Friday, September 4, 2015

Bhale Bhale Magadivoi review



నాని చాలా సింపుల్ గా.. ఎంతో సహజంగా .. అభినయించి మెప్పించే నటుడు .. దర్శకుడు మారుతి చిన్న సినిమాలకు రాజమౌళి లాంటోడు .. ఇప్పటి వరకు అతను తీసిన అరడజను సినిమాలు కమర్షియల్ గా సూపర్ అనిపించు కున్నాయి మరి!!.. అలాగే  ఈ వారం విడుదలైన "భలే భలే మాగాడివోయి " కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది ..

కథ : మన హీరో నాని గురించి మనకి తెలిసిందే కొంచెం మతిమరుపు .. అలాంటి మన నాని ని అందమయిన నందన (లావణ్య త్రిపాటి) ప్రేమిస్తుంది .. ఆమె ప్రేమ కోసం తన మతిమరుపు తో పొరాటం చేసి భలే భలే మగాడు అని ఎలా అనిపించుకున్నాడో తెలియాలంటే థియేటర్ కి వెళ్ళాల్సిందే ..

భలే భలే నానివోయి ..
ఒక క్యారెక్టర్ లో అమాంతం పరకాయ ప్రవేశం చేసెయ్యగల అతి కొద్ది మంది నటులలో నాని పేరు ఎస్కోవచ్చు  .. ఆ పాత్ర చూస్తుంటే అయ్యో పాపం ఇలా మర్చిపోయాదేంటి అని జాలి .. వరేయి నిండు గర్భవతి నీ కార్లో పెట్టుకుని హాస్పిటల్ దారి మర్చిపోతావెంట్రా అని కోపం .. ఎప్పుడు దొరికిపోతాడో అని టెన్షన్ .. ఇలా ప్రతి క్షణం ఫీల్ అయ్యేలా చేసి నిజం భలేటోడు అనిపించుకుంటాడు ..

లావణ్య త్రిపాటి మునుపటి కంటే అందంగా బాగుంది .. మురళి శర్మ ( అతిధి విలన్) ఆమె తండ్రి పాత్ర లో వెరైటీ రోల్ లో బాగా చేసాడు .. కొంచెం తెలుగు సంభాషణలు జాగ్రత్త తీసుకోవాల్సింది . నరేష్ గారు స్వతహాగా మంచి కామెడి హీరో అవటం వల్ల నాని తండ్రి గా చిత్తకోట్టేసాడు .. అజయ్ సింపుల్ విలని ఆకట్టుకుంటుంది ..

ప్రవీణ్ ఫస్ట్ హాఫ్ లో స్నేహితుడి గా సాయం చేస్తే .. వెన్నెల కిషోర్ రెండో సగం నవ్వించాడు ..

ఇవి కూడా భలే భలే ..

"మళ్లి మళ్లి ఇది రాణి రోజు " తో ఆకట్టుకున్న గోపిసుందర్ ఈ  సినిమా కు మంచి పాటలు అండ్ బాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు .. సింపుల్ కథ ని పర్ఫెక్ట్ గా చెప్పటం లో మారుతి భేష్ మరో సారి ప్రూవ్ చేసుకున్నాడు మొదటి సగం లో అసలు ఏమాత్రం అలుపు ఉండదు .. రెండో సగం కొంచెం లాగ్ ఉంది అంతే .. ఇక చాలు అనుకునే లోపు మంచి క్లైమాక్స్ తో ముగింపు ఇచ్చాడు .. నాని పలికిన ప్రతి సంభాషణ .. మానేరిజమ్స్ సూపర్ గా కుదిరాయి ..

అవును ఇంతకీ ఇంకా ఎమన్నా చెప్పాలా??..
సరే మరి హ్యాపీ గా మూవీ ఎంజాయ్ చెయ్యండి ..

ఓ .. గుర్తొచ్చింది ..
రేటింగ్ .. అది లేక పోతే ఎలా ..
70/100 :)

3 comments:

  1. You give 70 to very few movies. So I think, it's very good movie. Anyway nani's movies are 100% paisa vasool mostly :-)

    ReplyDelete
  2. Can I see this in English please ? :)

    ReplyDelete
  3. Manam hero character ki tune aipotam adi baga workout chesadu director, but 2nd half could have been a lot better ento anta mamoolu ga kanicchesadu :( overall good but disappointed with 2nd half except few scenes.

    ReplyDelete