Thursday, June 27, 2013

Balupu movie review



స్వయంకృషి తో పై కొచ్చిన హీరోల్లో రవితేజ ఒకరు. తనకంటూ ఒక డిఫరెంట్ స్టైల్ ఏర్పరుచుకుని విజయాలు సొంతం చేసుకుని మాస్ మహారాజా అనిపించుకున్నాడు . కాని పాపం ఈ మధ్య వరస పెట్టి ఓ అర డజన్ ఫ్లాపులతో డీలా పడ్డాడు . కొంతకాలం క్రితం రవితేజ కి "డాన్ శీను " అనే ఓ మోస్తరు హిట్ నిచ్చిన గోపీచంద్ మలినేని మరో సారి బలుపు తో రవితేజ కి మునపటి హుషారు ఇచ్చాడో లేదో చూద్దాం . 

కథ : మాంచి అందగత్తె అయిన శ్రుతి(హసన్) ... క్రేజీ పనులు చేసే ఆమె మావయ్య క్రేజీ మోహన్ (బ్రాహ్మి) , లవ్వు గివ్వు అంటూ బోలెడంత మంది అబ్బాయిలని బకరాలు చేస్తూ ఉంటారు . వారికి బుద్ది చెపుదామని రవి(తేజ) రంగంలోకి దిగుతాడు . సరదాగా మొదలైన ఈ డ్రామా నిజంగా ప్రేమగా మారే టైం కి ఇంటర్వెల్ బాంగ్ ..దాని తరువాత ఫ్లాష్ బ్యాక్ .  ఆ ఫ్లాష్ బ్యాక్ లో అంజలి !!

సో ఈ రవి ఎవరు ? అతని కోసం "నానా"జీ( అసుతోష్ రానా ) లాంటి విల్లన్లు "నానా" విధాలు గా ఎందుకు వెతికేస్తున్నారో తెలియాలంటే మీకు కొంచెం బలుపెక్కాల్సిందే . 

ఎవరి బలుపెంత ?
రవితేజ ఎప్పటి లానే తన కామెడీ టైమింగ్ తో కాసేపు ... అలాగే మాసిన గడ్డం తో సీరియస్ గా కాసేపు చెలరేగిపోయాడు . రవి తేజ వేసే పంచ్ లు ... చేసే వెటకారాలు .. చేస్తే గీస్తే రవితెజానే చేస్తేనే ఆ కిక్కు . ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ కి పాత్రలో ఉన్న తేడా బానే చూపించాడు . మధ్యలో ఒక మీటింగ్ సీన్ లో బాలయ్య బాబు మీద ఉన్న అక్కసును తెలివిగా కక్కెసాడండొయి !! మొత్తంగా తన నుంచి ఎం ఆశిస్తారో ... నిరాస పరచకుండా తన బలుపు ప్రదర్శించాడు . 

హిట్టు ఫ్లాపు పక్కన పెడితే ..  హీరోఇన్ల విషయం లో రవితేజ సెలక్షన్ ఎప్పుడు కేకే . గబ్బర్ సింగ్ లో జస్ట్ ట్రైలర్ మాత్రమే ఒదిలిన శ్రుతి ... ఈ సారీ కళ్ళ నిండా తినిపించింది . ఫస్ట్ హాఫ్ లో చలాకి పెర్ఫార్మన్స్ తో పాటు పాటల్లో నడుముని ఊపేస్తూ మన సినిమా టికెట్ కి రెండింతలు ఖుషి చేసింది .

 సీతమ్మ గా ఆకట్టుకున్న అంజలిది చిన్న పాత్రే . సీతమ్మ వాకిట్లో కలిసొచ్చిన గొంతు ఈ సారి నప్పలేదు . ఎందుకో ఆ అమ్మాయి లో తెలియని నీరసం కొట్టొచ్చినట్టు ఉంది . 

అసలు హీరో తరువాత అమ్మాయిల కంటే ముందు మనం ఈ మధ్య కాలం లో మాట్లాడుకోవాల్సింది బ్రాహ్మి రోల్ గురించి . ఈ సినిమాలో చేసిన క్రేజీ మోహన్ తరహ పాత్ర, రవితేజ తో చెంప దెబ్బలు తినడం ఇప్పటికి ఓ పది సినిమాల్లో చూసుంటాం ..కాని తమన్ ట్యూన్స్ లా ఇన్స్టంట్ గా నచ్చేస్తాయి . తరువాత గుర్తుకు రావు . "సావిత్రి" గా ఆలి పాత్ర కి ఆ పెరోక్కటే కొంచెం కామెడీ గా ఉంది . 

ప్రకాష్ రాజు పాత్ర హీరో కి తండ్రి పాత్ర . కొంచెం ట్విస్ట్ ఉన్న రోల్ . ప్రకాష్ రాజ్ వెరైటీ కోసం పుట్టాడు . రొటీన్ గా చెయ్యటం పాపం ఆయనకీ కూడా కష్టంగానే ఉండొచ్చు . 

అశుతోష్ రానాని మొన్నేగా తడాకా లో చూసాం .. షూటింగ్ ఒకేసారి చేసేసుంటారు .. కనీసం బట్టల్లో కూడా తేడా లేదు . అడివి శేషుది కరివేపాకు రోలే . నాజర్ నుంచి తాగుబోతు రమేష్ వరకు ఇంకా ఓ డజన్ మంది మంచి ఆర్టిస్ట్ లు ఉన్నారు . 

ఇందుగలడు అందు లేడు అను సందేహంబు వలదు అన్నట్లు "పవన్" ని వాడుకొని సినిమా లేదేమో .... పవర్ స్టారా మజాకా !!

సగసగాలు  ... 

మొదటి సగం - శ్రుతి అందాలు .. క్రేజీ మోహన్ క్రేజీ పనులు , రవితేజ రిటొర్ట్  ల తో బానే కాలక్షేపం అయిపొయింది . ముఖ్యంగా సంభాషణలు ట్రెండి గా ఉండటం తో హాయిగానే అనిపించింది . ఈ సగం లో విల్లన్లు కొంచెం రెస్ట్  తీసుకోటం తో మనకి ప్రశాంతంగా ఉంటుంది . 

ఇక రెండో సగం ఇంటర్వెల్ లో విల్లన్లు విరుచుపడగానే నా వెనుక ఉన్న ఎవరో అక్కడున్న ట్విస్ట్ కూడా ఊహించేసాడు . ఓ గుండాగిరి ఫ్లాష్ బ్యాక్ .. SP బాలు పాడిన ఓ యుగళ గీతం ... అంజలి తో హీరో చెట్ట పట్టాలు వేసుకుంటూ హీరో తిరగడం ( ట్రైలర్ చూసే ఉంటారు గా ) .. సో మీ ఉహలకి అందనంత దూరం గా ఏముండదు ఆ ఫ్లాష్ బ్యాక్ . తెలిసిన కథనే ఇంకొంచెం సాగ తీసినట్లు అనిపించింది ఇక్కడ . 

ఆకట్టుకునే విషయం ... దర్శకుడు క్లైమాక్స్ మీద కొంచెం మనసు పెట్టాడు ... ఫ్లాష్ బ్యాక్ నుంచి బయటకు రాగానే ఎలాగో ఓ మసాలా డ్యూయెట్ , లాస్ట్ ఫైట్ రొటీన్ అనుకోండి ...కాకపొతె ఆ ఫైట్ లో సరదా గా విల్లన్ల తో కూడా డాన్సు చేయించటం బాగుంది . 

టెక్నికల్ టింగ్స్ ... 
రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో గోపీచంద్ సినిమాలు బానే తీయగలడు . బట్ ఎప్పుడు రెగ్యులర్ గా తీస్తే నిలదక్కుకోడం కష్టం . తన వరకు తనకిచ్చిన కథ ని బానే చెప్పాడు . బాబీ అనే అతను ఇచ్చిన కథ లో పెద్ద విశేషం ఎం లేదు . తమన్ పాటలు ఇంకో రెండు వారాలు వినిపిస్తాయి . బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎక్కడయ్యా తమన్ ?? డైలాగ్స్ బాగున్నాయి . 

చివరగా ... 
వీకెండ్ వచ్చిన సినిమా అల్లా చూసే అలవాటుండి .. సినిమా ఓ మాదిరి గా పర్లేదనిపించేలా ఉన్నా మీకు పర్లేదు అనిపిస్తే ఓ సారి చూడొచ్చు . రవితేజ మార్క్ కామెడీ , క్రేజీ మోహన్ బాధలు ... శ్రుతి హసన్ తళుకులు మీకు నచ్చే అవకాశాలు ఉన్నాయి . 

రేటింగ్ 
61/100

1 comment:

  1. background score ekkadaya thaman?? manchi question adigaru..
    meku nachina cinema lodhi kottesukondi.. elagu nenu chesedi ade ga antademo

    ReplyDelete