Tuesday, September 30, 2014

Govindudu Andarivaadele (GAV) Review


మాస్ సినిమాలు మాత్రమె చేస్తూ తన సత్తా చాటుకున్నరామ్ చరణ్ తొలి సారి పంధా మార్చి క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశి దర్శకత్వం లో "గోవిందుడు అందరివాడే " అనిపించుకోటానికి సరదాగా ఈ దసరాకి ముహూర్తం  పెట్టుకున్నాడు ...  ఆ గోవిందుడి కథా కమిషను నాలుగు మాటల్లో .. 

కొత్త కధేం కాదులేండి ..
తన ఊరి కోసం తపించే తండ్రి .. కొడుకుని డాక్టర్ చదివిస్తాడు .. కాని కొడుకు గారు అమ్మ లాంటి ఊరు కంటే అమెరికా నే కోరుకుని వెళ్లి పొతాడు . పాతికేళ్ళ తరువాత ఆ మనవడు తన కుటుంబాన్ని ఎలా కలుపుకున్నాడనేది ఈ గోవిందుడి కథ .. 

ఎవరెలా చేసారు .. 
కృష్ణ వంశి చేతిలో పడి మెరవాలని ఒకప్పుడు ప్రతి కుర్ర హీరో అనుకునేవాడు .. చరణ్ కి సరైన సమయం లో ఈ అవకాశం చిక్కింది  .. తన లోని మాస్ ని అలా పక్కన పెట్టి కథ లో ఓ ముఖ్య పాత్రలా అలా ఒదిగి పోయాడు చరణ్ . నిజానికి వంశీ కూడా తనకు కావలసినంత చేయించుకున్నాడే కానీ మరింత గా ఎం కష్ట పెట్టలేదు . 8 సినిమాల వయసున్న రామ్ కి ఇది రెండో గొప్ప చిత్రం అనుకోవచ్చు. 

మరి ఏ ఉద్దేశం తొ.. లేక పిచ్చి గానో ఈ పాత్రకి ఓ తమిళ నటుడిని అనుకున్నారో తెలిదు.. ఇది ప్రకాష్ రాజ్ మాత్రమె చేసే పాత్ర .. ఆయన సూపర్ గా చేసాడు అని చెప్పటం సచిన్ టెండూల్కర్ మంచి ఆటగాడు అని చెప్పటం లాంటిది .. 
అలాగే శ్రీకాంత్ బాబాయి లా అటుక్కుపోయాడు బంగారి గా . మెగా ఫామిలీ తో ఉన్న రిలేషన్ వల్ల .. "నా అన్న కొడుకు" అని అంటుంటే నిజమే అనిపిస్తుంది .. 

కాజల్ .. కృష్ణ వంశీ కి ఈ చందమామ కొత్త కాదు .. కాని కొత్తగా చూపించాడు కాజల్ ని .. రామ్ చరణ్ - కాజల్ వండర్ఫుల్ పెయిర్ అంతే . 
కమ్ముల బామ కమలిని కి మంచి రోలే దొరికింది .. కాజల్ తో పాటు నేను ఒక హీరోయిన్ నే అనిపించేలా సినిమా అంతా అందంగా కనిపించింది . జయ సుధ కి గ్లిసరిన్ బాటిల్ ఇస్తే ఊరుకుంటుందా .. మొత్తం అవచేస్తుంది .. 

కోట .. రావు రమేశ్  విలనీ మీద పెద్ద ధ్యాస పెట్టలేదు కిట్టయ్య . 

అంతా బావుంది కాని అంతేనా అనిపించింది ... 

అరటి తోరణాలతో .. దీపావళి కాంతులతో .. ముగ్గురు అత్తలు .. ఇద్దరు మరదళ్ళు .. వరసైన బావలు .. సూపర్ స్ట్రిక్ట్ నాన్న .. సెంటిమెంటు అమ్మ .. ఇంత సరంజామా ఉంటే కృష్ణవంశీ ఊరుకుంటాడా .. దున్నుకుంటూ పోయాడు .. చాలా సునాయాసంగా ..  

అప్పుడెప్పుడో నేను చదువుకునే రోజుల్లోనే మురారి తో తెలుగుదనం ఉన్న సినిమా అంటే ఇది అన్ని ఈనాటి ప్రేక్షకులకు రుచి చూపించాడు కృష్ణ వంశీ . సో కథ లో మురారి బావ మరదల్లు.. "అతడు"లోని వారసుడి చాయలు కనిపించినా .. ఏ సీన్ కి ఆ సీన్ బాగుంది అనిపించేలా సాగిపోయింది సినిమా .. ముఖ్యం చరణ్ కి ఇలాంటిది మొదటిసారి .. శ్రీకాంత్ క్యారెక్టర్ ఇవి బాగా కలిసొచ్చాయి .. ఆహా అద్బుతం అనేంత లేదు కాని పర్వాలేదు బాగుంది అనిపించారు డైరెక్టర్ . 

యువన్ ఇచ్చిన పాటలు స్క్రీన్ మీద ఇంకా బాగున్నాయి. కృష్ణ వంశీ పాటలకి వంకలా ... ఎలా ఎలా ..? మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మిస్సింగ్ ఇక్కడ .. 

అమ్మో చివర ఇరవై నిమిషాలు ఇరగ అని మన బండ్ల గణేష్ చెప్పాడని ఓ కర్చీఫ్ మోసుకుని వెళ్తారేమో .. సినిమా మొత్తం చుట్టేసినట్టే చివరకి కూడా చాలా సింపుల్ గా లాగించేసారు  వంశీ గారు . 

చివరగా .. 
కొన్ని సినిమాలకి టైమింగ్ బలం .. మాస్ మసాలాలు .. బ్రహ్మనందాలు ..కిక్కు ఇవ్వని టైం లో ఈ గోవిందుడు ఇంకాస్త ముద్దుగా కనిపిస్తాడు .. అన్నట్టు ఈ సినిమాలో బ్రహానందం గారు లేరండో.. 

కుంభ స్థలాన్ని కొట్టక పోయినా  ఈ పండగకి కావలసినంత కలెక్షన్స్ కొల్లగొ డతాడు  గోవిందుడు .. 

రేటింగ్ 
68/100

Thursday, September 18, 2014

AAGADU MOVIE REVIEW

Superstar Maheshbabu’sAagadu”  is of course undoubtedly most awaiting movie of the season and it hits maximum number of theatre this Friday. Trailer filled with punches.. Mahesh’s hatrick producers 14 Reels and the Dookudu’s directors Sreenu Vaitla’ combination and Thamans peppy tunes and Tamanna pairing with Mahesh.. All garnered enough craze for “Aagadu”.
Single line: Aagadu tells how a clever Police Shanker puts an end to crooked local don Damu(Sonu Sood) .
Actors:
Mahesh has done this before in Dookudu.. So it is more easy now.. and this time he just amplifies his comedy timing.. He utters punch after punch with no gap while himself imitating punch dialogues.
Tamanna has finally got a chance to share screen with Mahesh.. She does her best in songs and has very less screen presence beyond that. Sruthi hassan need not act in such a cheap item.
Vennala Kishore is very apt as side kick and he gives his best yet again. Brahmaji is good. Nazar tries hard to bring out some laughs but I did not laugh at all then. But Raghu babu and Posani’s roles clicked well and provided needed pace to the first half.
MS Narayana and Brahmanandam are less than half effective than in Dookudu. Last Reel comedy of Brahmanandam will not give that Kikk always!!
Watching Rajendra prasad in the titles might expect a similar sentiment scenes between father and son like in Dookudu.. but his role disappoints as there is no scope later. Sonu Sood is good as villain who has just body but no brain.
 
No story.. only dialogues..
There is no story to take home as such .. and all the dialogues in the trailer are covered in first 5 minutes.. So there is lots in store for the audience. While many are good and had good timing, there are as many which are so fastly used .. that many might miss them. May be time would come when audience start hating them.
Without second thought, First half is much entertaining. It runs reasonably fast with comedy episodes of Posani, Raghubabu etc . Just like anthakshari episode in Gabbar singh, we have “Meelo evaru Potugadu” here, which is reasonably hilarious.  Love track plus songs in Tamanna are good too. Audience are almost half content by interval expecting to fill in that gap with later half.
But the same old entry of Brahmanandam and redoing almost what is done before leading to expected climax making the villain (as well as the audience) the bakras belittles the second half.
Finally..
First half is fine as it had sustaining comedy episodes and nice songs. Liked “Bhel Puri” and title track on screen.. Excess of graphics spoiled Aaja Saroja a bit. Had the second half been more fresh and gripping.. it would have been worth a wait..
Nevertheless it is adequate for a weekend time pass and grab as much as collections possible for a week or two.
 
Rating
56/100