Thursday, October 15, 2015

BruceLee Movie review


It’s Dusshera season and time for big flicks that are coming to theatres one after another in very short span. Surely  Mega Power Star Ramcharan’s Brucelee is top on the list . With Megastar Chiranjeevi’s warmup cameo.. and Srinu Vaitla’s re-union with Writer duo kona-Gopi has surely turned many eyeballs.
Lets see how the Brucelee the Fighter fared at box-office…

Plot : Ramcharan plays Karthik who loves his sister very much and sacrificies his studies for her to become collector. But a bigger problem comes via her marriage proposal. Brucelee has to step in to resolve them.

Actors:

Ramcharan is easily one of the best dancers in Tollywood and he proves it in each and every Song. Liked him in sentimental scenes this time. But there is lot of space to push himself in comedy time.. Actually he never tried it much before. He is always good with mass histrionics. He gets it right when he says "Eelagelaga”

Rakul is beautiful as usual and gets good space in the first half and becomes nice part of the plot by imagining charan as Cop and moving the story forward.

Rao Ramesh as an angry father is good. Nadiya has very limited screen presence and somehow not utilized as mother in-law to Ramcharan’s sister. Sampath Raj plays cunning baddie and husband to Nadiya and is good. ArunVijay plays baddie is ok. Mukesh Rishi as good cop and Shiyaji Shindey as bad cop balances well.
Krithi karbanda as sister is just there to thank his brother half a dozen times and she is some how linked to main villain through marriage proposal.

There is big roar in theatres for entrance of Brahmi.. people still love him lot and it is upto directors to use him properly. There is nothing fresh in his role of suziki Subramanyam and it slightly resembles the one in “Race Gurram” who unknowingly fires and helps in catching the villain. Srinu Vaitla cautiously do not prolong him.

Jayaprakash does double role for a purpose and is good. Posani and 30 Years Prudhvi silently make us laugh. Ali is good as PK in short stint. Saptagiri and Vennela Kishore are fine.

Sweet and simple first half.

Brother helping his sister in every possible way and getting scolding from misunderstanding father… though seen in many films.. is still likable because of that love and affection of us towards family. So Vaitla gets pass marks there. Heroine thinking Hero as the cop and pulling him into several problematic situations is good and nice idea. That makes way for good action sequences and songs one after other. And Interval nicely connects the Major Villian problem and the Family.

Confused Second Half..

Whatever is the first half.. Srinu Vaitla connects it to family by second hour. There was so much noise over his in-house drama in his previous films.. So he has to deliver some thing different. So even he brings in comedians .. but did not put   in hilarious episodes there. He deliberately cut short them and jumps into some double-action drama which does not work out wholly. While there is enough content but should have been carefully placed on screen.

Thaman gave decent album and all songs are good on screen. I did not like unnecessary intervention of a comedian in last Song.

Boss is Back

It’s much awaited before watching the movie and much much awaited while watching the film. Megastar Chiranjeevi is just as fresh as his last film on screen or we can say even charming than that. Its Mega superb to see him on screen.

Finally..

It’s a mixed bag this time. While slightly clichéd second brings down the Mega meter, Good first half.. songs with Charan's dances and of course the Megastar are the Major pluses of the film..

Rating

55+5 of course for the entry of Mega  Star!!

Friday, October 9, 2015

Rudramadevi Movie Review


కాకతీయ సామ్రాజ్యాన్ని 1261 నుండి 1289 వరకు ఏంతో సమర్ధవంతంగా  పరిపాలించింది రాణి రుద్రమదేవి ..  మన దేశం లో రాజ్యాలు ఏలిన అతి తక్కువ రాణుల్లో ఒకరైన "రుద్రమదేవి" కథని దర్శకుడు గుణశేఖర్ ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి మన తెలుగు తెరకు తెచ్చాడు .. 

ఘన చరిత్ర మనది .. 
ఓరుగల్లు రాజధాని గా కాకతీయ రాజ్యాన్ని పరిపాలించే గణపతిదేవుడు ..రాజ్య సంరక్షణ కోసం తనకి పుట్టిన ఆడ బిడ్డ రుద్రమదేవి ని మగవాడిగా(రుద్రదేవుడు) ప్రకటించి అలాగే పెంచుతాడు .. 

రుద్రదేవుడి గా ఎలా తన రహస్యాన్ని కాపాడుకుంది .. ఎలా ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి ఒచ్చింది .. ఆ నిజం ఎలా బయటపడింది .. తిరిగి ఎలా రాజ్యాన్ని కాపాడింది.. వీరభద్ర చాలుక్యుడి తో ప్రేమ .. గోన గన్నా రెడ్డ్డి సహాయం .. ఇలా  అనే అనేక అంశాలతో ఆసక్తికరమైన కథ ఆమెది .. 

ఎందరో ... అందరికి ... 
అనుష్క .. మొన్న జేజమ్మ .. నిన్న దేవసేన .. ఇప్పుడు రుద్రమదేవి ..ఈ పాత్రలు అలా స్వీటీ ని వెతుక్కుంటూ వరించాయి.. రుద్రమగా పాటల్లో ఎంత అందంగా ఉందొ .. రుద్రుడిగా ఇంకెంతో హుందాగా చేసింది ..  ఇప్పుడు అనుష్క ని నిన్నటి తారలు ఎవరితో పోల్చాలి .. సౌందర్య సిమ్రాన్ లను దాటేసింది ..  అసలు పోలికే లేని విధంగా తన దారి రహదారి అనిపించుకుంటుంది ..  

 రుద్రమదేవి కోసం ఇలా నేనున్నా అని ముందుకొచ్చి ఈ సినిమాకి కొండంత బలాన్ని ఇచ్చిన రోజే నిజమైన  హీరో అయిపోయాడు బన్ని .  .. తన దయిన శైలి లో అచ్చ తెలంగాణ యాసలో అల్లు అర్జున్ దుమ్ము దులిపాడు .. చప్పట్లు కొట్టించుకొవాలంటే హీరో పాత్రే అవ్వక్కర్లేదని నిరూపిస్తూ ఓ మరుపురాని గోన గన్నా రెడ్డి పాత్ర తన ఖాతా లో ఎస్కున్నాడు అల్లు అర్జున్  .. "గమ్మునుండవొయి" "నా మొలతాడు లో తాయత్తు " "  పదంవ్యుహంలొ చిక్కుకొనికె నె అభిమన్యుడ్ని కాదు వ్యుహకర్తల అమ్మమొగుడు శ్రికృష్ణుడు అశువంటొడ్ని. " నాకు కట్టమొస్తే నేను ఏడువ .. నా ప్రజలకు అన్యాయం జరిగితే ఎవ్వరిని ఇడువ ".. అబ్బో చాల ఉన్నాయి లెండి .. సినిమా లో చూడాల్సిందే .. 

రుద్రమదేవికి  వెన్ను దన్నుగా ఉండి కథని నడిపించే శివదేవయ్య పాత్ర లో ప్రకాష్ రాజ్ అద్భుతంగా చేసాడు .. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలో ఆమెకి సహాయంగా . ఆమె ప్రియుడి పాత్ర లో రానా , తండ్రి గా కృష్ణంరాజు గారు .. రుద్రమని అర్డంచేసుకుని పెళ్లి చేసుకునే నిత్యమీనన్ .. సేనాది పతి గా అజయ్ .. 

విలన్లు హరిహర దేవుడి గా సుమన్ .. మరో సామంత రాజు గా జయప్రకాశ్ రెడ్డి .. మాహదేవుడి గా విక్రంజీత్ .గూడచారి గా హంసానందిని . అలాగే బాబా సెగల్ , శివాజీరాజ, సన .. అమ్మో.. చాలామంది ఉన్నారు .. బాగా చేసారు 

గుణశేకరుడి కల .. 

సినిమా అంటే పిచ్చి .. రుద్రమదేవి కథపై నమ్మకం .. ఎన్ని అవాంతరాలు ఎదురయ్యినా పట్టిన పట్టు విడవకుండా తను అనుకున్న కథ మొత్తం తెరకి ఎక్కించిన గుణ గారికి హాట్స్ ఆఫ్ . తనకి ఉన్న బడ్జెట్ లో కొన్ని సన్నివేశాలు బొమ్మలతో చెప్పాడు .. తను అనుకున్న స్త్రీ చైతన్యం అనే అంశాన్ని కథగా మాటలుగా బాగా చేరవేశాడు .. రాజసింహ గోన గన్నా రెడ్డి పాత్ర కి అత్యత్భుతమయిన మాటలిచ్చాడు .. చిరంజీవి గారి వాయిస్ ఓవర్ కూడా సహాయ పడింది . పాటలు లో హీరోఇన్లు ఎక్కువ మంది ఉండటం వల్ల బోలెడంత గ్లమరసం ఉంది .. ఇళయరాజా గారి స్థాయి సంగీతం కాదు .. 

ఇంకొంచెం డబ్బులు ఉంటె .. 
రాజమౌళి గారికి బాహుబలి కి ఉన్నంత బలం బలగం రుద్రమదేవికి లేనందున "బాహుబలి" మాయాజాలాన్ని చూసిన కళ్ళకి ఈ సినిమాలోని కొన్ని గ్రాఫిక్స్ ఆనవు .. యుద్ధ సన్నివేశాలు ముఖ్యంగా చాలా తేలిపోయాయి  కథాబలంతో ఏంటో కొంత ఆ విషయాన్ని అధిగమించాడు గుణశేఖర్ . 


చివరగా 
మన చరిత్ర తెలుసుకునే కొద్ది ఇంకా తెలుసుకోవాలనేంత తియ్యగా ఉంటుంది .. చారిత్రాత్మక విషయాల కోసం .. రొటీన్ కి బిన్నంగా .. బోలెడంత మంది నటినటుల పనితనం చూసేందుకు .. అనుష్క .. అల్లు అర్జున్ కోసం తప్పకుండా ఓ సారి చూసేయ్యాలి .. 

3D లో బాగుంది .. 

నేను లక్కీ గా 3డి లో చూసాను .. ఓ తెలుగు సినిమా 3D లో చూడటం బాగుంది .. కొన్ని 3D ఎఫెక్ట్స్ నిజంగా బాగున్నాయి 

రేటింగ్ 
70/100

Friday, September 4, 2015

Bhale Bhale Magadivoi review



నాని చాలా సింపుల్ గా.. ఎంతో సహజంగా .. అభినయించి మెప్పించే నటుడు .. దర్శకుడు మారుతి చిన్న సినిమాలకు రాజమౌళి లాంటోడు .. ఇప్పటి వరకు అతను తీసిన అరడజను సినిమాలు కమర్షియల్ గా సూపర్ అనిపించు కున్నాయి మరి!!.. అలాగే  ఈ వారం విడుదలైన "భలే భలే మాగాడివోయి " కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది ..

కథ : మన హీరో నాని గురించి మనకి తెలిసిందే కొంచెం మతిమరుపు .. అలాంటి మన నాని ని అందమయిన నందన (లావణ్య త్రిపాటి) ప్రేమిస్తుంది .. ఆమె ప్రేమ కోసం తన మతిమరుపు తో పొరాటం చేసి భలే భలే మగాడు అని ఎలా అనిపించుకున్నాడో తెలియాలంటే థియేటర్ కి వెళ్ళాల్సిందే ..

భలే భలే నానివోయి ..
ఒక క్యారెక్టర్ లో అమాంతం పరకాయ ప్రవేశం చేసెయ్యగల అతి కొద్ది మంది నటులలో నాని పేరు ఎస్కోవచ్చు  .. ఆ పాత్ర చూస్తుంటే అయ్యో పాపం ఇలా మర్చిపోయాదేంటి అని జాలి .. వరేయి నిండు గర్భవతి నీ కార్లో పెట్టుకుని హాస్పిటల్ దారి మర్చిపోతావెంట్రా అని కోపం .. ఎప్పుడు దొరికిపోతాడో అని టెన్షన్ .. ఇలా ప్రతి క్షణం ఫీల్ అయ్యేలా చేసి నిజం భలేటోడు అనిపించుకుంటాడు ..

లావణ్య త్రిపాటి మునుపటి కంటే అందంగా బాగుంది .. మురళి శర్మ ( అతిధి విలన్) ఆమె తండ్రి పాత్ర లో వెరైటీ రోల్ లో బాగా చేసాడు .. కొంచెం తెలుగు సంభాషణలు జాగ్రత్త తీసుకోవాల్సింది . నరేష్ గారు స్వతహాగా మంచి కామెడి హీరో అవటం వల్ల నాని తండ్రి గా చిత్తకోట్టేసాడు .. అజయ్ సింపుల్ విలని ఆకట్టుకుంటుంది ..

ప్రవీణ్ ఫస్ట్ హాఫ్ లో స్నేహితుడి గా సాయం చేస్తే .. వెన్నెల కిషోర్ రెండో సగం నవ్వించాడు ..

ఇవి కూడా భలే భలే ..

"మళ్లి మళ్లి ఇది రాణి రోజు " తో ఆకట్టుకున్న గోపిసుందర్ ఈ  సినిమా కు మంచి పాటలు అండ్ బాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు .. సింపుల్ కథ ని పర్ఫెక్ట్ గా చెప్పటం లో మారుతి భేష్ మరో సారి ప్రూవ్ చేసుకున్నాడు మొదటి సగం లో అసలు ఏమాత్రం అలుపు ఉండదు .. రెండో సగం కొంచెం లాగ్ ఉంది అంతే .. ఇక చాలు అనుకునే లోపు మంచి క్లైమాక్స్ తో ముగింపు ఇచ్చాడు .. నాని పలికిన ప్రతి సంభాషణ .. మానేరిజమ్స్ సూపర్ గా కుదిరాయి ..

అవును ఇంతకీ ఇంకా ఎమన్నా చెప్పాలా??..
సరే మరి హ్యాపీ గా మూవీ ఎంజాయ్ చెయ్యండి ..

ఓ .. గుర్తొచ్చింది ..
రేటింగ్ .. అది లేక పోతే ఎలా ..
70/100 :)

Friday, August 7, 2015

Srimanthudu Movie Review




"శ్రీమంతుడు" .. అందం లో నైనా .. అభినయం లో నైనా .. అభిమాన ధనం లో నైనా .. బాక్స్ ఆఫీసు రికార్డుల కైనా ఎటు నుంచి చూసినా నిజంగా అపర శ్రీమంతుడు మన మహేష్  .. అందుకే  ఈ టైటిల్ మన మహేష్ బాబు కి సూపర్ గా సెట్టయ్యింది .. "మిర్చి" లాంటి దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం లో ఈ "శ్రీమంతుడి "కబుర్లు కొన్ని ఇలా .. 

కథ ట్రైలర్ లో చెప్పేశారు లెండి .. 
25000 కోట్లు .. ఎన్ని సున్నాలో కూడా ఉన్న పళంగా చెప్పలేం .. అంతున్న హర్ష కి తన చుట్టూ ఉన్న వారికి మంచి చేయాలనే తపన అంతకు రెట్టింపు ఉంది ..సాటి మనిషి కోసం చలించే  హర్ష కి సరయిన మార్గం చూపిస్తుంది చారుశీల (శ్రుతి హసన్ ) .. సో ఓ ఊరి దత్తత తీసుకునే కారాణాలు .. దాని పర్యవసానాలు సమాహారమే శ్రీమంతుడు .. 

మహేష్ .. ప్రపంచంలో అత్యంత అందగత్తెను తీసుకురండి .. ఆమె నుంచి కూడా చూపు మరల్చగల  అందగాడు .. .. మన ఊరికి .. మన సమాజానికి ఎంతో కొంత తిరిగివ్వాలని సందేశం ఇచ్చే పాత్ర .. చాలా బాగుంది .  అంతే కాదు కావలనుకున్నప్పుడు హీరోయిన్ తో సరసాలు.. అలాగే విలన్ గ్యాంగ్ తో బోలెడన్ని పరాచికాలు .. అలా మహేష్ కి అన్ని సెట్టు అయ్యాయి . 
శ్రుతి హసన్ ఎప్పటిలా అండ్ ఎప్పటికంటే అందంగా ఉంది .. మహేష్ అంటాడు " you are beautiful from inside " అలా మహేష్ కి కరెక్ట్ దారి చూపించే రోల్ లో బాగా చేసింది . 
జగపతి బాబు ఇంత తొందరగా మహేష్ లాంటి హీరో తండ్రిగా చేసేస్తాడు అనుకోలేదు .. బట్ చేసి మంచి పని చేసాడు .. నిడివి తక్కువ ఉన్నాజగపతి బాబు లాంటొడె చెయ్యాల్సిన పాత్ర అది . రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా సరైన బాగం దొరికింది . సుకన్య .. సితార కంటే తులసి గారికె ఎక్కువ మార్కులు .. వెన్నెల కిషోర్, ఆలి  నవ్వించారు .. ముకేష్ రుషి .. సంపత విలనీ జస్ట్ ఓకే . 

"స్వదేశ్ " లాంటి సందేశం .. 
స్వదేశ్ లో షారుక్ ఖాన్ చెప్పినట్టు .. మన ఊరికి దేశానికి తిరిగివ్వక పోతే లావు అవ్వడమే కాదు .. మనిషి అనే దానికి విలువ కూడా ఉండదు .. అలాంటి మంచి ఆలోచనలు చుట్టూ కథ అల్లుకోవడం చాలా బాగుంది . హీరో హీరోయిన్ సంభాషనల్లో హుందాతనం .. విలన్లకు వార్నింగ్ ఇచ్చే డైలాగుల్లో స్పార్క్ + చమత్కారం రెండూ కుదిరాయి . రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో అన్నదమ్ములు విడిపోకుండా ఆపే సీన్ లో సంభాషణలు బాగున్నాయి . 

ఇవి బాగుండాల్సింది .. 
మంచి మాటకి కమర్షియల్ హంగులద్ది చెప్పటం చక్కటి ఆలోచనే .. కాని అలా చెప్పే విధానం లో కనెక్టివిటీ లేదు .. సినిమా క్లైమాక్స్ లో ఊరి జనం కోసం ఒక్కడిగా వెళ్లి ఫైట్ చేస్తాడు హీరో .. ఫైట్ అంతా అయ్యాక ఏదో పోలీసులు ఒచ్చినట్టు ఒస్తారు ఊరి జనం .. కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అంటారు .. కాని మరీ కండలు బలిసిన వాళ్ళు బంతుల్లా బౌన్సు అవుతుంటే నవ్వొస్తుంది .. అలాగే జగపతి బాబు ఊరొచ్చి కొడుకుని బలవంతంగా తీసుకెళ్ళే బదులు కొడుకుని మెచ్చుకుని జనం అందరు కలిసి తిరుగుబాటు చేసుంటే ఒక పావుగంట తగ్గి ఇంకా నప్పేది .. 


ఇవ్వన్ని బాగున్నాయి .. 
దేవిశ్రీ పాటలు వినడానికి ఎంత బాగున్నాయో స్క్రీన్ మీద కూడా అంత బాగున్నాయి . అలాగే సినిమా ని ఆసాంతం అందంగా మలిచారు సినిమాటోగ్రాఫర్ మధి . ఈ సినిమా తమిళం డైరెక్ట్ రిలీజ్ చెయ్యాలనే ఆలోచన ఆయనదెనంట .. సో మన సినిమాలకు మంచి రోజులే .. 

మొత్తంగా .. 
చాలా చక్కటి సందేశాన్ని ఇంకెంతో హుందాగా .. సాద్యమైనంత కమర్షియల్ గా చెప్పాడు శ్రీమంతుడు .. పాటలు,మాటలు ..మంచి పాత్రలతో మనని సంతృప్తి పరిచే సినిమా శ్రీమంతుడు .. ట్రైలర్ లో ఇంతే చెప్పాం .. ఇంత కంటే చూపిస్తే లావయిపొతాం అనే కంటే ఇంకొంచెం సర్ప్రైజ్ చేసుంటే ఇంకా బాగుండేది 

70/100

Please follow me on twitter https://twitter.com/chakrireview

Thursday, July 9, 2015

BAAHUBALI MOVIE REVIEW


So what is July 10th…. It’s not a Worldcup final.. Where India and Pakistan are fighting for it…neither it is an election-result for telugu states or India or USA..nor it is a end of year to make a countdown, But it is far more than that for the ardent lovers of “Telugu” Cinema…As they were fondly and more eagerly and much more impatiently waiting for the biggest production of Indian cinema “BAAHUBALI”.. So we call July 10th the #BaahubaliDay.. And the man behind it, who has successes and only successes to his credit.. the undefeated director SS Rajamouli..

Plot as one could imagine by trailers…
Sivudu a happy going lad from tribal village always dreams of crossing huge waterfall surrounding his village .. and What awaits him on other side of that is the adventure of his life which makes him meet his mother who is in capture of the most wicked King Bhallaladeva..

Characters are memorable..
Someone once rightly said in a film.. “vaadi Body Boxoffice..” So that is Prabhas as Sivudu in one word.. looks macho.. always in for an adventure and the motto of this character is to bring us the question “Who is Amarendra Baahubali”..
Baahubali” means the Strongest … The Director envisioned him as very noble… Very Righteous and his heart is always filled with love for his people… “100 mandini champithe veerdu antaaru.. okka praananni kaapadithe Devudu antaaru” is what makes him divine… More of him to be revealed in part2. While he played Sivudu with energy, Baahubali is simply lovable..

Bhallaaladeva , very aptly played by Rana..he has wonderful diction and is so charming for a villain .. If at all Mahabharatha is remade.. he will be the best choice for Duryodhana .. He brings such an aura for a bad guy..!!

RamyaKrishna behaves positively in this part and her histrionics takes the character of Sivagami to next level.. But waiting for reality of her character in next part.. that would be more interesting ..
Nasser is just adequate as bijjaladeva .. nice graphic for a handicapped hand.. again waiting for more in 2.


Kattappa played by Sathyaraj is by far the best role in the film… Epitome of loyality.. Heights of helplessness … Superb… what an actor he is.. no problem at all to see him more in telugu films..
Anushka as Devasena becomes “Bommali” again.. stunning makeover..Such a brave appearance..
Tammana plays avanthika.. surprisingly not as expected and sticks to the Songs and of course  does few action scenes too..Adivi Sesh play Bhadra, Son of Bhallaaladeva. Kichcha Sundeep is very brief. Rohini and Tanikella Bharani are good. Prabhakar is fine as kalakeya

Epic War Episode and VFX unbelievable …!!
Waterfalls touching the sky… Marvellous Palace of Maahishmati.. Stunning episode of lifting the hundred foot statue of Bhallaaladeva… And that Royal atmosphere sprinkled all over .. everything is made believed that it is real..
And Top of the scoop is the war episode.. That episode has wonderful choreography.. the Visual grandeur perfectly tunes with the Warcraft and thus elevates our heroes and that ends the movie in apt way with a good twist at the end..

Rajamouli.. the creator of Baahubali..
There were tons and tons of expectations and he need to deliver that and at same time distribute the story between two films.. He being the master of his craft, has sufficient episodes to bring that “Wow” factor.. A Subtle “Interval” that has such a “Silence” effect... (Of course not the best of Rajamouli’s intervals).. And the great Rain fight that begins the flashback..

Once the Baahubali comes live.. Everything turns much more brighter.. And that epic war episode.. Salute..Salute..Salute.. for Rajamouli and his VFX team, Senthils photography and Keeravani’s extraordinary background score..

Buts..
Love episode of Sivudu and Avantika is artificial and quicky quick . Lot of love for Baahubali makes Sivudu run very fast without proper adventure or emotion especially when he meets his mother. Expecting a very nice drama between brothers for the Part2.

Please go bit early to the theatre to reserve a back seat!!
As this is one movie that is never to be missed in the theatre.. so that’s the advice I could share with you..:) Baahubali “The Beginning” Visually treated me well.. but waiting for a cunning and emotional “Conclusion”.. So Baahubali.. come make all the old Box office records bali..

Rating
80/100  :)

By the way.. Slight misses in songs but mostly right.. and exact match of the plot.. in the music review here..

And follow this guy on twitter..
https://twitter.com/chakrireview




Monday, June 29, 2015

BAAHUBALI MUSIC : JOINING THE DOTS..!!


SS రాజమౌళి .. సక్సెస్ ని ఇంటి పేరు గా మలుచుకున్న దర్శక ధీరుడు ... ప్రేక్షకులను అంచనాలకు మించి అబ్బురపర్చడం ఆయనకి అలవోక .. విజయాన్ని మించిన విజయం అందిచడం ఆతనికి మహా తేలిక ... అదిగో అందుకే "బాహుబలి " అనే ఆ మహాద్భుత దృశ్య కావ్యం కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు ... రెండు భాగాలుగా వచ్చే బాహుబలి మొదటి భాగం జూలై 10న విడుదల కాబోతోంది .. కీరవాణి గారు స్వరపరిచిన పాటలు .. ఒక్కక్కటిగా తెలుస్తున్న విశేషాలని విశ్లేషించుకుంటూ మీ కోసం ఈ "BAAHUBALI MUSIC : JOINING THE DOTS"


"శివుని ఆన అయ్యిందేమో గంగ దరికి లింగమే కదిలోస్తానంది" .. 
ఈ సినిమా ప్రచారం లో బాగంగా ప్రభాస్ ని శివుడి పాత్ర లో చూపించిన మొదటి పోస్టర్ కి సంబందించిన బ్యాక్ గ్రౌండ్ సాంగ్ ... హీరో పరిచయ సన్నివేశాల్లో భాగంగా మన కండల వీరుడు.. అలా శివలింగం మోసుకోస్తుంటే వెంట్రుకలు నిక్క పోడుచుకునేలా హీరోయిసం స్క్రీన్ మీద శివతాండవం చేస్తుంది .. ఇనగంటి సుందర్ రచించిన ఈ స్తోత్ర గేయాన్ని అంతే భావోద్వేగంతో స్వయానా కీరవాణి గారు ఆలపించారు .. 


ధీవర .. 
"ధీర ధీర ధీర .. మనసాగ లేదురా ..." ఇక మరిచిపొండి ఆ పాటని (సరదాకి ...).. ఎందుకంటే ఇప్పుడు ధీ"వ"ర ఒచ్చాడు .. పదే పదే ... పదే పదే వినాలనిపించే పాట .. తెర మీద ఎప్పుడు ఎప్పుడు చూస్తామా అనిపించే పాట .. మన ఆజానుబాహుడు  "శివుడి" కోసం సాక్షాత్తూ  అమరలోకం నుండి అవంతిక దిగి వస్తుంది ..అందని లోకపు చంద్రికై ఆహ్వానిస్తుంది .. రామజోగయ్య శాస్త్రి గారు యుగళాన్ని రాస్తే .. "ధీవర ప్రసర సౌర్యధార.. ఉత్సర స్ధిర గంభీర .. ఉగ్రవ అసమ సౌర్య ధామ .." ఇలా అనేక పర్యాయ పద విజ్రంబనతో శివశక్తి దత్తా గారు ఆకట్టుకున్నారు .. ఇంతకీ "వీరాట్వీర" అంటే అర్జునుడేగా  !! రమ్య బెహార .. దీపు ఆలపించారు ఈ పాటని.. ఇది మొదటి యుగళ గీతం కావొచ్చు ..  

పచ్చ బొట్టేసినా పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలనే పంచుకుంటాను రా ... 
 అవంతిక శివుడి మధ్య ప్రేమ చిగురించే సమయంలో ఒచ్చే పాట .. ఇక్కడ పచ్చబొట్టుకి ఏంటో ప్రాధాన్యత ఉందట .. అంటే బహుసా ఆ "పచ్చబొట్టు" ద్వారానే శివుడిని కారణ జన్ముడి గా గుర్తించి దేవకన్య వరించిందేమో !! అనంత శ్రీరాం ఎంతో రమణీయం గా రాసిన ఈ యుగళ గీతాన్ని కార్తిక్ , దామిని అంతే రమ్యంగా ఆలపించారు ... నాకు కొంచెం గా పంచదార బొమ్మ గుర్తొస్తుంది సన్నివేశ పరంగా .. అంటే అంత బాగుంటుంది అన్న మాట ..


మమతల తల్లి .. ఒడి బాహుబలి ... 
శివుడి సాహసాలతో .. ఆట పాటలతో సరదాగా సాగిపోయే కథలో శివుడి తండ్రి "బాహుబలి" గురించి తెలుసుకునే సమయం ఒచ్చింది ..అలాగే ఆ "బాహుబలుని" తల్లి "శివగామి" . ఈ కధని .. అలాగే దర్శకుడు రాజమౌళికి ఎంతో స్ఫూర్తి నిచ్చి ముందుకు నడిపించిన అద్భుతమయిన పాత్ర శివగామిది ..ఆ పాత్ర తీరుని తెలపడానికి "యదలో ఒక పాల్కడలి .. మధనం జరిగే స్థలి "  సాగర మధనం జరిగినపుడు విషం అమృతం పుడతాయి .. అలాగే ఆమె హృదయం లో నిరంతరం మధనం జరుగుతూనే ఉంది .. మరో సారి  "శాసన సమం శివగామి వచనం .. సదా రణరంగం నిరతం జనని హృదయం" .. అంటే ఆమెలో అనునిత్యం యుద్ధం జరుగుతూనే ఉంది .. ఇదే పాటలో బాహుబలి పాత్ర కూడా పరిచయం జరుగుతుంది .. మాహిష్మతి వర చాత్ర కులి చిత శాత్రవ బాహుబలి .. సాహస విక్రమ ధీశాలి అంటూ "భళ్ళా" తోనే సావాసం అంటూ మన "భల్లాలదేవ" రానా పరిచయం కూడా జరుగుతుంది .. శివ శక్తి దత్తా అతి శక్తివంతంగా రాసిన ఈ పాటను సూర్య యామిని కళ్ళకు కట్టినట్లు పాడారు .. ఈ పాట సినిమాలో కొంచెం కొంచెం గా రావొచ్చు ... 


నిప్పులే శ్వాసగా .. గుండెలో ఆశగా .. 
ఇప్పుడు బాహుబలి భార్య దేవసేన (అనుష్క) వంతు .. ఎన్నో ఏళ్ళుగా కారాగారం లో ఉన్న ఆమె చూపుకి " రాజ్యమా ఉలికి పడు " అని హెచ్చరిక జారీ చేస్తుంది ఈ పాట .. అనుష్క ఈ భాగం లో కొంచెం సేపే కనిపిస్తుంది ..  రెండవ ఆ బాగం లో బాహుబలి దేవసేనల ప్రేమ కథ .. ఆమె ఈ స్తితిలో ఉండే కారణాలు తెలుస్తాయి !!

మనొహరి... 
ఇక బాహుబలి లో ఐటెం పాట వంతు ..నోరా ఫతేహి నృత్యం చేసిన ఈ పాటని రేవంత్ చాల బా పాడాడు .. ఈ పాట సినిమా మొదట్లోనే రావొచ్చు "ఛత్రపతి" లో లా ... 

కథ ఇదని ఊహించడం ఇష్టం లేదు .. 
కాని కథనం ఇలా ఉండొచ్చు .. మొదట శివుడి పరిచయం .. అతని ధీరత్వం .. దేవకన్య అవంతిక తో ప్రణయం .. ఇంటర్వెల్ సమయానికి  శివుడికి అతని పుట్టుక గురించి తెలుస్తుంది .. అతను అడివి విడిచి తల్లిని చూడటానికి మాహిష్మతి రాజ్యం లో అడుగుపెడతాడు ... అక్కడనుంచి బాహుబలి కథ మొదలవుతుంది .. కాలకేయుడు అనే రాక్షసుడి తో చేసే ఓ భారి యుద్ధం తో పాటు బాహుబలి .. భల్లాలదేవ మధ్య వైరం మొదలవ్వడంతో ఈ భాగం ముగుస్తుందేమో .. వారి పూర్తీ కథ రెండవ బాగం లోనే చూడాలి .. 

దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్ ... రోజుకి వెయ్యిమంది శ్రమదానం చెయ్యగా నిర్మించిన భారీ కట్టడాలు .. 600 మంది సాంకేతిక నిపుణులు .. "మకుటా"యమానంగా దేశ విదేశాల్లో పూర్తి చేసిన VFX .. 
2 గంటల 38 నిమిషాలు నిడివి ఉంది కాబట్టి .. అలా మనని మనం మరిచిపోయి మాహిష్మతి రాజ్యం లో విహరించేందుకు ఎంతో ఉత్సుకగా ఉండే ఉంటుంది నాలా అందరికి .. 
తెలుగు వారు గర్వంగా యావత్ సినీ ప్రపంచానికి అందించే ఈ మహత్తర కానుక ఎన్నో అంచనాలని అందుకుని విజయ కేతానాన్ని ఎగుర వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ..   - ఓ అభిమాని 

Wednesday, April 8, 2015

Son of Satyamurthy movie review


వరల్డ్ కప్ అయిపొయింది .. ఎగ్జామ్స్ అయిపోయాయి .. ఇక మిగిలిన  మండే ఎండల్లో మనకి రిలీఫ్ ఇచ్చేవి రెండే రెండు .. ఒకటి IPL .. రెండోది సినిమాలు ... ఈ సమ్మర్ కి మొట్టమొదటి భారి సినిమా 
S/O సత్యమూర్తి . డైరెక్టర్ త్రివిక్రమ్ "అత్తారింటికి దారేది" హీరో అల్లు అర్జున్ "రేసుగుర్రం" రెండు బ్లాక్ బస్టర్లే . సో ఆటోమేటిగ్గా ఈ సత్యమూర్తి గారబ్బాయి మీద అంచనాలు సూపర్ గానే ఉన్నాయి .. 

రివ్యూ లో కథ చెప్పకూడదు కదండీ ..సో !!
మేటర్ ఏంటంటే తన తండ్రి పేరు నిలబెట్టడానికి ఓ కొడుకు చేసే ప్రయత్నం .. తద్వారా తండ్రి నేర్పిన విలువల యొక్క విలువ తెలుసుకుని.. కోరుకున్న అమ్మాయిని ఎలా దక్కించుకున్నాడనెదే సినిమా .. 

సినిమాలో స్టార్స్ గురించి చకా చకా ... 
విరాజ్ ఆనంద్ .. ఇది సినిమాలో  అల్లు అర్జున్ పేరు.. కొంచెం చలాకీ .. కొంచెం ఎమోషన్ మిక్స్ చేసిన రోల్ . ఇంత కంటే సూపర్ ఎనర్జీ ఉన్న క్యారెక్టర్ లు ఇప్పటికే బోలెడు చేసాడు బన్ని .. సో ఈ సినిమాకి కొత్తగా ఉంది అంటే హెయిర్ స్టైల్ ఒక్కటే ..!!

ఈ సినిమాకి "ప్రత్యేక" బలం ఉపేంద్ర. అతని యాస, నటన .. ఆయన చేసిన ప్రతి సీన్ యొక్క స్థాయిని పెంచాయి  ..  స్నేహ బాగుంది .. "సూపర్ మచ్చి" పల్లవి కి డాన్సు సూపర్ గా చేసింది . డబ్బు పిచ్చోడి గా రాజేంద్ర ప్రసాద్ బాగా చేసారు . ఆలి ఆసాంతం సపోర్ట్ గా నిలిచాడు . ఎమ్మెస్ గారిని మరో సారి చూసాం సంతోషం ..!! బ్రహ్మానందం గారిని ఈ రోల్ లో ఒక 786 సినిమాలు చూసుంటాం .. మల్లి అదే చేపించడం .. ఇక ఎం చెయ్యలేం ... 

ముగ్గురి హీరోయిన్లలో మెయిన్ సమాంత .. ఎందుకంటే ఆమెకే హీరోతో ఫుల్ సాంగ్ ఇచ్చారు కాబట్టి . .. అంతకు మించి ఆమె చేసిందేమీ లేదు .. నిత్య మీనన్ ఇంట్రడక్షన్ లో అమ్మో సినిమాలో ఈమె ట్విస్ట్ అనిపిస్తుంది కాని ఆమెని అంతెం వాడుకోలేదు ... ఇంకో అమ్మాయి అదా శర్మ రోల్ గెస్ట్ రోల్ కి ఎక్కువ .. సెకండ్ హీరోయిన్ కి తక్కువ 

విలువలు జాస్తి .. కొత్తదనం నాస్తి .. 
రాముడు కేవలం ఒక్క చాకలి వాడి మాటకి విలువిచ్చి ఎం సాదించాడు .. రావణుడు సీత ని వదులుకోకుండా ఎం కోల్పోయాడు .. ఇలా మన పురాణాల్లో నుండే మన సినిమా కథలు పుట్టుకొస్తాయి అని హీరో తో చాలా చక్కటి ఉదాహరణలు ఎన్నో చెప్పించారు త్రివిక్రమ్ .. ఎక్కువగా అమ్మ సెంటిమెంట్ .. చెల్లి సెంటిమెంట్ చూస్తాం .. కాని నాన్న పంచే విలువని కథలో అంతర్లీనం గా బాగా చెప్పించాడు .. 

కాని అదే పని గా .. ఒకే లాంటి కథనం .. ఫారిన్/సిటీ లో ఉండే హీరో.. ఇద్దరు అమ్మాయిలు ఓ పార్టీ సాంగ్ .. ఇంటర్వెల్ లో సమస్య .. ఒకే ఇంటిలో గుంపుగా చేరడం .. చివర్లో బ్రహ్మానందం .. త్రివిక్రమ్ గారి సినిమాలతో పోల్చినా అత్తారింటికి చాయలు ఎక్కువ కనిపిస్తాయి .. ఆ కథలో ఉన్నంత పట్టు ఇక్కడ లేదు .. 

టెక్నికల్ గా 
సాంగ్స్ బానే ఉన్నాయి .. సినిమా నిండుగా కలర్ ఫుల్ గా ఉంది .. 


ఫైనల్ గా 
ఎమోషనల్ గా ఉండే సీన్స్ తో ఆకట్టుకునే సంభాషణలతో టైటిల్ని ఫుల్లుగా జస్టిఫై చేసారు త్రివిక్రమ్ .. అలాగే కొత్తదనం రవ్వంతైనా లేకుండా నిరాశ కూడా పరిచారు ..  కాని టైం పాస్ కోసం .. ఓ భారి సినిమా చూసాం అనే తృప్తి కోసం ఓ సారి చూసేయోచ్చు .. ఎందుకంటే సమ్మర్ కి "సినిమాలే  ఆస్తి " ..:)

రేటింగ్ .. 
61.125 /100 రేటింగ్ కూడా రొటీన్గా ఎందుకులే అని ..:) 

Saturday, March 21, 2015

Yevade Subramanyam Review

ఒకప్పుడు కృష్ణ గారి ఏడూ సినిమాలు ఒకేసారి థియేటర్లలో సందడి చెసేవట .. అప్పుడెప్పుడో బాలకృష్ణ బంగారు బుల్లోడు , నిప్పురవ్వ ఒకేసారి విడుదలయ్యాయి .. మళ్ళీ చాలా కాలం తరువాత ఈ ఉగాదికి నాని రెండు సినిమాలు జెండా పై కపిరాజు ... ఎవడే సుబ్రహ్మణ్యం .. విదుదలయ్యాయి.  లేటెస్ట్ బెటర్  మరియు హిమాలయాలు కూడా చూసోచ్చేయోచ్చు అనే ఆలోచన తో నా ఓటు సుబ్రమన్యాణికే వేసాను . 

కథ : జీవితం లో బోలెడంత డబ్బు సంపాదించాలి అనే లక్ష్యాన్ని 8వ తరగతి నుంచే ఒంటబట్టించుకుంటాడు సుబ్రహ్మణ్యం  . తను కోరుకునే పదవి , బాస్ కూతురితో పెళ్లికి రెడీ అవుతూ  .. అంతా ఒకే అనుకున్న  టైం లో తన చిన్ననాటి స్నేహితుడు రిషి .. వాళ్లెప్పుడో చిన్నపుడు అనుకున్నట్లుగా హిమాలయాల దగ్గర దూద్ కాశి కి వెళ్ళాల్సిందే అని పట్టు పడతాడు .. 
అలా నాని ఆశల్ని తలకిందులు చేస్తూ జీవతపు రుచి చూపించి .. అసలు ఎవడీ సుబ్రహ్మణ్యం అని తేల్చి చెప్పే ప్రయాణమే అసలు సినిమా .. 

ఎలాంటి పాత్రలోకైనా పరకాయ ప్రవేశం చేయగల సత్తా ఉన్న నటుడు నాని ... డబ్బు హోదానే లోకంగా తలిచి.. జీవిత తత్వాన్ని .. స్నేహపు విలువల్ని తెలుసుకునే క్రమంలో ఆ పాత్ర లో మార్పుని చక్కగా ప్రెసెంట్ చేసాడు . రిషి (విజయ దేవరకొండ)ది సినిమాలో కనిపించినంత కాసేపు బోలెడంత సందడి చేసి .. మిగిలిన సగాన్ని నడిపించే క్యారెక్టర్  .. హీరోయిన్ హైట్ ఉన్న నిత్యమేనన్ లా ఉంది . అందంతో కంటే అభినయం తో ఆకట్టుకుంది . కృష్ణంరాజు గారిది హుందా నిండిన పాత్ర . షావుకారు జానకి గారిని మరోసారి చూసే అవకాశం దక్కింది. పెంబా గా చేసిన హిందీ నటుడు ఆకట్టుకున్నాడు. 
గౌతమ బుద్దుడు .. గమ్యం .. సుబ్రహ్మణ్యం .. 
సిద్దార్దుడు  రాజ్యాని త్యజించి జీవిత సత్యాన్ని గ్రహించే కథతో క్రిష్ గమ్యం చేసారు .. అలాంటి ఓ కాన్సెప్ట్ తో గొంగళిపురుగు లాంటి మనిషి తత్త్వం సీతాకోక చిలుకలా ఎలా పరివర్తన చెందిందో ఓ సరికొత్త ప్రయాణం లా రూపొందించాడు కొత్త డైరెక్టర్ నాగ అశ్విన్ . 

మనమెప్పుడు వెళతామో దూద్ కాశి ?
మొదటి సగం లక్ష్యం ఒక్కటే .. హీరోని హిమాలయాలకు పంపాలి ..  ఇంటర్వెల్ తరువాతే అసలు ప్రయాణం .. ఒక్కో సీన్ ని మించిన కాన్వాస్ ఇంకో సీన్ కుంది . అడుగడునా వావ్ అంటూనే ఉంటాయి మన కళ్ళు .. నిజంగా చూసిన వారికి .. సినిమా తీసిన వారికి పాపం కాళ్ళ నెప్పులు ఉంటాయేమో కాని ..అంత అందంగా హిమాలయాలు చూపిస్తుంటే ఇక వేరే వంక ఎం పెట్టాలి అనిపించలేదు . లైఫ్ అంటే లెక్కలు నిచ్చెనలు అనే ఆలోచన నుంచి స్నేహం కోసం ప్రాణాలకి తెగించే , నిజమైన ప్రేమని గుర్తించే మనిషి లోపలి ప్రయాణం కళ్ళకి కనిపించే కొండలు కొనలకి దీటుగా ఉంది . పాటలు అందంగా సందర్భోచితంగా ఉన్నాయి  

చివరగా .. 
మనకి మంచి సినిమాలు కావాలి .. మసాలా సినిమాలు కావాలి .. అలాగే అడపాదడపా మంచివి వస్తూనే ఉన్నాయి .. సో మంచు కొండల్ని చూస్తూ .. ఓ మంచి మెసేజ్ ని ఆస్వాదించాలంటే ఆలస్యం చెయ్యకుండా సుబ్రమన్యాణ్ణి పలకరించి రావొచ్చు .. 

రేటింగ్ 
మైనస్ లకి సరిపడా 35 తీసేస్తే 65/100

Friday, February 13, 2015

Temper Movie Review


అన్నిఉన్నా .. అల్లుడి నోట్లో శని .. అనే ఓ సామెత ఉండేది .. అలాంటి మన లాంటొల్లలొ ఎన్టీఆర్ ఒకరు .. అతి పిన్న వయసులోనే గొప్ప విజయాలు అందుకున్న చిన్న ఎన్టీవోడు .. ఈ మధ్య కాలం ఒకటి అరా మోస్తరు సినిమాలు తో సరిపెట్టుకున్నాడు .. ఎన్నాళ్ళో ఎదురు చూసిన 'బంపర్' హిట్టు 'టెంపర్' తో వచ్చిందని తోలి రోజు టాక్ .. 

మనకి తెలీని కథెం కాదు : సినిమాకో కథ ఎక్కడ పుట్టుకొస్తుంది చెప్పండి .. ఓ లంచగొండి పోలీస్ .. ఒక దారుణమైన సంగటణ ..  హీరోలో మార్పు .. అరె ఈ సినిమా మొన్నే చూసాం అనిపించిందా అనిపిస్తే అనిపియ్యనివ్వండి .. కాని తెలిసిన కథ నే సూటిగా చెప్పి తరువాత ఎం జరుగుతుంది అని అనిపించేలా చెయ్యటం ఈ డైరెక్టర్ కి "పూరి" తో పెట్టిన విద్య .. 

పూరి .. నందమూరి !!
అదుర్స్ లో నవ్వించాడు .. రాఖి లో విజ్రంబించాడు .. పూరి హీరోల్లో ఉండే ఓ ఈజ్,తిక్క .. అలాగే ఎన్టీవోడు లో ఉండే ఓ కసి,ఆవేశం రెండు సమపాళ్ళలో కలిసాయి ఇన్స్పెక్టర్ దయ లో .. ఓ మా చెడ్డ పోలీస్ లా చెయ్యటమే ఎన్టీఆర్ కి కొత్త .. అలా చెడుని కూడా స్టైల్ గా చేసుకుంటూ .. సరైన టైం లో రివర్స్ గేర్ వేసే పాత్ర లో ఎన్టీఆర్ చెలరేగిపోయాడు .. ఫాన్స్ దిల్ కుష్ చేసాడు ..!!

 మొదటి సారి తను రాసిన కధ కాకుండా వక్కంతం వంశి కథ తో సినిమా తీసాడు పూరి జగన్నాథ్ .. ఈ మధ్య ఆయన కథనాల్లో ఓ కొంత నిర్లక్ష్యం కనిపిస్తుంది .. కాని ఈ సారి ఓ దేవుడి దండలో పూలు గుచ్చినంత అందంగా సన్నివేశాలు పేర్చాడు .. ఫస్టాఫ్ లో వచ్చే సీన్స్ ని రెండో సగం లో సింక్ చేస్తూ .. హీరోలో మార్పు మెప్పించేలా చూపించి .. క్లైమాక్స్ లో ఈ సమస్య కి పరిష్కారం .. ఇన్ని సినిమాలు చూసిన ఓ ప్రేక్షకుడు ఊహించని విధంగా చెప్పి శభాష్ అనిపించుకున్నాడు . 

ఏ హీరో తో సూపర్బ్ కెమిస్ట్రీ ఉండే విలనీ ప్రకాష్ రాజ్ కి వరం . పోసాని కృష్ణమురళి  గారిది హీరో ని హీరో గా చేసే  అద్బుతమైన పాత్ర . హీరోని పెళ్లున చెంపదెబ్బ కొట్టాలంటే అది తనికెళ్ళ భరణి గారు కొడితేనే కిక్కు . 

ఇన్ని సినిమాలు చేసినా ఇంకా చూడముద్దొస్తుంది కాబట్టే కాజల్ ఒక్కో హీరోతో రెండేసి మూడేసి తీస్కుంటూ పోతుంది .. వెన్నెల కిషోర్ నవ్విస్తూ అయ్యో పాపం అనిపించాడు. ఆలి , రఘుబాబు , సప్తగిరి ఫస్టాఫ్ కవర్ చేసారు !!

మ్యూజిక్ సిస్టం .. ( ఈ హెడ్డింగ్ సినిమా చూస్తె తెలుస్తుంది )
అనూప్ పాటలు బాగున్నాయి సినిమా ఫ్లో లో కరెక్ట్ గా కుదిరాయి . మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మనల్ని సినిమా లో లీనం చేసింది .. 

చివరగా .. 
ఓ పెద్ద హీరో సినిమా చూసి ఓ రెండు మూడు వారాలు అయ్యింది కాబట్టి .. కొంచెం కామెడి ... ఓ నాలుగు మాంచి సాంగ్స్ .. కావలసినంత ఎన్టీఆర్ .. కొంచెం మీ మూడ్ ని టెంపర్ తో నింపుకుంటే టెంపర్ నచ్చే ఛాన్స్ ఉంది .. ట్రై చెయ్యొచ్చు .. 

రేటింగ్ 
65 +5 కరెక్ట్ గా వర్కౌట్ అయ్యిన కాంబినేషన్ కోసం !!
Follow my twitter handle  @chakrireview https://twitter.com/chakrireview

Friday, January 23, 2015

PATAS MOVIE REVIEW

నందమూరి కళ్యాణ్ రాం కి ... "అతనొక్కడే" సినిమా తరువాత మరో మంచి హిట్టు రావాలని కేవలం నందమూరి అభిమానులే కాదు .. ఇంకా ఎంతో మంది కోరుకొని ఉంటారు .. !! కాని హిట్టు ఎవరో కోరుకుంటే రాదు ... అలా వచ్చెయ్యలంతే .. ఓ "పటాస్" లాగ ..!!

కథ మామూలే ... 
జీవితం లోజరిగిన కొన్ని చేదు అనుభవాలతో అవినీతి పోలీస్ ఆఫీసర్ గా మారిన హీరో .. ఇంటర్వెల్ టైం కి ఎలా తిక్క రేగి సరైన రూట్లోకి వచ్చి విలన్ల పంబ రేపుతాడో అనేది పటాస్ కథ .. 

కళ్యాణ్ రామ్ .. ఫస్ట్ నుంచి లాస్టు దాకా.... 
కళ్యాణ్ రామ్ ఇంత హుషారుగా ఎప్పుడు చెయ్యలేదు .. అది క్యారెక్టర్ మహిమో .. డైరెక్టర్ పనితనమో , కష్ట పడి .. ఇష్ట పడి చాలా చలాకి గా చాలా పవర్ఫుల్ గా చేసాడు "పటాస్ " లాంటి పోలీస్ పాత్రని . నందమూరి అభిమానులు తనకి దూరం అవుతున్నారేమో అని భయమో ఏంటో .. Jr ఎన్టీఆర్ తో వాయిస్ ఓవర్, బాలయ్య బాబు పాట రీమిక్స్ , హరికృష్ణ సీతయ్య సీను , ఓ ఫైట్ లో ఎన్టీఆర్ విగ్రహం ..ఇలా అన్ని లైఫ్ లైన్స్ వాడేసాడు ... 

శ్రుతి సోడి ..ఇంకో రివ్యూ లో ఈ అమ్మాయి పేరు మనం చదువుతామో లేదో మరి ?? ఈ హీరోయిన్ ప్లేస్ లో ఏ రకుల్ ఓ రెజినా నో చేసుంటే బాగుండేది .. 
సునామి స్టార్ సుబాష్ అలియాస్ మైలవరపు సూర్యనారాయణ ( మనం ముద్దు గా ఎమ్మెస్ నారాయణ అంటాం) మనల్ని పక పక నవ్విస్తూనే .. దూరంగా వెళ్లి ఏడిపించారు సార్ !!

శ్రీనివాస్ "రెడ్డి గారు " ,వాచకం .. నటన రెండు ఉన్న మంచి కమెడియన్ ... సాయి కుమార్ది కూడా మంచి పాత్రే .. కాక పోతే ఒక్క సీన్ ఇచ్చారు మంచిది . అసుతోష్ రానా పర్లేదు .. పోసాని రోల్ బాగుంది . 

కొత్తోడు .. కొట్టాడు .. అనిల్ రావిపూడి .. 
ఒకే ప్రేమ కథ ని పది రకాలుగా పది మంది దర్శకులు ఆకట్టుకునేలా చెప్పగలరు .. అలాగే ఒకే పోలీస్ కథ ని ఒక్కో డైరెక్టర్ ఒక్కో లా కుమ్మేయగలడు .. తండ్రి కొడుకు సెంటిమెంట్ .. అన్న చెల్లి సెంటిమెంట్ .. చాలా సింపుల్ గా హత్తుకునేలా చెప్పాడు. "801" సర్వీస్ , హీరోయిన్ కోసం ప్రెస్ మీట్లు etc etc తో ఫస్ట్ హాఫ్ ఫాస్ట్ గా గడిచిపోయింది . ఇంటర్వెల్ ట్విస్ట్ ఓ మాదిరిగా ఉంది .. ఎవరైనా ఊహించొచ్చు . 
ఇది కథ అని తెలిసాక కూడా పవర్ఫుల్ డైలాగులతో .. సరైన కామెడీ తో చక చక సినిమాని నడిపించటం "పటాస్" ప్లస్ పాయింట్ .. కురాన్ కి అర్ధం చెప్పే ముస్లిం ఎపిసోడ్ .. " మదర్స ఎపిసోడ్" హైలైట్స్ . 

ఎం బాలేదంటే .. 
సాదారణంగా రీమిక్స్ దండగ .. పాట ఖూనీ అయ్యింది అనుకుంటాం .. కాని సాయి కార్తీక్ సొంత పాటల కంటే ఈ సినిమా లాస్ట్ సాంగ్ .. బాలయ్య బాబు అరె ఓ సాంబ నే కేక . సో పాటలు హీరోయిన్ బాగుండాల్సింది . 

ఫైనల్లీ .. 
చాలా కాలం తరువాత ఓ హిట్టు కొట్టాడు కాబట్టి తీరిక చేసుకుని థియేటర్ కి వెళ్లి ఈ కళ్యాణ రాముడికి కంగ్రాట్స్ చెబుదాం !!

రేటింగ్ 65/100
My new twitter handle @chakrireview ( I promise only 1 post per movie, the review link)

Tuesday, January 13, 2015

I Movie Review


Some movies have maverick directors.. Some movies have brilliant actors…Some movies have awesome technicians… and finally some movies attract even more with cleverly cut trailers… And thus they become most expected movies of the season. Now Shanker-Vikram's I has everything we talked just now and so obviously is most awaited. But will all expectations turn into accolades !!

Plot: It all begins with the an ugly ogre(Vikram) kidnaps Diya(Amy) from her wedding.  Then story slowly unlocks as how a model Diya falls for a body builder Lingesa … and how their love is being destroyed by bunch of villians.. and then why this hunch-back man is taking the revenge…

Actors..
I was admired by Vikram’s immense effort for ‘I’ . He brilliantly transforms into various forms… from an aspiring body-builder to super model to a hunch-back man to a monster in a song… But due to this excess transformations.. one can see his age in form of wrinkles when he is seen as model.. Though he does well.. I could not be his best because of the stretchiness and over-elaborate narration.

Amy Jackson is beautiful. Her role is given a great importance. Upen Patel is fresh for a south Indian film and is adequate. SureshGopi, a normal audience could easily imagine the twist behind his role.
Srinivas Reddy’s voice over matches’ santhanam’s comic timing perfectly.

Expectations misfired!!!
Various stories on the making of the film… falsification of excessive budgets… luring with sleek trailers successfully tortured the first day watchers. It is such a simple story that was dragged to extreme…
Growing up watching such a great films of shanker, everyone is bound to imagine that each every moment in shankers movie is so precious. So when the director starts narrating the story in back and forth narration… Though there is nothing striking in the flashback.. but due to periodic appearance of hunch back Vikram, one keeps on thinking there is something “More than that” than seen on screen. But as things become clear by interval… the great director himself has nothing to say further.. and he repeats whatever is being told in first half.. now more elaborately testing the patience of audience.

Sprinkles of brilliance…
As mentioned, while everyone would admire the hard work made by Vikram, feel sad that his pain is not properly used. Popular song “Issaq taari”/Pareshanayya where bike, TV , phone .. everything transforms into heroine. A duet pictured in beautiful tulip gardens in China is superb. Beast song which comes as dream sequence is sort of cheating the audience via trailer!! it seems Rahman is not interested much in providing music for Indian films. By the way Fight sequences, Wrestlers raw fight, cycle fight in China, Train sequence in pre-climax are good. And the punishments given to the villains remind me Anniyan/Aparichitudu !!

Finally..!!
Sometimes it will be not as bad for second day watchers as the expectations are then set right. If you can’t wait to see Shanker and Vikrams combination on screen.. do watch the movie for few sparkles and put away all guesses.. Predictions and watch as if you could not guess what next scene is .. and who the secret villain is!!!

Rating
50/100