Thursday, May 22, 2014

Manam Movie Review

 అక్కినేని వారి మూడు తరాలు నటించిన ఓ మరపురాని మైలురాయి "మనం " . మనని దశాబ్దాలుగా అలరించిన నటసామ్రాట్ నాగేశ్వర రావు గారిని మరో సారి తెర మీద చూసుకునే అవకాశాన్ని కల్పించిన మధురానుభూతి "మనం" . 
"మనం " ఓ సారి ఈ "మనం" ఎలా ఉందొ ఒక్క సారి లుక్కెద్దామ్ ... 

కథ నేను చెప్పనండి ... 
కొన్ని కథలు కొందరి కోసం పెట్టి పుడతాయేమో ... ఇలా మూడు తరాలని కలుపుకు పోయే అత్యధ్బుతమయిన కథ "మనం" .. ఒక్క మాట లో చెప్పాలంటే మన ప్రాణాలకి ఉన్న పరిమితి మనసుకి .. ప్రేమకి లేదని చాటి చెప్పే "మరు జన్మల" కథ మనం ... 

అక్కినేని .. అక్కినేని .. అక్కినేని 
#ANRLIVESON మనం .... అక్కినేని నాగేశ్వర రావు మన మధ్యే ఉన్నారనిపిస్తుంది "మనం" చూస్తున్నంత సేపు ... అరె ఈ తాగుబోతులందరు ఆ దేవదాసు పేరే వాడాలా .. ఆ రోజుల్లో నేను ఎంత రొమాన్సు చేసానో నీకేం తెలుసు అని చెప్తుంటే ప్రేక్షకుల కంటి పొరల్లో ఓ చిన్న పాటి తడి జ్ఞాపకం వచ్చే ఉంటుంది .. 

నిజ జీవితం లో లాగానే అటు తరానికి ఇటు తరానికి వంతెన లాంటి పాత్ర నాగార్జునది . సినిమా పరంగా చూస్తె నాగ చైతన్య కి ఆరేళ్ళు పెద్దగా ఉండే రోల్ నవ మన్మధుడు నాగార్జున విజ్రంభించాడు .. తన భుజాల మీద సినిమాని నడుపుతూ ఆ అక్కినేని .. అక్కినేనంత వారసుడిని అనిపించుకున్నాడు .. 

తాత గారితో కలిసి ఇలా సరదాగా నటించే అవకాశం నాగ చైతన్య కి అపురూపమైన వరం .. వరం ఎందుకంటే ఒక్క సారి .. ఒకే సారి లభించింది కనుక .. సీరియస్ సీన్స్ చాలా బాగా చేసాడు చైతూ .. కాని జోవియల్ సీన్స్ ఇంకా మెరుగవ్వాలి ... 

శ్రీయ నాగార్జున కి జోడిగా  పర్ఫెక్ట్ గా కుదిరింది . పెద్ద హీరోలు చిన్న పిల్లల వెంట పడకుండా నిన్నటి హీరోయిన్ల తో జత కడితే ఆ కెమిస్ట్రీ ఏ వేరు .. రెండు రకాల పాత్రల్లో తనలోని నటిని మరో సారి చూపించింది శ్రీయ . 
సమాంత చైతు హిట్ పెయిర్ అనిపించుకున్నారు మరో సారి .. You Finally Love ( ట్రైలర్ లో ఉంటుంది ఆ బిట్ ) అనే సీన్ లో ఎంత క్యూట్ గా చేసిందో .. సినిమా మొత్తం అంత అందంగా కూడా ఉంది ..  

బ్రహ్మానందం .. ఎమ్మెస్ ..ఆలి  .. పోసాని .. సప్తగిరి తలా ఓ నవ్వు పూయించారు .. అక్కినేని అమల, అమితాబ్ బచ్చన్ తలుక్కున మెరిసారు ... 

విక్రం కుమార్ .. అండ్ అనూప్ రుబెన్స్ మీకు జోహార్లు .. 
ఇన్నాళ్ళు ఒక లాంటి కథలకి అలవాటు పడ్డాం .. ఇలాంటి ఓ కథ ఉంటుందా అనిపించేలా రాసావు Thank You . ఇంటర్వెల్ కి కథ అర్థమైనా .. తరువాత మలుపులు .. ప్రేమ కథ ల తో ఎక్కడా బోర్ కొట్టించలేదు .. మూడు తరాలని కలుపుకు పోయే సంభాషణలు రాసిన విక్రమ్ హర్షవర్ధన్ లకి హాట్స్ ఆఫ్ . అనూప్ ఇచ్చిన అన్ని పాటలు సినిమా చూసాక మరింత నచ్చాయి .. "ఇది  ప్రేమ ప్రేమ " ఇంకా మోగుతుంది బాక్గ్రౌండ్ లో .. PS వినోద్ సినిమాటోగ్రఫీ హృద్యం గా ఉంది .. 

నెగటివ్ .. 
ఇలాంటి ఓ సెక్షన్ ఒద్దనుకున్నా .. కాని సుమంత్ సుశాంత్ అండ్ అక్కినేని కుటుంబం లోని నటులని చిన్న చిన్న గెస్ట్ రోల్స్ లో ఉన్నట్టయితే బాగుండేది అనిపించింది .. 

రేటింగ్ 
సినిమా ఎంత గా నచ్చింది అంటే 100 లోంచి అసలు ఓ 10 అన్నా తీయ్యాలా అని ఆలోచిస్తే .. ఏమో ఇంత కన్నా మంచి సినిమాలు ఒస్తాయి అని ఆశ ఉండటం తప్పు కాదు కదా .. సో 85/100 
దాదా సాహెబ్ నట సామ్రాట్ అక్కినేని గారికి ఘన నివాళి మనం .. మరో యువ కెరటానికి పునాది మనం .. :) !!!!!!!!!