Sunday, July 31, 2016

PELLICHOOPULU MOVIE REVIEW

"నువ్వే కావాలి ".. "ఆనంద్"  "వెన్నెల".. మొదలుకొని మొన్నటి "స్వామీ రా రా ".. "కార్తికేయ" .. "అలా మొదలైంది " "ప్రేమ కథ చిత్రం " "క్షణం" ఇలా ఎన్నో చిన్న గా మొదలైన సినిమాలు పెద్ద విజయాలు సాధించాయి .. వీటన్నింటిలో ఓ కామన్ విషయం ఏమిటంటే .. " ఈ సినిమాని కూడా థియేటర్లో ఎం చూస్తాం లే " అన్న ఆలోచన నుంచి  "ఈ సినిమా హాళ్ళో చూడాల్సిందే " అంటూ మానని ముందుకు తోసిన సినిమాలే .. ఇప్పుడు "పెళ్లిచూపులు" అచ్ఛం అలాంటి ఆణిముత్యమే 

సింపుల్ స్టోరీ : ఓ తప్పు అడ్రస్ ద్వారా జరిగిన పెళ్లి చూపులు .. ఆ అబ్బాయి .. అమ్మాయి జీవితాలని ఎంత అందంగా మలుపు తిప్పాయో అనే కాన్సెప్ట్ "పెళ్లిచూపులు"

దూద్ కాశీ అబ్బాయి .. దుమ్ము రేపాడు .. 
"ఎవడే సుబ్రహ్మణ్యం" లో రిషి గా మెప్పించిన రిషి అలియాస్ విజయ్ దేవరకొండ .. ఇంజనీరింగ్ పూర్తి చేసి అయోమయం లో ఉన్న సగటు యువకుడి నుంచి తన అభిరుచి వైపు అడుగులు వేసి విన్నర్ గా నిలిచిన "ప్రశాంత్" పాత్ర లో ఒదిగిపోయాడు .. ఇంతకు ముందు వేసిన దూద్ కాశీ పాత్ర ప్రేక్షకులకి తొందరగా రిజిస్టర్ అవ్వటానికి ఉపయోగపడింది .. ఇలాంటి విభిన్న సినిమాలని ఎంచుకుంటూ పొతే "నాని"  అంతటి వాడయ్యే అవకాశం ఉంది .. 

"రీతువర్మ" తిను కూడా చూడగానే కొంచెం ఆనంద్ లో  "కమలిని" గుర్తొస్తుంది .. అదే తరహా స్వతంత్ర భావాలున్న పాత్ర "ఛైత్ర"గా అందం అభినయం తో ఆకట్టుకుంది  .. 

ఇక సర్ప్రైస్ చేసింది మాత్రం "నా శావు నే చస్తా .. నీకెందుకు " అంటూ ట్విట్టర్ ట్రెండ్ అయిపోతున్న కొత్త డైలాగు చెప్పిన "కౌశిక్" పాత్రలో ఇరగదీసిన ప్రియదర్శి అనే హైదెరాబాదీ కుర్రాడిది .. మీరు గమనిస్తే ఆ పైన మనం చెప్పుకున్న సినిమాలు కొందరు కమెడియన్స్ కి సూపర్ లైఫ్ ఇచ్చాయి ( వెన్నెల కిషోర్ , తాగుబోతు రమేష్ , సప్తగిరి )

మిగతా పాత్రల్లో కొన్నింటిని ఇదే తరహా సినిమాల్లో మనం చూసాం .. లైక్ అనీష్ కురువిల్లా , హీరో తండ్రి, హీరోయిన్ డాడీ .. 


నా చావు నే చస్తా నీకుందుకు .. 
ఇప్పుడే కాలేజీ నుంచి బయటకు వచ్చిన వారైనా .. IT జాబుల్లో పొడిచేసే వారైనా .. ఎపుడో ఒకప్పుడు .. మన హీరో బ్యాచ్ లా " ఎం చేస్తున్నావ్ " అనే ఓ చెత్త క్వశ్చన్ face చేసే ఉంటారు .. ఆ ప్రశ్నకి ఓ మాంచి సమాధానం ఇచ్చింది "పెళ్లిచూపులు" .... 

అలాగే తరుణ్ భాస్కర్ అభిరుచి-కృషి తోడైతే ఆకాశమే హద్దు అనే సందేశాన్ని .. ఎక్కడా బోర్ కొట్టకుండా బోలెడన్ని గమ్మత్తైన సన్నివేశాలతో ( కాల్ సెంటర్ .. ప్రాంక్ వీడియోస్ .. కుకింగ్ .. ) అంతర్లీనంగా ప్రేమ కథని చక్కగా చెప్పి మొదటి ప్రయత్నంలో శభాష్ అనిపించుకున్నాడు . వివేక్ సాగర్ అందించిన సంగీతం .. DOP నగేష్ బన్నెల్ .. అలాగే క్రిస్ప్ గా ఎడిట్ చేసిన రవితేజ గిరజాల .. అందరూ తమ వంతు సాయం చేశారు 

రేటింగ్ .. 
65/100