Friday, August 7, 2015

Srimanthudu Movie Review




"శ్రీమంతుడు" .. అందం లో నైనా .. అభినయం లో నైనా .. అభిమాన ధనం లో నైనా .. బాక్స్ ఆఫీసు రికార్డుల కైనా ఎటు నుంచి చూసినా నిజంగా అపర శ్రీమంతుడు మన మహేష్  .. అందుకే  ఈ టైటిల్ మన మహేష్ బాబు కి సూపర్ గా సెట్టయ్యింది .. "మిర్చి" లాంటి దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం లో ఈ "శ్రీమంతుడి "కబుర్లు కొన్ని ఇలా .. 

కథ ట్రైలర్ లో చెప్పేశారు లెండి .. 
25000 కోట్లు .. ఎన్ని సున్నాలో కూడా ఉన్న పళంగా చెప్పలేం .. అంతున్న హర్ష కి తన చుట్టూ ఉన్న వారికి మంచి చేయాలనే తపన అంతకు రెట్టింపు ఉంది ..సాటి మనిషి కోసం చలించే  హర్ష కి సరయిన మార్గం చూపిస్తుంది చారుశీల (శ్రుతి హసన్ ) .. సో ఓ ఊరి దత్తత తీసుకునే కారాణాలు .. దాని పర్యవసానాలు సమాహారమే శ్రీమంతుడు .. 

మహేష్ .. ప్రపంచంలో అత్యంత అందగత్తెను తీసుకురండి .. ఆమె నుంచి కూడా చూపు మరల్చగల  అందగాడు .. .. మన ఊరికి .. మన సమాజానికి ఎంతో కొంత తిరిగివ్వాలని సందేశం ఇచ్చే పాత్ర .. చాలా బాగుంది .  అంతే కాదు కావలనుకున్నప్పుడు హీరోయిన్ తో సరసాలు.. అలాగే విలన్ గ్యాంగ్ తో బోలెడన్ని పరాచికాలు .. అలా మహేష్ కి అన్ని సెట్టు అయ్యాయి . 
శ్రుతి హసన్ ఎప్పటిలా అండ్ ఎప్పటికంటే అందంగా ఉంది .. మహేష్ అంటాడు " you are beautiful from inside " అలా మహేష్ కి కరెక్ట్ దారి చూపించే రోల్ లో బాగా చేసింది . 
జగపతి బాబు ఇంత తొందరగా మహేష్ లాంటి హీరో తండ్రిగా చేసేస్తాడు అనుకోలేదు .. బట్ చేసి మంచి పని చేసాడు .. నిడివి తక్కువ ఉన్నాజగపతి బాబు లాంటొడె చెయ్యాల్సిన పాత్ర అది . రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా సరైన బాగం దొరికింది . సుకన్య .. సితార కంటే తులసి గారికె ఎక్కువ మార్కులు .. వెన్నెల కిషోర్, ఆలి  నవ్వించారు .. ముకేష్ రుషి .. సంపత విలనీ జస్ట్ ఓకే . 

"స్వదేశ్ " లాంటి సందేశం .. 
స్వదేశ్ లో షారుక్ ఖాన్ చెప్పినట్టు .. మన ఊరికి దేశానికి తిరిగివ్వక పోతే లావు అవ్వడమే కాదు .. మనిషి అనే దానికి విలువ కూడా ఉండదు .. అలాంటి మంచి ఆలోచనలు చుట్టూ కథ అల్లుకోవడం చాలా బాగుంది . హీరో హీరోయిన్ సంభాషనల్లో హుందాతనం .. విలన్లకు వార్నింగ్ ఇచ్చే డైలాగుల్లో స్పార్క్ + చమత్కారం రెండూ కుదిరాయి . రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో అన్నదమ్ములు విడిపోకుండా ఆపే సీన్ లో సంభాషణలు బాగున్నాయి . 

ఇవి బాగుండాల్సింది .. 
మంచి మాటకి కమర్షియల్ హంగులద్ది చెప్పటం చక్కటి ఆలోచనే .. కాని అలా చెప్పే విధానం లో కనెక్టివిటీ లేదు .. సినిమా క్లైమాక్స్ లో ఊరి జనం కోసం ఒక్కడిగా వెళ్లి ఫైట్ చేస్తాడు హీరో .. ఫైట్ అంతా అయ్యాక ఏదో పోలీసులు ఒచ్చినట్టు ఒస్తారు ఊరి జనం .. కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అంటారు .. కాని మరీ కండలు బలిసిన వాళ్ళు బంతుల్లా బౌన్సు అవుతుంటే నవ్వొస్తుంది .. అలాగే జగపతి బాబు ఊరొచ్చి కొడుకుని బలవంతంగా తీసుకెళ్ళే బదులు కొడుకుని మెచ్చుకుని జనం అందరు కలిసి తిరుగుబాటు చేసుంటే ఒక పావుగంట తగ్గి ఇంకా నప్పేది .. 


ఇవ్వన్ని బాగున్నాయి .. 
దేవిశ్రీ పాటలు వినడానికి ఎంత బాగున్నాయో స్క్రీన్ మీద కూడా అంత బాగున్నాయి . అలాగే సినిమా ని ఆసాంతం అందంగా మలిచారు సినిమాటోగ్రాఫర్ మధి . ఈ సినిమా తమిళం డైరెక్ట్ రిలీజ్ చెయ్యాలనే ఆలోచన ఆయనదెనంట .. సో మన సినిమాలకు మంచి రోజులే .. 

మొత్తంగా .. 
చాలా చక్కటి సందేశాన్ని ఇంకెంతో హుందాగా .. సాద్యమైనంత కమర్షియల్ గా చెప్పాడు శ్రీమంతుడు .. పాటలు,మాటలు ..మంచి పాత్రలతో మనని సంతృప్తి పరిచే సినిమా శ్రీమంతుడు .. ట్రైలర్ లో ఇంతే చెప్పాం .. ఇంత కంటే చూపిస్తే లావయిపొతాం అనే కంటే ఇంకొంచెం సర్ప్రైజ్ చేసుంటే ఇంకా బాగుండేది 

70/100

Please follow me on twitter https://twitter.com/chakrireview