Thursday, September 26, 2013

Attarintiki daaredi review


కారణాలు ఏమైతే ఏంటి పండక్కి రావాల్సిన అల్లుడు ... పండగనే తనతో తీసుకొచ్చాడు . "అత్తారింటికి దారేది" అంటూ అమాయకంగా అడుగుతూ అసలు సినేమాల్లేక అల్లాడిపోతున్న తెలుగు ప్రేక్షకులకి విందు భోజనం తో సహా వడ్డించాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  . ఆ విందు చేసిన వంటవాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అయితే రుచి ఎలా ఉంటుందో తెలీని వారుంటారా  .. !!

తినబోతూ రుచేందుకు అనుకునేవారు ..సరదాగా మెనూ ఏంటో తెలుసుకోండి . ఆల్రెడీ తినేసినవారు అరగటానికి కిళ్ళీ అనుకుంటూ రివ్యూ చదివేయండి 

అత్తారింటికి దారేదంటూ : నంద (బోమన్ ఇరాని) తనకి ఇష్టం లేని పెళ్లి చేస్కున్న కూతురు సు'నంద'(నదియా) ని కాల్చెంత పని చేస్తాడు . దాంతో కూతురు ఇల్లు విడిచి పోతుంది . పాతికేళ్ళు అయ్యాక తప్పు తెలుసుకుంటాడు . అత్త ని తీసుకు రాటానికి అల్లుడు (పవన్) ఇండియాకోస్తాడు . 

నక్క తోక తొక్కినా అల్లుడు కాబట్టే మేనత్తకి ఇద్దరు కూతుర్లు . సో ఇంకా కథేంటో మన ఆడియన్స్ అస్సలు చెప్పకర్లేదు . 

పవర్ ని ఫుల్లు గా వాడుకుంటే ఎలా ఉంటుందంటే ... 

పవన్ కళ్యాణ్ ఇంత వరకు ఒక సంపూర్ణమైన ఫ్యామిలీ స్టొరీ చెయ్యలేదు . అసలు చేస్తే ఎలా ఉంటుందో చూస్తే అర్ధమయ్యింది . త్రివిక్రమ్ రాసిన ప్రతి పంచ్ కి పది పది రెట్ల "పవర్" ఇచ్చాడు కళ్యాణ్ . ఫైట్స్ లో తన స్టైల్ ఏంటో చూపించాడు . ఇక మరదళ్ళతో రాఫ్ఫాడించాడు . పక్కన ఏ కమెడియన్ ఉన్నా సరే తన టైమింగ్ తో సిక్సులు పీకాడు . సినిమాలో ప్రణీత ఒక డైలాగు చెప్పుద్ది .." నీలో ఏదో పవర్ ఉందయ్యా .. ఎవరైనా పడిపోవాల్సిందే అని ... మరి ఇన్ని చేస్తే పడిపోరా .. 

సమంతా చిన్ని మరదలు ... పిచ్చి మరదలు కుడా . అబ్బా ఫస్ట్ హాఫ్ లో స్కర్ట్ లు వేస్తె పెద్దగా ఆనలేదు . రెండో సగం లో చీరలో కోచ్చాకే తెలిసింది తను ఎం మాయ చేసిందో అని . ఇంకో స్టార్ తో హిట్టు కొత్తిన్ది. లక్కి గాల్ . 

ప్రణిత పెద్ద మరదలు ... సినిమా క్లైమాక్స్ లో ఓ కమెడియన్ పవన్ ని వాచ్ అడుగుతాడు . వెనుక నుంచి డైలాగు తీస్కోరా నీ గుడ్ టైం స్టార్ట్ అయ్యింది అని. సో పాపం ఈ పిల్లకి ఇప్పుడు నుంచి అన్ని కలిసోస్తాయేమో . పిల్ల మాత్రం బాపు గారి బొమ్మ లా బాగుంది . సీనియారిటీ లేక సెకండ్ హీరోయిన్ అయ్యింది . 

మర్చేపోయాం చోసారా.. అత్తారింటికి దారేది అని అడుగుతూ అత్తగారిని మర్చిపోయాం .. హుందా అంటే క్యారెక్టర్ లు ఇక నడియాని వెతుక్కుంటూ రావాల్సిందే . తక్కువ మాట్లాడిన ప్రతి మాటలో పొగరు .. ప్రతి చేతల్లో ఓ పద్ధతి కనిపిస్తాయి ఆమెలో . రావు రమేష్ మనకి మరో ప్రకాష్ రాజ్ అయిపోయాడు అంటే అంతగా జీవించేస్తున్నాడు . 

పవన్ సినిమాలన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే పవన్ కి అతి దగ్గరగా ఉండే పాత్ర లో ఆలి ఉంటాడు .. అదే మరి స్నేహమంటే .. ఎంత పవన్ సినిమా అయినా బ్రాహ్మి ఫాన్స్ యూనివర్సల్ . భాస్కర్ అంటూ "ఆస్కార్" లెవెల్లో ఎంట్రీ ఇస్తాడు . ఎమ్మెస్ కూడా చాలా బాగా నవ్వించాడు . 

బోమన్ ఇరాని ముఖ్యమయిన తాతయ్య పాత్ర . కోట , రఘుబాబు, ఆహుతి అందరు బానే చేసారు 

త్రివిక్రమ్ తలుచుకుంటే ... 

త్రివిక్రమ్ కలం ఒక అక్షయ పాత్ర లాంటిదేమో .. ఎన్ని సినిమాలకి రాసినా ఇంకిపోదు . "ఇది హైదరాబాదు .. వెదర్ చాలా బ్యాడు .. ఇక మైసమ్మ్ తల్లి పెద్ద గాడ్ " లాంటి ప్రాస ఉన్న డైలాగులు  ఓ పక్క .. " రేయి నువ్వు చెస్సులొ  కింగు లాంటోడివి . ఒక్క అడుగే వెయ్యగలవ్ .. కాని ఇంట దైర్యం ఏంట్రా .. నీ పక్కన ఉన్న మంత్రిని చూస్కునే గా .. అలాంటొడిని ఒక్కడ్ని పంపు" లాంటి ఆలోచింప చేసే డైలాగులు .. "బాగుండడం అంటే బాగా ఉండటం కాదు .. నలుగురితో ఉండడం నవ్వుతూ ఉండటం " అబ్బో ఇక రాస్తే తెల్లరుద్ది కాని సినిమా చూడాలి ఓ రెండు మూడు సార్లు . రాజమౌళి ఆల్రెడీ అన్నాడు " త్రివిక్రమ్ సుకుమార్లు .. మనసు పెట్టి సినిమా తీస్తే నా కంటే పెద్ద బ్లాక్ బస్టర్ లు ఇస్తారని " సో ఈ సారి కొంచెం ఎక్కువ మనసే పెట్టాడు త్రివిక్రమ్ . థాంక్స్ త్రివిక్రమ్ గారు . 

దేవి "సిరి" 
పాటలన్ని  వినడానికి ఎంత బాగున్నాయో .. చూసేందుకు అంట రెట్టింపు బాగున్నాయి .. "ఆరడుగుల బుల్లెట్టు " బ్యాక్ గ్రౌన్డ్ " మోత మోగించింది . "its time to party " లో ఖుషి లేడి ముంతాజ్ ఇప్పటి హాట్ ఐటెం హంసానందిని జిగేల్ మన్నారు . బాపు బొమ్మ గా ప్రణిత కి మంచి పాట  దొరికింది . "నిన్ను చూడగానే" ఆసాంతం నవ్విస్తూ హైలైట్ సాంగ్ అయ్యింది . " కాటం రాయుడా " ఫాన్స్ కోసం . 

 కాకపొతే త్రివిక్రమ్ కి కొంచెం తిక్క కూడా ఉంది కదా .. అది బ్రహ్మానందం సీన్స్ లో కొంచెం ఎక్కువై రవ్వంత నస పెట్టింది . ఒక పావుగంట లేపెయ్యోచ్చు అక్కడ . 

 విందు భోజనం అంటే ఇలాగే ఉండాలి .
పెద్ద సినిమా పెద్ద సినిమా అంటే ఏంటో కొన్నాళ్ళు రుచి చూడక పోయేసరికి ఇవ్వాళే తెలిసొచ్చింది . త్రివిక్రమ్ పంచుల సత్తా ... పవన్ కళ్యాణ్ లాంటి పందెం గిత్తా కలిస్తే ప్రతి రికార్డుని తిరగ రాస్తుంది ఈ "అత్తా " . కాకపొతే పైరసీ .. ప్రాంత ద్వేషాలకి అతీతం గా మనం సినిమాని చూడాలి . 

రేటింగ్ 
75/100

4 comments:

  1. Its a movie with 90/100 Rating. You should have considered it for the same :)

    ReplyDelete
  2. Nice review dude...movie is good but we expect more from pawan. 75 score is not justified..60 or 65 is apt.

    ReplyDelete
  3. రివ్యూ చదుతుతుంటే 100/100 ఇచారేమో అనుకున్నా .. అంతా రాసి 75 ఇచారేంటి చక్రి గారు
    ఆ అహల్య అమాయకురాలు ఎపిసోడ్ ఏంటి , ఆ పనోళ్ళని కొట్టడం ఎంటో , ఆ సింహాద్రి సీన్ యే గుర్తుకు ఒచింది ఆ రైల్వేస్టేషన్ ఎపిఉసోడ్ లో :)
    silent PK fan gaa 65 istaa nenu
    -bujji

    ReplyDelete