"ప్రేమ కథా చిత్రం " టైటిల్ వినడానికి సాఫ్ట్ గా తీయగా ఉన్నా థియేటర్ లోకి వెళ్ళాక మన తాట తీస్తుంది . హారర్ లో కామెడీ మిక్స్ చేసిన ఈ సినిమాకి మంచి స్పందన ఒస్తుంది . కృష్ణ గారి అల్లుడు "సుధీర్" నటించిన రెండో సినిమా . అలాగే బూతు చిత్రాల దర్శకుడిగా పేరొందిన మారుతి దర్శకత్వ పర్యవేక్షణ లో వచ్చిన ఈ బూతాల "చిత్రం" ఎలా ఉందో ఓ లుక్కేద్దాం .
కథ : జీవితం లో వివిధ కష్టాలలోఉండి "ఆత్మ" హత్య చేసుకుందామని అనుకున్న ఓ నలుగురు సుధీర్ , నందిత , ప్రవీణ్ అండ్ సప్తగిరి ఊరి చివర్లో ఉన్న గెస్ట్ హౌస్ కి వెళతారు . నిజానికి నందిత తను ప్రేమించిన సుధీర్ ని కాపాడుకోవటం కోసం ప్రవీణ్ సహాయం తో అక్కడికి వెళుతుంది . అనుకున్నట్టుగానే సుదీర్ నందితని ప్రేమిస్తాడు . బట్ అక్కడే ఉంది ట్విస్ట్ , సుధీర్ నందిత ని తాకగానే ఆమెని ఆవహించిన ఆత్మ విజ్రంభిస్తుంది .
ఎవరిదా ఆత్మ . ఆ నలుగురుకి ఆ ఆత్మ వల్ల ఎదురైన పరిస్థితులు థియేటర్ లో చూడాల్సిందే ..!!
ఎవెరెవరు ఎలా భయపడ్డారు ...
ఈ సినిమా లో ముందుగా చెప్పుకోవాల్సింది నందిత గురించి . తేజ "నీకు నాకు డాష్ డాష్ " తో పరిచయం అయింది ఈ తెలుగమ్మాయి . కళ్ళు పెద్ద గా వుండటం ఈ కథ లో ఆమె ఎంపిక కి ముక్య కారణం . అపరిచితుడి లో విక్రమ్ ని పోలిన పాత్ర . అన్ని సీన్స్ చక్కగా చేస్తూ , ఆడియన్స్ ని బానే బయపెట్టింది . హరిత డబ్బింగ్ బాగుంది . మరి ఓ తెలుగు హీరోయిన్ ఫ్యూచర్ ఒక్క సినిమా తో తేలేది కాదు . లెట్స్ విష్ హర్ బెస్ట్ .
హీరో సుధీర్ మాంచి ఒడ్డు పొడుగు ఉన్నవాడు . మొదటి సినిమా SMS కన్నా ఈ సారి వాయిస్ మీద ధ్యాస పెట్టాడు . తను డాన్సు బాగా చెయ్యగలదని చెప్పడానికి ఒక 5 నిమిషాలు మ్యూజిక్ బిట్ పెట్టారు . అక్కడ ఓ పాట పెట్టుంటే పోయేది . డాన్సు కేక . థియేటర్ లో ఎవరో అరిచారు "వీడు కృష్ణ ఫామిలీ లోంచి ఒచ్చాడా? !!" ఈ సినిమాలో చేసింది కొంచెం నిదాన మయిన పాత్ర . ఓ మాంచి మాస్ సినిమా ఒస్తే అప్పుడు ఎంత సరుకుందో తేలుతుంది
కొత్త బంగారు లోకం లో పరిచయమ్మయ్యిన ఈ కమెడియన్ పేరు "ప్రవీణ్" అని ఇప్పుడే కొంచెం జనాలకి తెలిసింది . ప్రతి సీన్ సహజం గా చేసాడు . అలాగే సప్తగిరి , ఆఫ్రికన్ విగ్ ఒకటి ఎస్కుని కుమ్మేసాడు . ఒక మామూలు కథ ని కాసేపు ఆసక్తి రేకెత్తించింది వీరి కెమిస్ట్రీ నే . వీరిద్దరికీ మాత్రం ఈ సినిమా మాంచి బ్రేక్ అని చెప్పొచ్చు .
అలాగే ఆ బూత మహల్ లో పని చేసే ఓ మసి బొగ్గు పనోడు , ఒంటి కన్ను "పెద్దా"యన , ఓ జూనియర్ ఆర్టిస్ట్ పార్వతి మిగతా పాత్రల్లో చేసారు .
ప్రేత కథా చిత్రం .... !!!
ఈ పాటికి ఈ సినిమా ఎలాంటి జోనర్ ఓ తెలిసే ఉంటుంది . దానికి సరిపడే వాతావరణం ఎర్పర్చడానికి మొదటి సగాన్ని వాడుకున్నారు . కొంచెం గా సాగ తీసినా ఈ సగం లో కావాల్సిన నవ్వులు ఉన్నాయి . రాఘవేంద్రరావు గారి సినిమాలో బొడ్డు ... మారుతి సినిమాలో బూతు వెతక్కుండా దొరికేస్తాయి . సో మీ చెవులకి డబల్ మీనింగ్ డైలాగులకి కొదవేమి ఉండదు .
ఇక ఇంటర్వెల్ లో మనం ఎదురు చూసే ట్విస్ట్ . మొదట్లో కొంచెం భయం వేసినా ... రాను రాను దెయ్యం ఎలాంటి మొమెంట్స్ లో ఒస్తుందో తెలిసి పోయింది కాబట్టి అంత థ్రిల్ ఉండదు . ఆ దెయ్యాన్ని తెలుసుకోవడం, దాన్ని వదిలించుకోవడం లో చేసే ప్రయత్నాలు కొంచెం నవ్వులు తెప్పిస్తాయి . ఈ కథ ని అర్ధవంతంగా చెప్పడానికి చూపించిన క్లైమాక్స్ కూడా బానే రాసారు .
జేబీ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది . పాటలు కూడా ఆకట్టు కుంటాయి . "వెన్నలైన వేకువైన" అనే కృష్ణ గారి రీమిక్స్ నీట్ గా ఉంది . ఈ సినిమాకి దర్శకుడు చాయగ్రహకుడు ప్రభాకర్ రెడ్డి . అయితే మారుతి కథ , స్క్రీన్ ప్లే ,పర్యవేక్షణ అని పెరేసారు , మరి దర్శకుడి అసలు ప్రతిభ ఏంతో తేల్చడం కష్టం .
ఆశ దోస ...
అంటే సినిమా గురించి ఏమి తెలీకుండా స్క్రీన్ మీద చూస్తె థ్రిల్లింగ్ గా అనిపించొచ్చు . ముఖ్యంగా సస్పెన్స్ సినిమాలు చాలా వరకు అంచనాలతో వెళితే నిరాశ చెందుతారు . అలాగే ఈ క్షణం లో దెయ్యం వస్తుంది అని తెలుసు కాబట్టి హారర్ కొన్ని క్షణాల వరకే . అలాగే అంచనాలు వల్లేమో ..నవ్వులు ఉన్నా పొట్ట చేక్కలవ్వలేదు . కొన్ని భయాన్ని కప్పి పుచ్చే నవ్వులు కూడా . సినిమా మొత్తం ఒకే ఇంట్లో ఉన్నా చిన్న సినిమా అవ్వడం తో విసుగు అయితే కలగలేదు .
చివరగా ...
హారర్ని కామెడీ తో మిక్స్ చేసిన ఆలోచన కి హాట్స్ అఫ్ . ఉన్న నలుగురు ఆకట్టుకున్నారు , ముఖ్యంగా నందిత అండ్ కమెడియన్స్ . వీపరీతం గా ఆశిస్తే నిరాశే . సరదా టైం పాస్ కోసం వెళితే సంతృప్తి పరిచే సినిమా .
రేటింగ్
62/100
PREMA KATHA CHITRAM REVIEW
PREMA KATHA CHITRAM REVIEW
రివ్యూ బాగుందండి - మీ రేటింగ్ మాత్రం కొంచెం కుతూహలాన్ని కలిగించింది. అరవై కాదు అరవై ఐదు కాదు - అరవై రెండు సెట్ చేశారు :). తరంగా లో మీ రేడియో కార్యక్రమం వింటాను ప్రతీ రెండు వారాలకీ - బాగుంటుంది. అభినందనలు .
ReplyDeleteకామెంట్ మోడరేషన్ ఉన్నప్పుడు ఇంక పద సరిచూత (వర్డ్ వెరిఫికేషన్) అక్కర్లేదేమో ఆలోచించండి.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeletethanks ram garu
ReplyDelete