Saturday, February 25, 2017

Ghazi - Short Review


Finally I was able to watch the critically acclaimed GHAZI in theatre. It is one of its kind movie, a first Indian movie on submarine war between India and Pakistan. It deals on how Indian Submarine with limited resources and several hardships attacks Pakistan’s PNS Ghazi .

Director Sankalp Reddy did an extensive research and tries to explain the intricacies of Submarine very clearly.. as how radio code is decoded.. What is the maximum depth possible for submarine..  Launching the Torpedo’s (Missiles). He created a conflict between two officers Captain Rann Vijay Singgh and Commander Arjun and moved the proceedings well in first half.. Second half is much gripping and emotional.

KK Menon and Atul Kulkarni bring their experience to put in great performance. Rana shines brilliantly in his role and adds a new feather to his cap.Tapsee, Satyadev,Bharath, Ravi Varma are apt.  Music by K aptly supports the mood of the film. Madhi’s cinematography is extraordinary and so are the Visual effects. They are nothing short of Hollywood flicks. PVP cinema gets accolades for believing the script..

Overall Ghazi is very good watch and brings in high respect for our soldiers..

75/100

Friday, February 10, 2017

Om Namo Venkatesaaya Review


భక్తి సినిమాలకి బ్రాండ్ అంబాసిడర్ వంటిది మన రాఘవేంద్ర రావు - నాగార్జున కలయిక అని అన్నమయ్య - రామదాసు నిరూపించాయి .. ఇప్పుడు " ఓం నమో వెంకటేశాయ " అంటూ హాథిరామ్ బావూజీ గారి కథతో మరో సారి ముందుకొచ్చ్చారు .. 

కథ - తిరుపతి క్యూ కాంప్లెక్స్ వద్ద ఖఛ్చితంగా మనం వెంకటేశ్వర స్వామీ హాథిరామ్ బావూజీ తో పాచికలు ఆడే విగ్రహం చూసే ఉంటాం .. ఆ ఆట చుట్టూ అల్లుకున్న ఓ చిన్న కథని ఆధారంగా అల్లుకున్న సినిమా ఇది .. 

పాత్రలు .. 
అన్నమయ్య అప్పుడు ఎలా చేస్తాడో ఎవరూ ఊహించలేదు .. అద్భుతం అనిపించాడు .. రామదాసు అలవోకగా చేసాడు ..శిరిడి సాయి గా మెప్పించాడు .. ఇక హాథిరామ్ గా అతి సునాయాసంగా పరకాయ ప్రవేశం చేసేసాడు అక్కినేని నాగార్జున .. భక్తి పాత్రల్లో నాన్నని మించి నటించి  .. సినిమా మొత్తం తన మీద మోశాడు 

సౌరభ్ జైన్ శ్రీవారి గా చాలా చక్కగా కుదిరాడు 

కృష్ణమ్మ గా అనుష్క మొదటి సగం వరకు ఆకట్టుకుంటుంది.. రెండో సగానికి ఇరికించినట్టు ఉంటుంది .. 

రావు రమేష్ విలనీ బాగుంది .. బ్రహ్మానందం , జబర్దస్త్ బాంగ్, రఘుబాబు , వెన్నెల కిషోర్  కామెడీ బానే ఉంది .. ఎక్కడ విసిగించలేదు .. ఓ చిరునవ్వు ఇస్తాయి 

వీరి కామెడీ కంటే .. ప్రేమ పాటల కోసం రాఘవేంద్రుని పాట్లు నవ్విస్తాయి .. కేవలం ఓ పాట కోసమే ప్రగ్య జాస్వాల్ నాగార్జున మరదలిగా ఓ పాటని కల కంటుంది .. బట్ ప్రగ్య సినీ జీవితం లో ఓ అందమైన పాట ఇదే అవుతుందేమో ..ఇక జగపతిబాబు అనుష్క తో పాట కోసమే అతిధి పాత్రలో మెరుస్తాడు .. రాజుగా సంపత్ రాజ్ , గరుడుని గా అజయ్ బాగున్నారు 

హై లైట్స్ 

సినిమా మొదలు నుంచి కీరవాణి సంగీతం వెన్నుముక్కగా నిలుస్తుంది ... బాలుని గా హాథిరామ్ దేవుణ్ణి వెతకటం.. తిరుపతి చేరటం .. విలన్లతో పోరాడి ఆలయాన్ని చక్కగా మలచడం అన్ని బాగా కుదిరాయి .. ఎప్పుడో శ్రీ వెంకటేశ్వర మహత్యం లో చెప్పిన  తిరుపతి స్థల కథ ( భృగు మహర్షి అహంకారం -- స్వామి కిందకి రావటం) ఇన్నాళ్లకు రాఘవేంద్రరావు చేతుల మీదుగా మళ్ళీ చూడటం బాగుంది ..

ఏడుకొండలు స్వామి హాథిరామజీ  తో పాచికలాడే ప్రతి సన్నివేశం అత్యద్భుతం అనిపిస్తాయి  .. అలాగే శ్రీవారికి నిత్య కళ్యాణం జరిపించటం చాలా బాగుంది .. శ్రీవారికి వెన్న సేవ.. శేష వస్త్రం , కలియుగ వైకుంఠం , కుబేరుని అప్పు ఇలా చాలా ప్రస్తావనలు కొన్ని విశేషాలు తెలిపేలా మాటలు రాసారు భారవి .. ఇక S గోపాల్ రెడ్డి గారు  మహాబలేశ్వరం కొండల్ని చాలా అందంగా చూపించారు .. 

ఇవి లోటు పాట్లు .. 
కథ చిన్నది కావటం తో ఎన్ని విశేషాలు కలిపినా .. కూరలు ఎక్కువ ఉండి అన్నం తక్కువ ఉంది అనిపిస్తుంది .. అనుష్క పాత్రని రెండో సగంలో బాగా ఇరికించినట్టు ఉంది .. అన్నమయ్య లో అద్భుత పతాక సన్నివేశం చూసాం కాబట్టి .. ఈ చిత్రం ముగింపు పోలికతో కూడిన నిరాశ అనిపిస్తుంది .. అలాగే అన్నమయ్య .. రామదాసుల్లో ఉన్న ఎమోషనల్ పీక్స్ ఇక్కడ కనిపించలేదు .. 

చివరగా .. 
కొన్ని లోటు పాట్ల కంటే హై లైట్స్ ఎక్కువగా మెప్పిస్తాయి .. చిత్రం ఆద్యంతం సంగీతభరితంగా ఉల్లాసపరుస్తుంది .. ఆ ఏడుకొండల  స్వామీ స్థల విశేషాలు అందిస్తూ వినోదాన్ని ఇవ్వటం  "ఓం నమో వెంకటేశాయ " ప్రత్యేకత .. 

రేటింగ్ 
65/100

Please follow me on Twitter : https://twitter.com/chakrireview