కథ : నరసింహనాయుడు(ప్రభు) చెల్లెలు (సీత) , భాషా అనే ముస్లిం ని పెళ్లి చేసుకుంటుంది . అప్పుడు జరిగిన గొడవల్లో నరసింహనాయుడు, భాషా కాలు విరగ్గోడతాడు. అప్పటినుంచి ఒక ఇరవై ఏళ్ళ పాటు రెండు కుటుంబాలు ఆస్తి విషయాల కోసం కొట్టుకున్తూనే ఉంటుంది... తన తల్లి కోరిక మేరకు సులేమాన్ (విష్ణు) ఆ రెండు కుటుంబాలని కలపడానికి కృష్ణశాస్త్రి గా నరసింహనాయుడి ఇంట్లో అడుగు పెడతాడు...
ఏంటి ఇంతకీ హీరోయిన్ క్యారెక్టర్ గురించి చెప్పలేదేం అంటారా ...ఇంతోటి రొటీన్ కథ లో హీరోయిన్ కచ్చితంగా హీరో మరదలు అయ్యే ఉంటుంది ...సో ఇక్కడ కూడా అంతే ....
కధనం: హీరో, విడిపోయిన రెండు కుటుంబాలని కలపడం అనేది కథగా చూస్తె పాత చింతకాయ పేస్టు ని ఫ్రిజ్ లోంచి బయటకి తీసి తాలింపు ఎసినట్టే ఉంది ...సో ఈ చింతకాయ పేస్టు ని తీసుకెళ్ళి (రెడీ , దూకుడు లాంటి హిట్ చిత్రాలకు స్క్రీన్ ప్లే మాటలు రాసి మాంచి ఫాం లో ఉన్న ) కోన వెంకట్, గోపీమోహన్లకిచ్చి పులిహార చెయ్యమన్నారు. చికెన్,మటన్ తోనే పులిహార చేయగల సమర్ధులు వీళ్ళిద్దరూ . చింతకాయ పేస్టు తో పులిహార చేయటం వీరికి నిమ్మకాయ తో పెట్టిన విద్య.
ఆ "రెడి" పులిహార ఎలా పెట్టారో చూద్దాం :
కావాల్సిన పదార్దాలు :
1. విడిపోయిన రెండు కుంటుంబాలు
2. ఒక కుటుంబం లో హీరో,
3. ఇంకో కుటుంబం లో హీరోయిన్
4. హీరోకి ముగ్గురు (అన్నలు లేక బాబాయి లు)
5. హీరోయిన్ కి ముగ్గురు అన్నయలు లేక బాబాయిలు
6. సినిమా మొత్తం నడిపించేలా ఒక బ్రహ్మానందం పాత్ర
7. దూకుడు పులిహార లో వాడిన కొత్త రుచి ఎమ్మెస్ నారాయణ
8. రెండు మంచి పాటలు , మూడు పిచ్చి పాటలు
9. ఓ రెండు మూడు ఫైట్లు ...పాపం అవి చేయటానికి ఓ పావు డజన్ విలన్లు
సరే సరే ....హౌ ఈజ్ పులిహార ...??
ఆ అదే చెపుతున్నా ...వాడింది పాఆఅత చింతకాయ పచ్చడి అయినా ....చేసింది పేరున్న వంటవారు కావటం తో పులిహార పులిహార లాగ బాగానే ఉంది.
సినిమా లో ముఖ్యమైన అంశం హీరో ముస్లిమ్లా హిందులా ఎలా మేనేజ్ చేసాడో అనేది. మనం టీవీ సీరియల్ చూస్తుంటే ప్రతి రోజు చివర అర నిమిషం రేపేదో భూకంపం ప్రళయం వస్తుంది అనేలా ముగించడం ..ఆ మరునాడు ఆ అంతా ఉట్టిదే అని చెప్పడం మామూలే . సో ఇక్కడ కూడా అలాంటి సీన్స్ చాల ఉన్నాయి. సినిమా మొత్తం మీద సూపర్ గా ఏ క్షణం లోను అనిపించదు...అలా అని మరీ బోరు కొట్టించదు...
పాటల్లో మొదటి రెండు బాగున్నాయి. చివరిలో ఒక పారడి పాట పర్లేదు .
పులిహార సంగతి సరే,మరి విష్ణు బాబు, హన్సిక etc సంగతేంటి ...
పర్వాలేదు ...విష్ణు బాబు ఈ సినిమా కి కొంచెం బ్లడ్ పెట్టాడు. డాన్సులు సూపర్ గా చేసాడు. కామె"డీ" బాగా అలవాటే కాబట్టి చాలా ఈస్సీ గానే చేసేసాడు ...
హన్సిక కందిరీగ మీద ఓ కిలో తగ్గి ఉంటాదేమో . ఫ్యామిలీ సినిమాల్లో హీరోయిన్లకి ఉండేది ఒకటీ అరా సీన్లే కదా...కుమ్మేసి అవతల పారేసింది .
ప్రభు ని చూసి చూసి మన తెలుగోడే అనుకుంటాం కొన్నాళ్ళు అయ్యాక...కెరీర్ మొదట్నుంచి ఏడవటం బాగా అలవాటు ఉండటం తో సీత ఉన్న సీన్లన్ని తను ఏడిచేసి మనల్ని ఏడిపించింది..
"రెడి" లోకి ఈ సినిమా లోకి బ్రహ్మానందం పేరు తప్ప పెద్ద మార్పేమీ లేదు. బ్రహ్మానందం పాత్ర లో కొత్తదనం, ఘాటు, మోతాదు బాగా తగ్గడం తో ఓ తెగ నవ్వేసిన సందర్బాలు చాలా తక్కువ .
ఎమ్మెస్ నారాయణ నుంచి ప్రతి సారి దూకుడుని ఆశిస్తే కష్టం.ధర్మవరపు అండ్ వెన్నెల కిశోరే ఓకే .
ఒకప్పటి మాస్టర్ భరత్ ఇప్పుడు కంప్లన్ బాయ్ కానే కాదు..టీనేజ్ గై ....
విలన్ల గాంగ్ కి వాళ్ళు విలన్లమని హీరో గుర్తు చేసే దాక గుర్తే రాదు...సో కోట గారు ఉన్నా వేస్ట్ .
చింత పండు పులిహార కి ఇంత సీన్ అవసరమా...!!
మీ సినిమా డిక్షనరీ లో మీకు నచ్చే ఒకే ఒక్క పదం "వెరైటీ" అయితే, అది ఏ కోశానా లేని ఈ వంటకం మీకు రుచించక పొవచ్చు... ఆకలేసినప్పుడు ఏది తింటే ఎం అని అనుకుంటే ...ఎంచక్కా ఈ పులిహార క్షేమంగా తినేసేయోచ్చు...
సరే తిన్నావ్ కదా...నీకెలా ఉంది....
నాకు బానే అరిగిపోయింది ...సో 100 కి 55 ఇస్తున్నా...
It's a good review, enjoyed reading it :-).
ReplyDeleteinteresting review :P
ReplyDeleteThoroughly enjoyed reading.. nice review :)
ReplyDeletenice review bro ne pulihirani ni fb lo share chesa
ReplyDeleteThank you very much Murthy,Ramya,Harish and Rams
ReplyDelete