Wednesday, September 5, 2012

Shirdi Sai Movie Review

ఈశ్వరుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు...అలాగే సాయిశ్వరుని ఆశిస్సు లేకుండా..అక్కినేని నాగార్జున కి షిరిడి సాయి గా నటించే ఇచ్చ ...రాఘవేంద్రునికి  షిరిడి సాయి చిత్రాన్ని తీయాలనే పట్టుదల...కీరవాణి కి ఈ చిత్రానికి అద్భుత సంగీతాన్నిఇచ్చే అవకాశం  దక్కేదా .... ఎలాగైతేనే బాబా కథ ఎక్కువ మందికి చేరువవ్వాలనే సదుద్దేశం కావొచ్చు ....

సాయి కథ :
దత్తాత్రేయుని అంశం సాయి గ ఉద్భవించడం...బాలుడిగా వేప చెట్టు దగ్గర కనిపించడం...తరువాత కొన్నేళ్ళకు చాంద్ పాటిల్ తో షిరిడి రావడం మొదలుకుని...సాయి భిక్షాటన ...సాయి బోధలు కొన్ని ....కొందరు భక్తులతో సాయి కి ఉన్న సావాసం ...బూటి మురళిదర మందిర నిర్మాణం ...చివరం సాయి సమాది చెందేవరకు..అతి క్లుప్తమైన కథగా ఈ సినిమాని మలిచారు ....

పాత్రదారులు .....
షిరిడి సాయి పాత్ర అక్కినేని నాగార్జున చేస్తున్నారు అని చెప్పినప్పటి నుంచి నేడు సినిమా విడుదల వరకు...ఆ పాత్రలో నాగార్జున ఎలా ఉన్నాడో ...ఉంటాడో అనేదే సర్వత్రా ఆసక్తిగా మారింది...ఆయన మాటల్లో ...నాగార్జున తన మనసులో బాబా ని ఒక లాగ ఊహించుకొని ...చాల వరకు వణకడం లాంటివి లేకుండా సహజం గా చెయ్యటం ద్వారా ...నాటకీయత ఏమి లేకుండా చాల సునాయాసంగా ఉంది ఆయన నటన...కాని ఛాలా సన్నివేశాల్లో ఆ హుషారుతనం వాళ్ళ నాగార్జునే కనిపిస్తాడు ...కాని ముసలి బాబా గా నాగ్ కి వంద శాతం మార్కులేయోచ్చు . పూర్తి తెల్ల గడ్డం తో ఆ అరగంట ఆ పాత్రని రక్తి కట్టించారు ...ఒక్క మాటలో చెప్పాలంటే బాబా పాత్ర నాగార్జున కి పూర్తిగా అతకలేదు..అలా అని గతకనూ లేదు ....

భక్తులలో బాబా ప్రియ భక్తుడు నానావళి గా సాయికుమార్ సబాష్ అనిపిస్తాడు...శరత్ బాబు మహాల్సాపతి గా అలరించాడు...బాయాజబాయి, లక్ష్మి బాయి షిండే గా చేసినవారు ఛాలా బాగా చేసారు...
దాసగను గా శ్రీకాంత్ ...రాధ కృష్ణ మాయిగా కమిలిని పాత్ర పరిచయాలు సరిగా లేకపోవడం తో తేలిపోయారు ...
షియాజీ షిండే ...ఆలి,చిట్టిబాబు పాత్రలు రాఘవేంద్రుని పైత్యం పూర్తిగా తగ్గలేదని రుజువు చేస్తాయి...శ్రీహరి పాత్ర కూడా ఆ పిచ్చిలోనే కొట్టుకుపోయింది .

సినిమా లో ఎత్తు పల్లాలు ...
"అమరారామ సుమారామచరి" అంటూ సాయిబాబా విగ్రహ అభిషేకం తో చిత్రం ఛాలా ఆసక్తిగా మొదలవుతుంది ..."బాపు" గారి అత్యద్భుతమైన బొమ్మలతో "దత్తాత్రేయుని" జననం రక్తి కట్టించింది...బాల సాయి ఉన్న సన్నివేశాలు బాగున్నాయి ..."సబ్ కా మాలిక్ ఏక హై" అనే కల్పిత పాట కొంచెం శృతి తప్పింది ....
కాని సాయి షిరిడి ఆగమనం...పశు పక్షాదుల ఆకలి తీర్చమని చెప్పే సందేశం...బిక్షాటన ప్రాముఖ్యత ...నానావళి పరిచయం ఆసక్తిగా ఉన్నాయి...మళ్లీ    భాటియా(షియాజీ షిండే) పిచ్చి చేష్టలు కొంత వరకు కథని నడిపిస్తే....ఎక్కువ సేపు ఉండటం విసిగించాయి... సినిమా నిడివి తక్కువ ఉండటం వాళ్ళ..బాబా మరియు ఆయన భక్తులు అలా పరిచయం అయ్యి అలా ముసలి వారయిపోతారు ...ముసలివాడిగా నాగార్జున ఛాలా అందంగా ఉండటం తో "బూటి" కృష్ణ మందిర నిర్మాణ సమయం లో వచ్చే "సాయి పాదం" అనే గేయం ...అలాగే సాయి అంతిమ యాత్ర ఆకట్టుకుంటాయి ....

అద్బుతమైన పాటలు ....
సినిమా లోని కథావస్తువు కన్నా కీరవాణి సంగీతం పది కాలాల పాటు గుర్తుండేలా ఉంది ....శ్వేతా పండిట్ పాడిన "అమరారామ సుమారామచరి" , సోనునిగం పాడిన  "దత్తాత్రేయుని అవతరణం.."..కీరవాణి ఆలపించిన "నీ పదమున ప్రభవించిన గంగా యమునా..." సునీతా స్వరం లో "ఎక్కడయ్యా సాయి" ..అలాగే "శరణమ్ము శ్రీ సాయి పాదం"..ఈ పాటలు వినటానికి..అలాగే రాఘవేంద్రుని చిత్రకరణ తో ఛాలా చాలా బాగున్నాయి..."శరణు శరణు" "శ్రీరామనవమి" బాగున్నాయి 

సాయి లీలామృతం సరిపోలేదు .....
సాయి లీలలకి ఎం కొదవ....కోకొల్లలు ....కేవలం రెండు గంటలు చెపితే తనివి తీరేదా...ఇంకా ఏందరో ఉన్నారే సాయి సచ్చరిత్రలో ...వారందరూ...కనీసం వారిలో ఇంకొందరు ఉండుంటే ఇంకెంత నిండుగా ఉండేదో కదా!! ఉన్న పాత్రలు ..చెప్పిన కథలు కూడా కుదించడం తో పూర్తీ స్ధాయిలో కథ కంచికి చేరలేదు ...ఏదో తెలియని వెలితి... ఉన్న కాసింత సమయంలో పిచ్చి హాస్యం అవసరమే లేదు ...ఈ చిన్ని లోపాలు సరి చేసుకొని ...ఇంకొన్ని కొత్త విషయాలు జత చేసుంటే "షిరిడి సాయి" నిర్మాణం సార్ధకం అయ్యుండేది...అంతే కాదు చరిత్రలో నిలిచేది ....

ఓం సాయి..శ్రీ సాయి..జయ జయ సాయి...
సాయి కథని ప్రేక్షకులకి అందించాలని చేసిన ఈ ప్రయత్నం హర్షణీయం...సాయిబాబా చెప్పే మంచి సూక్తులు పది మందికి చేరటం ఛాలా అవసరం ....హృద్యమైన పాటలు ....ఛాలా మంచి మాటల కోసం ...అలాగే సాయి కథ అంటె ఆసక్తి ఉన్నవారు తప్పకుండా చూడాల్సిన సినిమా ...

ఇక సంతృప్తి శాతం...
3.5/5

No comments:

Post a Comment