Wednesday, December 19, 2012

SVSC AUDIO REVIEW


SEETHAMMA VAAKITLO SONGS REVIEW

"సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" ఒట్టేయకుండా  చెబుతున్నా...ఇప్పుడందరూ మాట్లుడుకునేది ఈ చెట్టు గురించే...చాలా కాలం తరువాత ఒక మల్టీస్టారర్ సినిమా నిండు తెలుగుదనం తో సంక్రాంతికి సందడి చేయబోతుంది. ఇద్దరు హీరోలు వెంకటేష్ ,  మహేష్ బాబు విపరీతమయిన మహిలాభిమానులు కలవారే....సో ఈ టైటిల్ సరిగ్గా సరిపోయింది...అలాగే దిల్ తో పాటు టేస్ట్ ఉన్న నిర్మాత..."దిల్" రాజు, కొత్త బంగారులోకాన్ని కనుగొన్న శ్రీకాంత్ అడ్డాల సారధ్యంలో వస్తున్న సినిమా...
ఈ సీతమ్మ వాకిట్లోని స్వరాలూ గురించి..నాలుగు తీయని మాటలు...ఈ చిత్రానికి స్వరకల్పన చేసింది మిక్కి జే మేయర్. మిక్కికి  ఈ చిత్రం...ఒక సవాలు...ఒక పెద్ద పరీక్ష కూడా  ....

"సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు..సిరిమల్లె చెట్టేమో ఇరగ పూసింది..కొమ్మా కదలకుండా..కొయ్యండి పూలు.కోసినావన్ని సీత కొప్పు చుట్టండి.కొప్పునా పూలు గుప్పెడంత ఎందుకండీ...కోదండరాముడు వస్తున్నాడండి "
ఎప్పుడో  నాలుగు నెలల క్రితం బయటకి వచ్చిన ఈ పాటలోని ఈ చిన్న ముక్క ఇంకా అందరి నోళ్ళలో నానుతుంది అంటే అర్ధం చేసుకోవచ్చు...ఈ స్వరం ఎంత పెద్ద హిట్టో ! ఈ సినిమా టైటిల్ ని పది కాలాల పాటు గుర్తుకుతెచ్చే పాట.
ఇంత అందంగా పాడింది, సీనియర్ గాయని చిత్ర గారు. అనంత శ్రీరాం రచన చిన్న చిన్న పదాలతో కూడా చక్కగా ఉంది. వింటుంటే పెళ్లి పాటలా ఉంది...సినిమాలో సీతగా చేసింది అంజలి  కాబట్టి..బహుసా పెద్దోడు(వెంకటేష్) పెళ్ళిలో పాటేమో!!

ఆరడుగులుంటాడా ...ఏడు అడుగులేస్తాడా ..ఏమడిగినా ఇచ్చేవాడా! ఆశ పెడుతుంటాడా ..ఆట పడుతుంటాడా ..అందరికి నచ్చేసే వాడా...!!
ఆరడుగులుండి అందరికి నచ్చేసే హీరో ఎవరయ్యి ఉంటారబ్బా?నాకు తెలిసి "ఒక్కడే". అదేనండి  మన "ఒక్కడు" హీరో మహేష్. " నువ్వేమాయ చేసావో కానీ "...లేక "ఎన్నాళ్ళకి గుర్తోచ్చానే వాన" లా ఫిమేల్ సోలో పాటల్లో చాలా కాలం గుర్తుండిపోయే ఈ పాటను పాడింది కళ్యాణి. అమ్మో అనంత శ్రీరాం...చాలా పెద్ద లిస్టే తయారు చేసాడు అమ్మాయిల ఊహల రాకుమారుడి గురించి..."మాటల ఇటుకలతో గుండెల్లో కోటలు  కట్టాలి.. అడిగిన వెంటనే అలవోకగా మొయ్యాలి, అలవాటుగా అందాన్ని పొగడాలి, అలిగితే అందంగా బతిమాడాలి". సో ఈ పాటని ఫాలో అయితే అమ్మాయిలు పడిపోవటం సింపులు..!!

ఓహో ఓ అబ్బాయి..నీకై ఓ అమ్మాయి ఉంటుందోయ్  వెతుక్కోమని అన్నారే ..ఇందర్లో ఇలాగే..అయినా నేనీ జాడే వెతుక్కుంటూ ఒచ్చానే.. 
అనంత శ్రీరాం రాసిన ఈ పాట లో భలే గమ్మత్తైన విషయాలు ఉన్నాయ్..."వెతికే పనిలో అబ్బాయిలు ఉంటే ...పాపం ఎదురుచూపై అమ్మాయిలు ఉంటారంట.." "సరే అమ్మాయి పుట్టిందే అబ్బాయి కోసమైతే మరి కలవడం కోసం  ఇరవయ్యేళ్ళు ఎందుకు? అంటే "ఒకరికొకరం నచ్చేలా మారడం కోసం" సూపర్ గా చెప్పారు..చివర్లో అబ్బాయిలని "మంచోళ్ళు మొండోల్లు " అంటూ మోసేసారు శ్రీరాం..మీరింకా ఎన్నెన్నో మంచి పాటలు రాసేయాలింకా... అలాగే రాహుల్ నంబియార్, శ్వేతా పండిట్ కూడా ఇంకా ఎన్నెన్నో పాటలు పాడేయలింకా!!

మరీ అంతగా మహా చింతగా మొహం ముడుచుకోకలా ...
ఈ సారి సీతారామ శాస్త్రి గారి వంతు. చిరునవ్వు గురించి రాయమంటే ఆయన ఊరుకుంటారా ...చించి అవతల రాసేసారు ..."ఎండలను దండిస్తామ..వానలను నిందిస్తామా ..మరి సాటి మనుషులతో మనకెందుకు పేచీ,సర్డుకుపోఎదానికి" "అలాగే చిరునవ్వుల కోసం చెమటలు చిందించాలా?,శ్రమ పడి  ఎమన్నా పండించాలా?" "సుఖ శాంతుల కోసం కండలను కరిగించాలా , కొండలను కదిలించాలా, చచ్చి చెడి సాదించాలా ?" "మనుషలనిపించే ఋజువు , మమతలను పెంచే ఋతువు, మనసులను తెరిచే హితవు, వందేల్లయినా వాడని చిరునవ్వు" అంటూ చిరునవ్వుకున్న చీరాయువు గురించి చక్కగా చెప్పారు. ఇండియన్ ఐడల్ శ్రీరామా చంద్ర పాడాడు ఈ పాట .

వాన చినుకులు ఇట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే !!
ఈ ట్యూన్ వినగానే ఎక్కువ మందికి గుర్తొచ్చే పాట "ప్రేమంటే ఇదేరా" లో "నైజాం బాబులు...నాటు బాంబులు " పాట. కొత్త గా లేక పోయినా హుషారైన పాట. బహుసా వెంకటేష్ అంజలిల యుగళ గీతం అయ్యుండొచ్చు. కార్తీక్ అంజనసౌమ్య ఆలపించారు. కేరళ లో  తీస్తునారనుకుంటా. సో జలపాతాలు..వాన చినుకులు పుష్కలంగా ఉంటాయి .

మేఘాల్లో సన్నాయి రాగం మోగింది...
పాటలో  చెప్పినట్టు ఓ అచ్చ తెలుగు పెళ్లి పాట . బహుసా సినిమాలో హీరోల చెల్లి పెళ్లి కి సంభందించిన పాట .పెళ్లి కంటే కూడా పెళ్లి పనులకు సంబందించిన చిన్న పాట. పెళ్లి చేసుకునే వారు బిడియం తో తల వంచుకుంటే ...పెళ్లి చేసే వారు పని ఒత్తిడి తో శిరసు వంచుతారంట .సీతారామశాస్త్రి గారి సాహిత్యాన్ని కార్తీక్, శ్రీరామాచంద్రలు...అన్నదమ్ములై ఈ పాట పాడారు.

ఎం చేద్దాం...
శాస్త్రి గారికి ఇంట్రడక్షన్ పాట ఇస్తే మాత్రం చమ్మక్కులు లేకుండా రాసేస్తారా..."ఆకాశం విరిగినట్టుగా...కూడనిదేదో జరిగినట్టుగా...కిం కర్తవ్యమ్ అని కలవార పాడడం కొందరి తరహ" కాని "అవకాశం చూసుకుంటూ..ఆటంకాలు ఒడుపు గా దాటుకుంటూ వాటంగా దూసుకు పోవడం మన హీరోల తరహ అని చెప్పే పాట. మళ్లీ  కార్తీక్, శ్రీరామాచంద్రలు ఇద్దరు ఈ పాటకి హీరోలు.

మొత్తం గా చూస్తె అద్బుతమైన పాటలు. సంగీతం తో సాహిత్యం సహవాసం చేసిన సుమధుర గీతాల సమాహారం ఈ సిరిమల్లె చెట్టు. పాటలకి తగ్గట్టు కథలో కూడా తెలుగుతనం ..కొత్తదనం ఉంటె..ఈ సంక్రాంతికి సీతమ్మ వాకిట్లో రికార్డుల ముగ్గు వేయడం కాయం. అప్పటిదాక మనం "ఎం చేద్దాం", ఎంచక్కా క్రిస్మస్  అండ్ న్యూ ఇయర్ జరుపుకుందాం...!!

Thursday, November 29, 2012

Krishnam Vande Jagadgurum Review

"వేదం" "గమ్యం" లాంటి సెన్సిబుల్  చిత్రాలు తీసిన క్రిష్ దర్శకత్వం వహించిన మూడవ సినిమా "కృష్ణం వందే జగద్గురుం".లీడర్ తరువాత తడబడుతూ ఉన్న రానా బాబుకి చావో రేవో లాంటిదీ సినిమా. 


క్లుప్తంగా కథ : బళ్ళారి లో జరుగుతున్న ఇసుక మాఫియా చుట్టూ అల్లుకున్న కథ ఇది . తన తాత(కోట) చివరి కోరిక మేరకు బళ్ళారి నాటకోత్సవాలలో  "కృష్ణం వందే జగద్గురుం" అనే నాటకం వేద్దామని వచ్చిన బీటెక్ బాబుకి, ఈ ఇసుక మాఫియా కూపీ లాగేందుకు వచ్చిన జర్నలిస్ట్ దేవకి కి మధ్య నడిచే ప్రేమాయణం...వారికి ఇసుక మాఫియాకి జరిగే సంఘర్షణే "కృష్ణం వందే జగద్గురుం".

ఎవరెవరు ఎలా చేసారు....?
నాటకాల్లో చెప్పే భారి పద్యాలతో మొదటి రెండు సీన్లలోనే ఆకట్టుకోడం మొదలెట్టాడు రాణా. లీడర్ తరువాత ఏ మూవీ లోనూ అలరించని రానా, ఈ  "కృష్ణం" లో మాత్రం  వాడుకున్నోల్లకి వాడుకున్నంత అన్నట్లు సూపర్ గా "రాణిం"చాడు. తన బాడి లాంగ్వేజ్ కి తగ్గట్టు డైలాగులు, తన బాడికి తగ్గట్టు ఫైట్లు ఎక్కువ ఉండటం తో రానా లో తడబాటే కనిపించలేదు. సో తను "వన్ ఫిలిం వండర్" కాదని ఋజువు చేసాడు.

శ్రీరామరాజ్యం తన ఆఖరి సినిమా అన్న నయనతార, ఇంకా తన అభిమానులకి చాలా బాకీ ఉందేమో...అందుకే దేవ"కి" లా వచ్చి రసజ్ఞుల హృదయాల "కీ" తెరిచింది. రానా బాబుకి తగ్గ హైటు, పర్సనాలిటి ఉండడంతో, ఇద్దరి జోడి చాలా బాగుంది.
హిందీ నటుడు మిలింద్ గునాజి ఇసుక మాఫియా డాన్ గా ఒకే అనిపించాడు. అతిగా మాట్లాడే టాక్సీ డ్రైవర్  టిప్పుసుల్తాన్  గా పోసాని ఆ అతి మాటలతో కాసేపు నవ్వించాడు. "రంపం" రంగస్థల పండిట్ గా బ్రాహ్మి ఓకే. చాల రోజుల తరువాత అన్నపూర్ణని తెర మీద చూసాం. మిగిలిన రోల్స్ లో ఎల్బి శ్రీరాం,రఘుబాబు , హేమ, సత్యం రాజేష్ బాగా చేసారు.

సమీర రెడ్డి, వెంకటేష్ మీద తీసిన ఐటెం బానే పేలింది. 

మాఫియ కథ...మానవత్వం కథ...
మూవీ లో చూపించిన ఇసుక మాఫియా, మన కళ్ళ ముందు కూడా జరుగుతూ ఉండడం తో ఇంకా కనెక్టివిటీ ఎక్కువగా ఉంది. అలా ఎకారాలకి ఎకరాలు ఇసుకై పోతుంటే వామ్మో అనిపిస్తుంది. తను అనుకున్న నేపధ్యంని సిన్మా పేర్లు పడుతున్నపుడే చూపించి...ఒక్కొక్కరిగా పాత్రల్ని ఆ మెయిన్ ట్రాక్ లో కలపడం క్రిష్ ప్రత్యేకత.మరీ వేదం లో ఉన్నట్లు గుండెల్ని పిండే డైలాగులు కాకపోయినా, 'మానవత్వం, మనిషికి మనిషి సాయం'  అనే విషయాలని హైలైట్ చేస్తూ రాసిన  డైలాగులు బాగున్నాయి.నాటకాలకి సంభందించిన సీన్లు అలరిస్తూ వాటి ప్రాముఖ్యతని తెలుపుతాయి. నాటకాలు వేసే వారి స్థితి ఎంత దయనీయంగా ఉందొ అని బాద కూడా వేస్తుంది.

మణిశర్మ అందించిన పాటలు అన్ని స్క్రీన్ మీద సూపర్బ్. ముఖ్యంగా "జరుగుతున్నది జగన్నాటకం" అనే థీమ్ సాంగ్, ఆసాంతం వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి వెన్నముక్క లాంటిది. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఫైట్స్ బాగున్న...గ్రాఫిక్ వర్క్ ఇంకా బాగా చెయ్యాల్సింది...కొన్ని సీన్లు ఆర్టిఫిషియల్ గా ఉన్నాయి. 

బాగా లేని విషయాలు..
క్రిష్ సినిమా అనగానే...గమ్యం, వేదం లా హృదయానికి హత్తుకునే అంశాలు ఎక్కువ ఉంటాయి అని థియేటర్ లకి వచ్చే వారు ఎక్కువ మంది ఉంటారు. కాని కమర్షియల్ ముసుగు లో వాటిని బాగా తగ్గించి ఈ సినిమాని ఒక సాదారణ సినిమా గా మార్చాడు క్రిష్. ఫస్ట్ హాఫ్ వరకు ఉన్న టెంపో సెకండ్ హాఫ్ లో కొంచెం కొరవడింది . 
ఒక జైలు సీన్లో ఒక బండ విలన్ "హీరో" ని ఉద్దేశించి .."వీడు మనలాంటోడే ...కాని వీడికి క్లారిటీ లేదు" అంటాడు . సరిగ్గా డైరెక్టర్ పరిస్థితి కూడా అంతే అయ్యింది సెకండ్ హాఫ్ లో...

హీరో పాత్రకి,విలన్ పాత్రకి ఉన్న వ్యక్తిగత కక్షని కథలో ఇరికించడం ఒకందుకు బాగున్నా, పాత సినిమాల్లో లాగా విలన్ కి ఒక వాంప్ సాంగ్, రొటీన్ క్లైమాక్స్ ఫైట్ తో సినిమా ముగించడం వల్ల, ఇది అంతకు ముందు మనల్ని అలరించిన క్రిష్ సినిమాలా లేదు.

చివరగా...
క్రిష్ అంతకు ముందు తీసిన సినిమా లా ఉంటుంది అని ఆశపడ్డవారికి ఒక 50-60% మాత్రమె నచ్చుతుందేమో. కమర్షియల్ కథా వస్తువు, రానా-నయనతారల కెమిస్ట్రీ, మంచి పాటలు, ఆకట్టుకొనే కొన్ని సీన్లు "కృష్ణం వందే జగద్గురుం" కి ప్లస్ పాయింట్స్ . అబ్బో సూపర్ అనే సినిమా కాదు కాని...పర్లేదు బాగుంది  అనుకునే సినిమా..

స్కోర్ 
65/100

Saturday, October 27, 2012

Denikaina Ready Review

మంచు విష్ణువర్ధన్ బాబు హీరో గా నటించిన "దేనికైనా రెడీ " అంతో ఇంతో బాక్సాఫీస్ దగ్గర హడావడి చేస్తుంది. మోహన్ బాబు నిర్మాత గా కామెడి సినిమాల దర్శకుడు జి.నాగేశ్వర రెడ్డి దర్సకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందొ ఓ సారి లుక్కేద్దాం...

కథ : నరసింహనాయుడు(ప్రభు) చెల్లెలు (సీత) , భాషా అనే ముస్లిం ని పెళ్లి చేసుకుంటుంది . అప్పుడు జరిగిన గొడవల్లో నరసింహనాయుడు,  భాషా కాలు విరగ్గోడతాడు. అప్పటినుంచి ఒక ఇరవై ఏళ్ళ పాటు రెండు కుటుంబాలు ఆస్తి విషయాల కోసం కొట్టుకున్తూనే ఉంటుంది... తన తల్లి కోరిక మేరకు సులేమాన్ (విష్ణు) ఆ రెండు కుటుంబాలని కలపడానికి కృష్ణశాస్త్రి గా నరసింహనాయుడి ఇంట్లో అడుగు పెడతాడు...
ఏంటి ఇంతకీ హీరోయిన్ క్యారెక్టర్ గురించి చెప్పలేదేం అంటారా ...ఇంతోటి రొటీన్ కథ లో హీరోయిన్ కచ్చితంగా హీరో మరదలు అయ్యే ఉంటుంది ...సో ఇక్కడ కూడా అంతే ....

కధనం: హీరో, విడిపోయిన రెండు కుటుంబాలని కలపడం అనేది కథగా చూస్తె పాత చింతకాయ పేస్టు ని   ఫ్రిజ్ లోంచి బయటకి తీసి తాలింపు ఎసినట్టే ఉంది ...సో ఈ చింతకాయ పేస్టు ని తీసుకెళ్ళి (రెడీ , దూకుడు  లాంటి హిట్ చిత్రాలకు స్క్రీన్ ప్లే మాటలు రాసి మాంచి ఫాం లో ఉన్న ) కోన వెంకట్, గోపీమోహన్లకిచ్చి  పులిహార చెయ్యమన్నారు. చికెన్,మటన్ తోనే పులిహార చేయగల సమర్ధులు  వీళ్ళిద్దరూ . చింతకాయ పేస్టు తో పులిహార చేయటం వీరికి నిమ్మకాయ తో పెట్టిన విద్య.

ఆ "రెడి" పులిహార ఎలా పెట్టారో చూద్దాం :
కావాల్సిన పదార్దాలు :
1. విడిపోయిన రెండు కుంటుంబాలు 
2. ఒక కుటుంబం లో హీరో,
3. ఇంకో కుటుంబం లో హీరోయిన్ 
4. హీరోకి ముగ్గురు (అన్నలు లేక బాబాయి లు)
5. హీరోయిన్ కి ముగ్గురు అన్నయలు లేక బాబాయిలు 
6. సినిమా మొత్తం నడిపించేలా ఒక బ్రహ్మానందం పాత్ర 
7. దూకుడు పులిహార లో వాడిన కొత్త రుచి ఎమ్మెస్ నారాయణ 
8. రెండు మంచి పాటలు , మూడు పిచ్చి పాటలు 
9. ఓ రెండు మూడు ఫైట్లు ...పాపం అవి చేయటానికి ఓ పావు డజన్ విలన్లు 

సరే సరే ....హౌ ఈజ్ పులిహార ...??
ఆ అదే చెపుతున్నా ...వాడింది పాఆఅత చింతకాయ పచ్చడి అయినా  ....చేసింది పేరున్న వంటవారు కావటం తో పులిహార పులిహార లాగ బాగానే ఉంది.
సినిమా లో ముఖ్యమైన అంశం హీరో ముస్లిమ్లా హిందులా ఎలా మేనేజ్ చేసాడో అనేది. మనం టీవీ సీరియల్ చూస్తుంటే ప్రతి రోజు చివర అర నిమిషం రేపేదో భూకంపం ప్రళయం వస్తుంది అనేలా ముగించడం ..ఆ మరునాడు ఆ అంతా  ఉట్టిదే అని చెప్పడం మామూలే . సో ఇక్కడ కూడా అలాంటి సీన్స్ చాల ఉన్నాయి. సినిమా మొత్తం మీద సూపర్ గా ఏ క్షణం లోను అనిపించదు...అలా అని మరీ బోరు కొట్టించదు...
పాటల్లో మొదటి రెండు బాగున్నాయి. చివరిలో ఒక పారడి పాట పర్లేదు . 

పులిహార సంగతి సరే,మరి విష్ణు బాబు, హన్సిక etc సంగతేంటి ...
పర్వాలేదు ...విష్ణు బాబు ఈ సినిమా కి కొంచెం బ్లడ్ పెట్టాడు. డాన్సులు సూపర్  గా చేసాడు. కామె"డీ" బాగా అలవాటే కాబట్టి చాలా ఈస్సీ గానే చేసేసాడు ...
హన్సిక కందిరీగ మీద ఓ కిలో తగ్గి ఉంటాదేమో . ఫ్యామిలీ సినిమాల్లో హీరోయిన్లకి ఉండేది ఒకటీ అరా సీన్లే కదా...కుమ్మేసి అవతల పారేసింది .
ప్రభు ని చూసి చూసి మన తెలుగోడే అనుకుంటాం కొన్నాళ్ళు అయ్యాక...కెరీర్ మొదట్నుంచి ఏడవటం బాగా అలవాటు ఉండటం తో సీత ఉన్న సీన్లన్ని తను ఏడిచేసి మనల్ని ఏడిపించింది..
"రెడి" లోకి ఈ సినిమా లోకి బ్రహ్మానందం పేరు తప్ప పెద్ద మార్పేమీ లేదు. బ్రహ్మానందం పాత్ర లో కొత్తదనం, ఘాటు, మోతాదు బాగా తగ్గడం తో ఓ తెగ నవ్వేసిన సందర్బాలు చాలా తక్కువ .
 ఎమ్మెస్ నారాయణ నుంచి ప్రతి సారి దూకుడుని ఆశిస్తే కష్టం.ధర్మవరపు అండ్ వెన్నెల కిశోరే ఓకే .
ఒకప్పటి మాస్టర్ భరత్ ఇప్పుడు కంప్లన్ బాయ్ కానే కాదు..టీనేజ్ గై ....
విలన్ల గాంగ్ కి వాళ్ళు విలన్లమని హీరో గుర్తు చేసే దాక గుర్తే రాదు...సో కోట గారు ఉన్నా వేస్ట్ .

చింత పండు పులిహార కి ఇంత సీన్ అవసరమా...!!
మీ సినిమా డిక్షనరీ లో మీకు నచ్చే ఒకే ఒక్క పదం "వెరైటీ" అయితే, అది ఏ కోశానా లేని ఈ వంటకం మీకు రుచించక పొవచ్చు... ఆకలేసినప్పుడు ఏది తింటే ఎం అని అనుకుంటే ...ఎంచక్కా ఈ పులిహార  క్షేమంగా తినేసేయోచ్చు...

సరే తిన్నావ్ కదా...నీకెలా ఉంది....
నాకు బానే అరిగిపోయింది ...సో 100 కి 55 ఇస్తున్నా...

Wednesday, October 17, 2012

Cameraman Ganga tho Rambabu (CMGR) Review


It’s been a “Pushkaram” since the duo Puri Jagannath-Pawan Kalyan delivered a sensational “Badri”. Now the duo are back again with “Cameraman Ganga tho Rambabu”. This becomes third film this year in Puri’s running spree. There is always a humongous craze surrounding Powerstar’s film irrespective of previous result, but this time it just doubled due to “Gabbar Singh

Let’s see whether all the hype and expectations meet each other this time!!
Plot: Rambabu is an ordinary human being, but very different in a way he responds to the news in his surroundings. The movie is how this spark in him makes him an “Extraordinary” Journalist that makes a striking impact in society.

Performances:
If there’s a film that is made on Pawanism, I think that film will be called “Cameraman Gangatho Rambabu” from today. Right from the intro, heroism is superbly elevated. He speaks his mind in every scene. Since his ideologies are presented, he is natural in all emotional scenes. There are many scenes that will make fans whistle and clap. That apart, he never missed his entertaining self this time. His enthusiasm in songs will mesmerize his fans while his scenes with Tamanna, Ali and Brahmanandam will sure giggle you. So this is Pawan in full form, No doubts in it.
Milky beauty, hmm Tamanna likes this pet name. She plays the Tomboyish girl, a very self-confident and dashing one. Lucky she, as she is in shirts throughout the film, her hip is covered all through. But fans no need to worry as it is focused on 70 MM on all the songs. She is a treat all over.
PrakashRaj is a blessing in disguise, though he did almost the same role in many Puri’s blockbusters, He again does it so convincingly that you really can’t imagine anyone. Kota proves once again his seniority. Nazar is humble and convincing as CM. Tanikella Bharani makes his presence felt in crucial scenes.
Ali’s chemistry with Pawan and at the same time his comedy episodes in Puri’s direction gather laugh’s once again with his “Melukolupu” episodes. Brahmanandam adds fuel to the fun.
One song is literally wasted with this Gabriala( Not the item song). Any other heroine in the likes of Taapsi would have been given that role.

Puri Jagannath shows “Extraordinary” Heroism…
Puri Jagannath has such a potential to elevate the hero from an ordinary to “Extra Ordinary”. He writes the racy scenes right from the introduction of Pawan. Soon brings the Prakash Raj into scene and creates right amount of clash between the central characters. There is a tempo maintained to finally show how good wins over bad. Dialogue writer in him has got several punches awakening the society. Pawan’s scenes when interviewing Prakash Raj, His scenes with CM and the pre-climax scene with pawan needs huge applause. He cleverly recreates the current political scenario in the film.
And the funny aspect in him is seen very much, when he vandalizes the media’s headlines when discussing with Brahmi. Ali’s “Melukolupu” episode with black tickets is hilarious. Pawan’s episodes with Tamanna are sweet(especially when he describes girls as ordinary, theatre will have screams for sure).
Manisharma’s songs are nice on screen. Bhaskarabatla garu gave superb inspirational song “ Tala Dinchuku bratukutaava “ which is placed at very right moment. 

Drawbacks
But other duets should have been pictured still richer to provide the audience more relief. The Second girl is utterly wrong selection. There will lot of shades of Business man in execution. If you expect "Gabbar Singh" kind of lighter vein entertainer, this is not your cup of tea. Heavy violence ( the fight of hijras seems repetitive from Rebel) is one distraction too. A connection to the message and "Pawanism" decides how well a common audience like it.

 Pawan Kalyan Hats Off
A hero of his stature should attempt this kind of movie. The reach of message will be surely multiplied. Puri Jagannath has delivered a meaningful film this time. Very good writing in whole. So a good product from him can be expected in less time. He utilized Pawan’s energy and the expectations on the combination rightly.
Rating
3.5 (sure one watch if interested in message genre)



Thursday, September 13, 2012

Life is Beautiful Telugu Movie Review


Shekhar Kammula…can I call him “The Rajamouli” of Multiplexes and of course Overseas…Because he never disappoints them in his genre…After a little deviation from his colorful movies with the “Leader”, He’s back to his school with “Life is beautiful” . So three guys and their girls….and then their stories…doesn’t that reminds you his "Happy days". Shekhar very much wants that and he brings a bigger canvas..'”A"nand Nagar Colony' to tell a much bigger story… Let’s go look at them….

Plot: Story revolves around 3 guys…Srinivas, Nagaraju and Abhi and their girls Paddu, Laxmi and Paru(Shriya) respectively. It’s filled with their love….pain…joy and everything that makes their lives beautiful….

Actors…
Actors come first here…All new faces and how good they delivered…..
Sudhakar acted as Nagaraju… He is full of ease in massy role…with nice Telangana accent. Man of heart he is….makes you laugh with his innocence and of course that fetches his love back to him. His perfect timing and ease will definitely make him stand out. His girl Laxmi played by Zara, is sensuous enough in half sarees, suits the role of “Vizag” girl..starts with “andi” and finishes with “raa”
It’s Abhijeet who acted as Srinivas….A wonderful role of responsible bro of two sisters…He starts slowly but soon gets on you…. Definitely made his mark. Shagun Kaur plays paddu….padmavati…hmm heard this name loads of times in movies…generally named after cute “maradals”…so paddu here too is very cute…she gets a good role too.
Then Abhi (Kaushik) very kiddy….reminds you of Tyson in Happy days as he goes behind Paru(Shriya)…He attracts with his on the shot brave acts, his magic and of course confidence..
And We have more dose of glamour in form of good old wines…Shriya and Anjala Javeri…Shriya plays a beauty Diva…She is born of Shekhar's affinity to “Senior-Junior” attachment…But nice to see her in better role than the movies she plays lead. And how come we have forgotten this “Preminchu kundam raa”’s sexy lady….Shekhar still remembers her..Anjala Zaveri has got very nice role of “Madam” and she is very much in the movie protecting the kids…
Finally Amala Akkineni …placed her last as she kind of plays a guest role….But she touches you deeply with the kind of character…should watch out that!! And little girl who plays her younger daughter is wonderful!!

Obviously “Life is Beautiful”….!!
The way Shekhar introduces each character is something that is always fresh… He brings all the guys and girls in one chain sequence…A good start. Within no time, you become member in the colony… you  play in the rain with them…celebrate all the festivals ( just in one song) …. Amused by the romance…smile for their innocence and then feel their pain….fight for their colony ….everything brings out little nostalgia of something that’s missing. And then the role of Mother that runs in background for sure brings out the tears….Scenes depicting the importance of Mother tongue and mother shines...
All the songs are situational and Mickey J Mayor shines again…but could not outshine Happy Days…Poor guy…his director would have demanded for the same music again. Vijay C.Kumar…cinematographer of all Shekhar’s movies makes the movie colorful  

And now back to “Happy Days”…
Time to get into the “Time Machine” ….Whether you like or not …you should go back 5 years, as Shekhar brings not just the flavor….but loads more from his previous film…Like the Senior-Junior, here we have tiff between “B-phase” colony and the “Gold-phase” ..This is fun for a while …but goes little heavier after a while. And you see Tyson-Shravs in Abhi-Paru(Shriya) and our beautiful Madam Anjala reminds you English madam “Kamilini”. Shekhar loves MaheshBabu and that’s proved again…Remember, Happy days was very fresh then…But repetition of the same might reduce the appraisal…Shekhar has so much to tell every time…He once again plunges into interval and the Climax in hurry, when he looks at his clock.

What makes Life Beautiful
LIB has its share of silly things….But still it makes you smile…bring out tears… carry the nostalgia…and finally passes the time pleasantly….Watch it for Shekhar’s magic re-created again with the fresh faces….And the message : It's the challenges in life that makes it beautiful

Rating
3/5

Wednesday, September 5, 2012

Shirdi Sai Movie Review

ఈశ్వరుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు...అలాగే సాయిశ్వరుని ఆశిస్సు లేకుండా..అక్కినేని నాగార్జున కి షిరిడి సాయి గా నటించే ఇచ్చ ...రాఘవేంద్రునికి  షిరిడి సాయి చిత్రాన్ని తీయాలనే పట్టుదల...కీరవాణి కి ఈ చిత్రానికి అద్భుత సంగీతాన్నిఇచ్చే అవకాశం  దక్కేదా .... ఎలాగైతేనే బాబా కథ ఎక్కువ మందికి చేరువవ్వాలనే సదుద్దేశం కావొచ్చు ....

సాయి కథ :
దత్తాత్రేయుని అంశం సాయి గ ఉద్భవించడం...బాలుడిగా వేప చెట్టు దగ్గర కనిపించడం...తరువాత కొన్నేళ్ళకు చాంద్ పాటిల్ తో షిరిడి రావడం మొదలుకుని...సాయి భిక్షాటన ...సాయి బోధలు కొన్ని ....కొందరు భక్తులతో సాయి కి ఉన్న సావాసం ...బూటి మురళిదర మందిర నిర్మాణం ...చివరం సాయి సమాది చెందేవరకు..అతి క్లుప్తమైన కథగా ఈ సినిమాని మలిచారు ....

పాత్రదారులు .....
షిరిడి సాయి పాత్ర అక్కినేని నాగార్జున చేస్తున్నారు అని చెప్పినప్పటి నుంచి నేడు సినిమా విడుదల వరకు...ఆ పాత్రలో నాగార్జున ఎలా ఉన్నాడో ...ఉంటాడో అనేదే సర్వత్రా ఆసక్తిగా మారింది...ఆయన మాటల్లో ...నాగార్జున తన మనసులో బాబా ని ఒక లాగ ఊహించుకొని ...చాల వరకు వణకడం లాంటివి లేకుండా సహజం గా చెయ్యటం ద్వారా ...నాటకీయత ఏమి లేకుండా చాల సునాయాసంగా ఉంది ఆయన నటన...కాని ఛాలా సన్నివేశాల్లో ఆ హుషారుతనం వాళ్ళ నాగార్జునే కనిపిస్తాడు ...కాని ముసలి బాబా గా నాగ్ కి వంద శాతం మార్కులేయోచ్చు . పూర్తి తెల్ల గడ్డం తో ఆ అరగంట ఆ పాత్రని రక్తి కట్టించారు ...ఒక్క మాటలో చెప్పాలంటే బాబా పాత్ర నాగార్జున కి పూర్తిగా అతకలేదు..అలా అని గతకనూ లేదు ....

భక్తులలో బాబా ప్రియ భక్తుడు నానావళి గా సాయికుమార్ సబాష్ అనిపిస్తాడు...శరత్ బాబు మహాల్సాపతి గా అలరించాడు...బాయాజబాయి, లక్ష్మి బాయి షిండే గా చేసినవారు ఛాలా బాగా చేసారు...
దాసగను గా శ్రీకాంత్ ...రాధ కృష్ణ మాయిగా కమిలిని పాత్ర పరిచయాలు సరిగా లేకపోవడం తో తేలిపోయారు ...
షియాజీ షిండే ...ఆలి,చిట్టిబాబు పాత్రలు రాఘవేంద్రుని పైత్యం పూర్తిగా తగ్గలేదని రుజువు చేస్తాయి...శ్రీహరి పాత్ర కూడా ఆ పిచ్చిలోనే కొట్టుకుపోయింది .

సినిమా లో ఎత్తు పల్లాలు ...
"అమరారామ సుమారామచరి" అంటూ సాయిబాబా విగ్రహ అభిషేకం తో చిత్రం ఛాలా ఆసక్తిగా మొదలవుతుంది ..."బాపు" గారి అత్యద్భుతమైన బొమ్మలతో "దత్తాత్రేయుని" జననం రక్తి కట్టించింది...బాల సాయి ఉన్న సన్నివేశాలు బాగున్నాయి ..."సబ్ కా మాలిక్ ఏక హై" అనే కల్పిత పాట కొంచెం శృతి తప్పింది ....
కాని సాయి షిరిడి ఆగమనం...పశు పక్షాదుల ఆకలి తీర్చమని చెప్పే సందేశం...బిక్షాటన ప్రాముఖ్యత ...నానావళి పరిచయం ఆసక్తిగా ఉన్నాయి...మళ్లీ    భాటియా(షియాజీ షిండే) పిచ్చి చేష్టలు కొంత వరకు కథని నడిపిస్తే....ఎక్కువ సేపు ఉండటం విసిగించాయి... సినిమా నిడివి తక్కువ ఉండటం వాళ్ళ..బాబా మరియు ఆయన భక్తులు అలా పరిచయం అయ్యి అలా ముసలి వారయిపోతారు ...ముసలివాడిగా నాగార్జున ఛాలా అందంగా ఉండటం తో "బూటి" కృష్ణ మందిర నిర్మాణ సమయం లో వచ్చే "సాయి పాదం" అనే గేయం ...అలాగే సాయి అంతిమ యాత్ర ఆకట్టుకుంటాయి ....

అద్బుతమైన పాటలు ....
సినిమా లోని కథావస్తువు కన్నా కీరవాణి సంగీతం పది కాలాల పాటు గుర్తుండేలా ఉంది ....శ్వేతా పండిట్ పాడిన "అమరారామ సుమారామచరి" , సోనునిగం పాడిన  "దత్తాత్రేయుని అవతరణం.."..కీరవాణి ఆలపించిన "నీ పదమున ప్రభవించిన గంగా యమునా..." సునీతా స్వరం లో "ఎక్కడయ్యా సాయి" ..అలాగే "శరణమ్ము శ్రీ సాయి పాదం"..ఈ పాటలు వినటానికి..అలాగే రాఘవేంద్రుని చిత్రకరణ తో ఛాలా చాలా బాగున్నాయి..."శరణు శరణు" "శ్రీరామనవమి" బాగున్నాయి 

సాయి లీలామృతం సరిపోలేదు .....
సాయి లీలలకి ఎం కొదవ....కోకొల్లలు ....కేవలం రెండు గంటలు చెపితే తనివి తీరేదా...ఇంకా ఏందరో ఉన్నారే సాయి సచ్చరిత్రలో ...వారందరూ...కనీసం వారిలో ఇంకొందరు ఉండుంటే ఇంకెంత నిండుగా ఉండేదో కదా!! ఉన్న పాత్రలు ..చెప్పిన కథలు కూడా కుదించడం తో పూర్తీ స్ధాయిలో కథ కంచికి చేరలేదు ...ఏదో తెలియని వెలితి... ఉన్న కాసింత సమయంలో పిచ్చి హాస్యం అవసరమే లేదు ...ఈ చిన్ని లోపాలు సరి చేసుకొని ...ఇంకొన్ని కొత్త విషయాలు జత చేసుంటే "షిరిడి సాయి" నిర్మాణం సార్ధకం అయ్యుండేది...అంతే కాదు చరిత్రలో నిలిచేది ....

ఓం సాయి..శ్రీ సాయి..జయ జయ సాయి...
సాయి కథని ప్రేక్షకులకి అందించాలని చేసిన ఈ ప్రయత్నం హర్షణీయం...సాయిబాబా చెప్పే మంచి సూక్తులు పది మందికి చేరటం ఛాలా అవసరం ....హృద్యమైన పాటలు ....ఛాలా మంచి మాటల కోసం ...అలాగే సాయి కథ అంటె ఆసక్తి ఉన్నవారు తప్పకుండా చూడాల్సిన సినిమా ...

ఇక సంతృప్తి శాతం...
3.5/5

Thursday, August 30, 2012

srimannarayana movie review


ఈ ఏడాది 'అధినాయకుడు' ...'ఊ కొడతారా...' తరువాత వెంటనే ముచ్చటగా మూడోసారి తన అభిమానుల్ని అలరించడానికి నందమూరి బాలకృష్ణ "శ్రీమన్నారాయణ" గా బాక్సాఫీస్ దగ్గర సందడి చేయడానికి వచ్చాడు. 'మిరపకాయి' 'బిజినెస్ మెన్ ' 'పూల రంగడు ' ...ఇలా వరుస విజయాలు అందించిన ఆర్ ఆర్ మేకర్స్ నుంచి చాలా వేగంగా నిర్మించబడింది ఈ సినిమా ...అంతకు ముందు సామాన్యుడు లాంటి సినిమా తీసిన రవి చావలి దీనికి దర్శకుడు... సైలెంట్ గా వచ్చిన ప్రతిసారి బాలయ్య విజ్రంభించాడు ....సో ఈ సారి అలాంటి surprise ఏదన్న ఉందేమో చూద్దాం...

కట్టే కొట్టే తెచ్చే ....
శ్రీమన్నారాయణ ఓ బాద్యత గల జర్నలిస్ట్ ...రైతుల కోసం పోగు చేసిన 5000 కోట్ల నిధి  కోసం ఆరుగురు విలన్లు శ్రీమన్నారాయణ తండ్రి(విజయకుమార్)ని పధకం ప్రకారం చంపేస్తారు..సో వారందరినీ చంపి ఆ డబ్బుని ఎలా రైతుల కి పంచాడో అనేదే క్లుప్తంగా ఈ సినిమా కథ ....

శ్రీమన్నారాయణ & కో 
బాలయ్య బాబుకి జర్నలిస్ట్ అంటే కొంచెం కొత్త పాత్రే ...ఎప్పటిలా బారి డైలాగులు కాకుండా "బాదడానికి బయోడాట ఎందుకు రా " "చెప్పడం లో confusion ఉండదు..కొట్టడం లో compromise ఉండదు " అంటూ పోకిరి స్టయిల్  లో కొచ్చేసాడు ....అడపా దడపా కొంచెం పెద్ద డైలాగులు కూడా ఉన్నాయిలెండి ...ఇక ఇద్దరు బామలతో సరసం అంటే బాలకృష్ణుడు సదా రెడిగా ఉంటాడు....కాని పాటల్లో మాత్రం పెరుగుతున్న బరువుని దాచలేకపోయాడు . సినిమాలో విలన్లని చంపడానికి కొన్ని కొత్త గెట్టప్పులు వేసాడు...వాటిలో నరసింహ స్వామీ అవతారం ఒక హైలైట్ అని చెప్పొచు ...మొత్తానికి మోతాదు మించకుండా ....ఆవేశాన్ని..కామెడిని..ఫైట్స్ ని సింపుల్ గా చుట్టేసాడు 

లక్కి గా బాలయ్య బాబు కి ఈ సారి ఇరువురు బామలు బానే సెట్ అయ్యారు ....పువ్వాయి పువ్వాయి  అంటూ అలరించిన పార్వతి మిల్టన్కి జర్నలిస్ట్ గా మంచి రోలే దొరికింది ...పాటల్లో మంచి expressions ఇస్తూ ...కొంచెం నిడివి ఎక్కువున్న పాత్రే బాగా చేసింది ... ఇదే బ్యానర్ లో ఇషా చావ్లా కి మూడో సినిమా ...కూతంత కలరోచ్చి పార్వతి కి పోటిగా గ్లామర్ చిలికించింది ...

దువ్వాసి మోహన్ చేసిన "sim card" కామెడి క్లిక్ అయ్యింది ....కృష్ణ బగవాన్ ..ఎమ్మెస్ ఎపిసోడ్ తుస్సంది ...
ఈ సినిమాకి ఆరుగురు విలన్లు ....కోట,రావురమేష్."మర్యాద రామన్న" నాగినీడు, "చత్రపతి కాట్రాజు" సుప్రీత్, జయప్రకాష్ రెడ్డి అండ్ ఒకప్పటి హీరో సురేష్ ....అందరు జస్ట్ ఓకే అనిపించుకుంటారు...

నాన్న గా విజయకుమార్ ఓకే ఓకే ...అమ్మ గా సుధా ఆంటీ overaction షరా మామూలే ...జైలర్ గా ఆహుతి ప్రసాద్ ...CBI ఆఫీసర్ గా వినోదకుమార్ బాగున్నారు ....ముఖ్యంగా ఆ రోల్స్ బాగున్నాయి ...

శ్రీమన్నారాయణ ....ద PASSWORD SPECIALIST...
చెప్పడానికి one line స్టొరీ గా ఉన్న ఈ కథ ని password కాన్సెప్ట్ తో కొంచెం కొత్తగా మలిచాడు దర్శకుడు . ఒకే password ఆరుగురు విలన్లు షేర్ చేస్కోడం ...వారిని చంపుతూ ఆ password  చేదించడం..అనేది ముగింపు తెలిసినా కూడా సినిమాని కొంచెం interesting గా తీయడానికి ఉపయోగ పడింది ...కాకపొతే సినిమా మొత్తం ఈ   password అనే word వాడటం కొంచెం నవ్విన్చోచ్చు. అలాగే దువ్వాసి మోహన్ అండ్ హీరోయిన్ల మధ్య జరిగే sim cards...out of coverage area... అంటూ సాగే కామెడి దియేటర్లో ఆడియన్స్ ని బానే నవ్వించింది ...fights  ఈ సినిమాకి highlight.  ఎక్కడ స్రుతి మించకుండా crispy  గా ఉన్నాయి ...చక్రి సింహ కి ఇచ్చిన పాటాలే మళ్లీ వాడుంటే పోయేది ....ఉన్న వాటిల్లో ఇద్దరు హీరోయిన్లతో వచ్చే పాట బెటర్ ...అండ్ "తక తై తక తై" బాగుంది ...రవి చావలి అబ్బో సూపెర్ గా తీసాడు అనిపించుకోక పోయినా  ...ఆ పర్వాలేదులే అనిపించుకుంటాడు .... 

పొరపాట్లు ....
యంగ్ జనరేషన్ తో పోటి పడాలంటే వారిలా స్లింగా ఫిట్ గా ఉండి తీరాలి.. సో బాలయ్య అర్జంటుగా కొంచెం తగ్గాలి... పెద్ద హీరోల సినిమాలు జస్ట్ మామూలు కథ తో ఆడే రోజులు పోయాయి ....సినిమాలో  "అహో అద్బుతం" అనేలా విషయం ఉంటేనే వారి సినిమాలకి ఆడియన్స్ వస్తున్నారు ...సినిమాలో ఆరుగురు విలన్లు ఉన్నా...అందరు ఒకరి తర్వాత ఒకరు హీరో చేతిలో చావడానికి క్యూ కట్టడమే తప్పితే పెద్దగా చేసేదేం లేదు ....దర్శకుడు విలన్లని చంపడానికి ఓ మూడు వెరైటీ గెట్టప్పులు వేయించి  సగం లోనే హ్యాండ్ ఇచ్చాడు... వాటిల్లో నరసింహ స్వామి ఒక్కటే హైలైట్ ...విలన్లని ఇంకొంచెం తెలివిగా చూపించి ఉంటె హీరో రోల్ ఇంకా elevate అయ్యేది ...పాటలు ఇంకా బాగుండాల్సింది ....

చివరగా....
ఇద్దరు హీరోయిన్లు ...ఆరు ఫైట్లు ...నాలుగు మాస్ పాటలు...కొన్ని కామెడి బిట్లు .... మన తెలుగు సినీ ఫార్ములా ఎక్కడా మిస్ అవ్వలేదు ... బాలకృష్ణ అభిమానులకి ఎప్పటిలా సంతోశాన్నిచే సినిమా..
మంచి స్క్రీన్ ప్లే...అండ్ ఎక్కడా extras  లేకపోవటం వల్ల మిగతావారికి కూడా బోర్ కొట్టకపోవచ్చు...  వచ్చే వారాల్లో షిరిడి సాయి  అండ్  life is beautiful  ఉండటం వల్ల ...కేవలం మాస్ జనాన్ని కొన్నాళ్ళు అలరించోచ్చు...బాలకృష్ణ సినిమాలు ఇష్టపడే వారు సరదాగా ఓ సారి చూసెయ్యండి .....

రేటింగ్ ....

అబ్బో ఈ రేటింగ్ ఇవ్వడం పెద్ద trouble ...trouble అంటే ఈ సినిమా లో ఓ  హైలైట్ డైలాగ్ గుర్తొచ్చింది  
Dont trouble the trouble... If you trouble the trouble... trouble troubles you. i am not the trouble i m the truth 
2.75