Wednesday, January 11, 2017

Gautamiputra Satakarni Review #GPSK

సంక్రాంతి అంటే సినిమాకి తోలి పండగ .. నిన్నటి టాప్ స్టార్స్ చిరంజీవి , బాలకృష్ణ తమ ల్యాండ్ మార్క్ సినిమాలతో తలపడడం ఈ సంక్రాంతి ప్రత్యేకత .. నిన్న ఖైదీ సందడి చూసాం .. నేడు గౌతమీపుత్ర శాతకర్ణి వంతు .. 

కథ : యావత్తు భారత దేశాన్ని ఒక తాటిపైకి తీసుకురావాలని శాతకర్ణి తపన .. తన కలని .. తల్లి గౌతమికి చేసిన ప్రతిఘ్నని .. భార్య వాసిస్టి అలకని ఎలా నెగ్గుకొచ్చ్చాడు అనేదే శాతకర్ణి కథ .. 

శాతకర్ణి భళాలు .. 
మనసుకు హత్తుకునే చిత్రాలు తీసే క్రిష్ తో తెలుగు వీరుడు శాతకర్ణి కథ ని ఎంచుకోవటంతోనే బాలయ్య సగం విజయం సాధించారు .. చారిత్రాత్మక పాత్రలో తనకి చక్కగా నప్పే డైలాగులతో .. వీరత్వం నిండిన ఫైట్స్ తో .. తన ప్రత్యేకతని చాటుకున్నాడు .. ఆద్యంతం హుషారుగా సాగిన పాత్ర అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది .. 

హేమమాలిని పాత్ర హుందాగా అనిపిస్తే , శ్రీయ వాశిష్టి గా చక్కగా ఇమిడిపోయింది . శివరాజ్ కుమార్ బుర్ర కథ బాగుంది 


యుద్దాలు మాటలు.. 
సినిమా ఆరంభంలో పడవల మీద పోరాటం అబ్బుర పరుస్తుంది .. ఇంటర్వెల్ లో నేహాపనా (కబీర్ బేడీ) తో పోరాటం ఒక ఇరవై నిమిషాల పాటు కళ్లప్పగిచ్ఛేలా చేస్తుంది ... క్లైమాక్స్ లో పోరాటం కూడా మెప్పిస్తుంది .. అయితే కొన్ని పోరాట సీన్లు అవే అవే మల్లి వాడారు ..బడ్జెట్ నియంత్రణ కనిపిస్తుంది .. 

అంజనీ పుత్ర క్రిష్ .. తనకి ఉన్న అతి తక్కువ వ్యవధి లో అన్ని విభాగాల నుంచి మంచి పనితనం రాబట్టాడు .. 
సాయి మాధవ్ బుర్రా మాటలు ఎన్నో చోట్ల చప్పట్లు కొట్టిస్తాయి .. ఇంటర్వెల్ లో రాజ్యాల పేర్లు చెప్పే భారీ డైలాగు .. చీమ ఏనుగు కథ .. అమ్మ గొప్పతనం చెప్పే మాటలు .. ఇలా ఎన్నో ఆసాంతం ఉన్నాయి .. 


ఇంకా కొంచెం ఉండుంటే 
సంక్రాంతి అనే గడువు లేకుండా ఉంటె కథలో ఇంకొన్ని మలుపులు పెట్టె అవకాశం ఉండేదేమో .. కథ గా చెప్పుకుంటే డైరెక్టర్ చెప్పింది చాలా చిన్న కథే .. యుద్దాలు కానీ సన్నివేశాలు తక్కువే అయినా కొంచెం నెమ్మది గా అనిపిస్తుంది .. చిరంతాన్ భట్ నేపధ్య సంగీతం ఇంకా బలంగా ఉండాల్సింది 

చివరగా .. 
బడ్జెట్ .. సమయం పరమైన కొన్ని తప్పులను క్షమిస్తే .. శాతకర్ణి చాలా వరకు ఆకట్టుకుంటుంది .. ఓ మంచి సినిమా చూసాం అనే సంతృప్తి ని ఇస్తుంది .. మన తెలుగు వాడి సత్తా అత్యద్భుతం అనిపిస్తుంది .. బాలయ్య 100 వ సినిమా ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుంది .. 

70 /100


FOLLOW ME ON TWITTER : https://twitter.com/chakrireview
FACEBOOK :https://www.facebook.com/chakrireview/