మాస్ హీరో .. క్లాస్ డైరెక్టర్ .. ఇలాంటి కాంబినేషన్ ఎప్పుడు ఆసక్తి కలిగించేదే .. NTR- సుకుమార్ కలయిక .. టైటిల్ " నాన్నకు ప్రేమతో ".. ఈ సంక్రాంతికి ఎక్కువ మంది "ప్రేమతో " ఎదురు చూసింది ఈ నాన్న గారి సినిమా కోసమే ..
కథ : ఇంకా 30 రోజుల్లో చనిపోతాడని తెలుసుకున్న రమేష్ చంద్ర(రాజేంద్ర) ప్రసాద్ తన ముగ్గురి కొడుకుల్ని పిలిచి , తనని అత్యంత దారుణంగా మోసం చేసి రోడ్డుక్కీడ్చిన కృష్ణమూర్తి కౌటిల్య(జగపతి బాబు) పతనమే తన ఆఖరి కోరిక అని చెబుతాడు . చిన్నవాడైన అభిరామ్(NTR ) లక్ష్యం ఇప్పుడు 35000 కోట్ల అధిపతి అయిన కృష్ణమూర్తి ఆస్తిని "సున్నా" చెయ్యటమే .. సుకుమార్ లెక్క ప్రకారం ఒక్కో సెకండ్ కి 10 కోట్లు .. సో ఇంత అసాధ్యమైన టార్గెట్ మన ఎన్టివోడు ఎలా? హౌ?? కైసే?? .. ఈ సందేహాల తీరాలంటే మీరు సినిమా చూడాల్సిందే ..
ఎవరికీ వారే తెలివయిన వారే ..!!
కెరీర్ మొదట్లోనే మాస్ కి బాబు లాంటి సినిమాలు తీసిన NTR గత రెండు సినిమాలు ఎంతో ఆచితూచి అడుగులు వేసాడు అనిపిస్తుంది .. "1" తరువాత సుకుమార్ తో ధైర్యంగా ముందుకేల్లడంతోనే మనోడు విజయం సాదించేసాడు. వెరైటీ గడ్డం లుక్ తో తనలోని మాస్ ని పూర్తి గా అదుపు లో ఉంచుకుని అతి తెలివైన సుకు"మార్కు" హీరో గా ఒదిగిపోయాడు .. జగపతి బాబు ఎదురుగా ఉన్నప్పుడు ఠీవిగా రాకుల్ తో తెలివిగా .. నాన్న తో ప్రేమ గా ఇలా అన్ని వేరియేషన్స్ కలబోసాడు .. డాన్సుల్లో గ్రేస్ అదుర్స్ .. NTR కలకాలం గుర్తుంచుకొనే సినిమా "నాన్నకి .." ఇంకా క్రిష్ అండ్ త్రివిక్రమ్ సినిమాలు కూడా చేస్తే బాగుండు
జగపతిబాబు .. ఇతను అంతకు ముందు హీరో గా చేసారనే విషయం మర్చిపోతామేమో విలన్ గా ఇలా ఒకదాన్ని మించి ఇంకోటి దున్నేస్తుంటే . హీరోయిజం బయటపడాలంటే విలన్ పవర్ఫుల్ ఉండాలి .. సో ఎన్టీఆర్ కి వచ్చే పేరు లో 50 శాతం జగపతి స్టైలిష్ నటనదే .
రకుల్ .. డబ్బింగ్ తొలిసారి ఎంత బాగా చెప్పిందో .. అంత కంటే ఎంత బాగా చేసిందో .. అంత కు మించి అందంగా ఉంది . కేవలం పాటలకే కాకుండా హీరోయిన్ కి రవ్వంత తెలివితేటలు ఉండొచ్చు అని చూపించింది .
రాజేంద్ర ప్రసాద్ మంచానికి అత్తుక్కుపోయినా ఈ కథకి సూత్రధారి ఆయనే కదా ! మనకి పిల్లలు ఉన్నప్పుడు మన తండ్రి విలువ తెలిసొస్తుంది అని చెప్పే సీన్ లో రాజీవ్కనకాల బాగా చేసాడు .. శ్రీనివాస్ అవసరాల అవసరం లేకుండా పోయింది .
హీరో గ్యాంగ్ లో తాగుబోతు రమేష్ సహా మిగతా ఇద్దరు హుషారుగా ఉన్నారు .
మధు బాల ఎంట్రీ సీన్ బాగుంది .
తెలివయిన వాడికంటే తెలివయన వాడు మన సుక్కు ..
టీ కప్పు ని ఒక వైపు తిప్పితే .. ఓ ఫోటో ఫ్లాష్ వల్ల .. ఓ బాస్కెట్ వల్ల .. ఓ కాఫీ ఒలికి ఓ ముద్దు పుడుతుందా .. హీరోయిన్ షూ ఒక 45 డిగ్రీ ఆంగిల్ లో పెడితే మన చేతులకి మసి అంటకుండా ఓ అరడజను రౌడిలని కుమ్మేయోచ్చు . ఇలా బట్టర్ ఫ్లై థియరీ తో ఒక సంఘటణ నుంచి మరోకటికి అనుసందానించిన విధానం బాగుంది . హీరో హీరోయిన్ ప్రేమ .. హీరో విలన్ మధ్య గేమ్ .. ఈ రెండు ట్రాక్స్ దేనికవే అనిపించేలా ఆకట్టు కున్నాయి .
ఒకటి అరా లోజిక్కులు చిరాకు(అత్యంత ధనవంతుడి కూతురికి, ఇంటికి సెక్యూరిటీ లేకపోవటం ) పుట్టించినా .. విలన్ తో ఆడిన గేమ్ చుట్టూ మరో అసలు గేమ్ ప్లే చెయ్యటం బాగుంది .. ఈ తెలివి తేటలు etc హీరో-విలన్-హీరోయిన్ మధ్య మాత్రమె. 1 లో ఉన్నంత కన్ఫ్యూషన్ ఇక్కడ లేదు... ఎందుకంటే "నాన్న మీద ప్రేమ " కోసం ఇదంతా అనే విషయం సామాన్య ప్రేక్షకుడిని ఆసక్తి లో ముంచి కట్టి పడేస్తుంది ..
ఓ మాస్ హీరో సినిమా అనగానే ఆ హీరో కోసం సుమోలు గట్రా ఎగరేయకుండా ..ప్రేమని పగని అంతర్లీనంగా చూపిస్తూ తనదైన శైలి లో హీరోనే మలుచుకుని మెప్పించాడు సుకుమార్ .. హాట్స్ఆఫ్ ..
దేవిశ్రీ ప్రసాద్ & విజయ్ చక్రవర్తి
"I wanna follow follow " అంటూ తన పాటలలోనే వన్ అఫ్ ది బెస్ట్ సాంగ్ ఇచ్చాడు దేవి . తన తండ్రి మరణించిన సమయంలో కూడా అత్యుత్తమమైన అవుట్ పుట్ ఇచ్చాడు . " నా మనసు నీలో " కూడా బాగా నచ్చింది . టైటిల్స్ నుంచి ఎండ్ వరకు ప్రతి సీన్ రిచ్ గా పెద్ద తేరా మీదే చూడాలి అనేంత లా ఉంది గ్రేట్ వర్క్ సినిమాటోగ్రాఫర్ విజయ్ చక్రవర్తి .
చివరిగా ..
మనం ఊహించిన దానికంటే మిన్నగా సుకు"మార్కు" ఎన్టీఆర్ సూపర్ గా ఉన్నాడు .. లోపాలు కొన్ని ఉన్నా బిగ్ స్క్రీన్ మీద ఆ రిచ్నెస్ .. కాన్సెప్ట్ లో వెరైటీ .. కథనం లో పగడ్బంది "నాన్నకు ప్రేమతో " ని వావ్ అనిపించేలా చేస్తాయి .
70/100
Follow me on twitter @chakrireview @movies141
70/100
Follow me on twitter @chakrireview @movies141