Friday, June 3, 2016

A Aa Movie Review

 ఆ ... తేట తెలుగులోని తోలి రెండు అక్షరాలాని ఓ సినిమా పేరు గా చేసినందుకు త్రివిక్రమ్ గారిని ముందుగా అభినందించాలి .. అలాగే ఆ పాత మధురం "మీనా " నేటి తరం ప్రేక్షకులకు అందించిన్నందుకు మరో సారి హాట్స్ అఫ్ చెప్పొచ్చు .. ఆనాటి కృష్ణ విజయనిర్మల చేసిన పాత్రలు నేటి తరం నితిన్ సమంతా లు ఎలా చేసారో ఓ నాలుగు మాటల్లో .. 

కథ : ధనవంతురాలు మహాలక్ష్మి(నదియ) కూతురు అనసూయ(సమంతా ) .. తల్లిదే మొత్తం పెత్తనం .. ఆమె లేని సమయం లో తండ్రి రామలింగం (నరేష్) కూతురిని వాళ్ళ మేనత్త ఇంటికి పంపిస్తాడు .. అక్కడ తన బావ(నితిన్) ని ప్రేమించి ఎలా మమ్మీ ని ఒప్పించి పెళ్లి చేసుకుంటుందో అనేదే అ ఆ 


నితిన్ .. ఇప్పటి హీరోల్లో టాప్ డైరెక్టర్స్ రాజమౌళి V.V.వినాయక్ , పూరి జగన్నాథ్ ,.. ఇప్పుడు త్రివిక్రమ్ ఇలా అందరితో చేసిన ఏకైక హీరో .. కొంచెం బెరుకు ఉండే నితిన్ నుండి మంచి కామెడి ని .. అలాగే క్లైమాక్స్ లో మంచి నటనని చక్కగా రాబట్టారు త్రివిక్రమ్ గారు .. ఇప్పుడు మనం పాత సినిమాలు ఎలాగో చూడట్లేదు కాబట్టి ఇది కృష్ణ గారు చేసిన పాత్ర అని ఎవరు పొల్చరు .. నితిన్ ఈ సినిమాతో ఒక వంద మెట్లు ఎక్కువ ఎక్కేసాడు అనేయోచ్చు .. 

సమంతా .. ఇప్పుడున్న హీరోఇన్స్ తో పోల్చుకుంటే మంచి నటి .. అలాగే మంచి పాత్రలు ఆమెని వెతుక్కుంటూ రావటం ఆమె అదృష్టం .. మనం తరువాత బెస్ట్ రోల్ ఇది తనకి .. అనుపమ పరమేశ్వరన్ చాలా చిన్న పాత్ర . నదియా అత్తారింటికి దారేది రిపీట్ చేసింది .. 

రావు రమేష్ గారు సినిమా సినిమాకి ఓ కొత్త కోణం చూపిస్తూనే ఉన్నారు .. నరేష్ గారికి కలిసొచ్చిన రోల్ ( బార్య చాటు భర్త ) ..కామెడీ కి రెగ్యులర్ కమెడియన్స్ ని కాకుండా కథలో పాత్రలు ప్రదీప్, శ్రీనివాస్ అవసరాల , పోసాని, సన, శ్రీనివాస రావు  తో చక్కగా లాగించేసారు .. 

సరదాగా అ ఆ Vs  మీనా 

నితిన్ -- సూపర్ స్టార్ కృష్ణ గారు 
సమంతా -- విజయనిర్మల 
అనుపమ - లీలా రాణి 
నరేష్ -- గుమ్మడి 
నదియ - S. వరలక్ష్మి 
రావు రమేష్ -- కే జగ్గారావు 
అవసరాల శ్రీనివాస్ -- జగ్గయ్య 
నితిన్ చెల్లి (అనన్య) -- చంద్రకళ 
ఈశ్వరి రావు ( నితిన్ తల్లి) -- పాత సినిమా లో బామ్మా నిర్మల 

పైన పేర్లు లో ఎమన్నా తప్పులు ఉంటె క్షమించండి ..  ( కే.జగ్గారావు , లీల రాణి )

గమ్మతైన విషయం ఏంటంటే పాత సినిమా లో విజయనిర్మల గారి తండ్రి రోల్ కొత్త సినిమా లో ఆమె కొడుకు నరేష్ గారు చేసారు 

త్రివిక్రమార్కు .. 

ఏదో కొరియా నుంచో ఫ్రెంచ్ నించో కాకుండా మన పాత సినిమా రీమేక్ హక్కులు కొని చక్కగా కొత్త రంగులు అద్ది ఇప్పటి ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించడం చాల గొప్ప విషయం .. ఎందుకంటే ఎంత తవ్విన తరగనంత గొప్ప కథలు మనకెన్నో ఉన్నాయి .. మధ్య మధ్య లో సాగ తీటా గా రవ్వంత చాదస్తం చూపించినా .. ఎన్నో డైలాగు చమ్మక్కులు .. ఇప్పటికే బాగా పాపులర్ అయిన " వాచ్ ఉన్న ప్రతి ఓడు టైం ఒస్తుంది అనుకుంటాడు కాని జస్ట్ టైం తలుస్తుంది " " మీరు పులి సార్ కాని పులిహొర లో పులి " ఇలా చాల ఉన్నాయ్ .. చివర నితిన్ చెప్పే నాలుగు ముక్కలు సూపర్ .. 
మిక్కి జె మేయర్ అందించిన బెస్ట్ ఆల్బమ్స్ లో అ ఆ ఎప్పటికి ఉంటుంది "యా యా /గోపాల గోపాల " అండ్ " ఎల్లిపోకే శ్యామల" ఎవర్గ్రీన్ పాటలు అయిపోతాయి .. నటరాజన్ సుబ్రమణ్యన్ కెమెరా పల్లె అందాలని కనువిందుగా చూపించాయి 

ఫైనల్ గా 

ఒకప్పటి కథే .. కొంచెం కొంచెం లాగ్ ఉన్నపటికీ చాల చోట్ల నవ్విస్తూ .. చివరికి మెప్పించే .. టైం పాస్ చేసే సినిమా అ ఆ .. 

65/100

Follow me in twitter : @chakrireview

7 comments:

  1. nitin sister role in meena was played by Chandra kala not kanchana

    ReplyDelete
  2. thanks buddy.. corrected.. was little hurried up

    ReplyDelete
  3. http://www.telugucinema.com/news/Yaddanapudi-disappointed-Trivikram

    bhayya cinema rights konaledu ...

    ReplyDelete
  4. Nice review from I am assuming nice memories. Thanks Chakri.

    ReplyDelete
  5. pata cinema ley better ..

    ReplyDelete