Monday, February 15, 2016

KRISHNA GAADI VEERA PREMA GAADHA REVIEW




నాని అంటే సాదారణమైన మన పక్కింటి అబ్బాయి ల కనిపించే అసాధారణ నటుడు .. నాని సినిమాలంటే వినోదం తో నిండిని వైవిధ్యభరితాలు .. అందుకే కొన్ని ఎదురు దెబ్బలు తగిలినా తెగువ తో తిరిగి నిలబడ్డాడు నాని .. అతని సినిమా బాగుంది అని చెవిన పడితే .. ఎంతో ఇష్టంగా థియేటర్లకు పరిగెత్తే అభిమానుల్ని సంపాదించుకున్నాడు .. 
ఎన్నో భారి సినిమాలు తీసిన 14 రీల్స్ నిర్మించిన, అందాల రాక్షసి దర్శకుడు హను రాఘవపుడి "కృష్ణ గాడి వీర ప్రేమ గాధ " నాని ఖాతాలో హాట్రిక్ హిట్టు ఎలా ఇచ్చిందో ఓ నాలుగు మాటల్లో ... 

జస్ట్ ది ప్లాట్  .. 
స్వతహాగా కొంచెం భయస్తుడైన మన కృష్ణ గాడు .. ఫ్యాక్షన్ కుటుంబానికి చెందిన మహాలక్ష్మి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటారు . తన ప్రేమ విషయం మహాలక్ష్మి అన్నయ్య కి చెప్పాలంటే చచ్చేంత భయం .. చెప్పకపోతే మహాలక్ష్మి చచ్చిపోతుందేమో అనే భయం ..  

మరి చుట్టూ ఉన్న పరిస్థితులు కృష్ణ గాడి ప్రేమని గెలిపించి ఎలా వీరుడి గా నిలిపాయో తెలియాలంటే .. ఎం చేయాలో మనకి తెలిసిందే .. 

బోలెడంత మంది .. అందరూ భ్రమ్మాండం .. 

హీరోయిన్ తో ఏకాంతంలో అమర ప్రేమికుడు .. మరు నిమిషం వాళ్ళ అన్నయ్య కనిపిస్తే పరమ పిరికితనం .. స్నేహితుడిని ఆట పట్టించి నవ్విస్తాడు .. ఇక పిల్లలతో మమేకమై వారిని ఆదుకుంటాడు .. ఇలా ఇన్ని షేడ్స్ లో మెప్పిచిన మన నానికి చేతులు అరిగేలా చప్పట్లు కొట్టినా తప్పు లెదు. 

మేహ్రీన్ కొత్తమ్మాయి బాగుంది .. ఎన్నో సీన్స్ లో కాజల్ ని గుర్తు చేస్తుంది .. తన పాత్రని మెప్పించేలా చేసింది ..
 హీరోయిన్ అన్నయ్య పాత్రదారి బాగా చేసాడు  .. సంపత్ రాజ్ ఈసారి పాజిటివ్ టచ్ ఉన్నముఖ్యమైన పాత్ర దక్కింది  .. మురళి శర్మ తీవ్రవాదిగా ఆకట్టుకున్నాడు .. ( నాని కి ఇప్పుడు లక్కీ కాంబినేషన్) . 

హీరో ఫ్రెండ్ గా సత్యం రాజేష్ ఫస్ట్ హాఫ్ నవ్వించాడు .. SI జమదగ్ని గా మాంచి ఫాం లో ఉన్న పృథ్వీ చెలరేగిపోయాడు ..భ్రమ్మాజికి మరో భలే రోల్ పడింది .. ప్రభాస్ శీను కామెడీ కూడా బాగుంది .. అన్నపూర్ణ గార్ని మన దర్శకులు ఇంకా ఎక్కువ చిత్రాల్లో తీస్కోవాలి .. 

మరీ ముఖ్యమైన వాళ్ళు ముగ్గురు పిల్లలు .. చుట్కి .. చోటా భీమ .. అండ్ ముద్దొచ్చే చిన్నారి పెళ్లి కూతురు .. బుజ్జి బొమ్మ జెస్సి .. వీళ్ళు సెకండ్ హాఫ్ ని క్యూట్ హాఫ్ చేసారు !!

"జై బాలయ్య" టాటూ తో బాలయ్య బాబుని కూడా ఈ సినిమాలో ఓ మంచి పాత్రగా మలిచారు 

హాట్స్ ఆఫ్ హనురఘవపుడి .. 
మొదటి సగం హీరో హీరోయిన్ ప్రేమ సన్నివేశాలు మెప్పిస్తాయి.. నవ్విస్తాయి  . వాళ్ళు ఎలా అయినా కలవాలి అని మనం అనుకునేలా చేస్తాయి .. సందులో సడేమియ్యగా రెండో సగానికి కావాల్సిన ఒక్కో పాత్ర పరిచయాలు అయిపోతాయి .. ఇది ఓ రాయలసీమ లో ఫ్యాక్షన్ నేపధ్యం లో ప్రేమ కథ అనిపిస్తుంది ఈ సగం చూస్తె 

ఇక రెండో సగం అనుకోని మలుపులతో పిల్లలతో పాటు మనం హైవే ఎక్కేస్తాం .. ఓ పక్క తీవ్రవాది - SI జమదగ్ని ట్రాక్ .. బ్రహ్మాజీ ట్రాక్ .. పిల్లలతో నాని .. విలన్ గ్యాంగ్ ట్రాక్ .. ఇలా ఇవ్వన్ని సమాంతరంగా నడుస్తూనే సినిమా ని ఆసక్తికరంగా ముందుకు నడిపిస్తాయి .. 

ఏదో ఒక చిన్న కథని కేవలం ట్రీట్మెంట్ తో రెండు గంటలు పైన లాగేసే సినిమాలు ఎక్కువ చూస్తాం మనం .. కాని ఈ దర్శకుడు ప్రతి పాత్రని బుర్రలోకి ఎక్కించి దాదాపు రెండు సినిమాలు చూపించాడు ఒక్క టికెట్టు మీద .. ఇన్ని పాత్రల్ని చాలా పకడ్బంది స్క్రీన్ప్లే తో నడిపించినందుకు హాట్స్ అఫ్ చెప్పాల్సిందే హను కి .. 

ఇదే ఈ సినిమాకి రవ్వంత  వీక్ నెస్ కూడా .. 
సినిమా నిడివి రెండున్నర గంటలే ఉన్నా ఇన్ని గుర్తుంచుకునే పాత్రలు ..ఉప కథలు ఉండేసరికి ఈ సినిమా ఏంటి ఇంత పెద్దగా ఉంది అనే ఫీలింగ్ ఒస్తుంది .. 

సంగీతం .. ఫోటోగ్రఫీ .. నిర్మాతలు .. మూల స్తంబాలు 
విశాల్ చంద్ర శేఖర్ పాటలు స్క్రీన్ మీద ఇంకా బాగున్నాయి .. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ దాక యువరాజ్ కెమెరా పనితనం సూపర్బ్ . ఇంత మంచి సినిమా తెర మీదకి రావాలంటే అది 14 రీల్స్ అభిరుచే . 

చెప్పానా .. చెప్పానా .. అంతా చెప్పానా ... 
లేదు .. ఫైనల్ గా ఈ ముక్క చెప్పి రేటింగ్ ఇవ్వాలి కదా .. మంచి సినిమాలు ఇష్టపడేవారు తప్పకుండా చూసే సినిమా ఈ " కృష్ణ గాడి వీర ప్రేమ గాధ "

70/100

2 comments:

  1. Nice review chakri..it's been long time since I visited this blog - Vamsi(TMW)

    ReplyDelete
  2. Yendiraa yilaa voorinchaavu... nee yenkammaa.... ika chachhinattu movie choodaalsinde ��

    ReplyDelete