఉంటుంది .. చారిత్రాత్మక విషయాల కోసం .. రొటీన్ కి బిన్నంగా .. బోలెడంత మంది నటినటుల పనితనం చూసేందుకు .. అనుష్క .. అల్లు అర్జున్ కోసం తప్పకుండా ఓ సారి చూసేయ్యాలి .. 

3D లో బాగుంది .. 

నేను లక్కీ గా 3డి లో చూసాను .. ఓ తెలుగు సినిమా 3D లో చూడటం బాగుంది .. కొన్ని 3D ఎఫెక్ట్స్ నిజంగా బాగున్నాయి 

రేటింగ్ 
70/100

1 comment:

  1. An unknown history of Rudramadevi was pictured in a good way by Gunasekhar. Lucky to watch in 3D

    ReplyDelete