మాస్ సినిమాలు మాత్రమె చేస్తూ తన సత్తా చాటుకున్నరామ్ చరణ్ తొలి సారి పంధా మార్చి క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశి దర్శకత్వం లో "గోవిందుడు అందరివాడే " అనిపించుకోటానికి సరదాగా ఈ దసరాకి ముహూర్తం పెట్టుకున్నాడు ... ఆ గోవిందుడి కథా కమిషను నాలుగు మాటల్లో ..
కొత్త కధేం కాదులేండి ..
తన ఊరి కోసం తపించే తండ్రి .. కొడుకుని డాక్టర్ చదివిస్తాడు .. కాని కొడుకు గారు అమ్మ లాంటి ఊరు కంటే అమెరికా నే కోరుకుని వెళ్లి పొతాడు . పాతికేళ్ళ తరువాత ఆ మనవడు తన కుటుంబాన్ని ఎలా కలుపుకున్నాడనేది ఈ గోవిందుడి కథ ..
ఎవరెలా చేసారు ..
కృష్ణ వంశి చేతిలో పడి మెరవాలని ఒకప్పుడు ప్రతి కుర్ర హీరో అనుకునేవాడు .. చరణ్ కి సరైన సమయం లో ఈ అవకాశం చిక్కింది .. తన లోని మాస్ ని అలా పక్కన పెట్టి కథ లో ఓ ముఖ్య పాత్రలా అలా ఒదిగి పోయాడు చరణ్ . నిజానికి వంశీ కూడా తనకు కావలసినంత చేయించుకున్నాడే కానీ మరింత గా ఎం కష్ట పెట్టలేదు . 8 సినిమాల వయసున్న రామ్ కి ఇది రెండో గొప్ప చిత్రం అనుకోవచ్చు.
మరి ఏ ఉద్దేశం తొ.. లేక పిచ్చి గానో ఈ పాత్రకి ఓ తమిళ నటుడిని అనుకున్నారో తెలిదు.. ఇది ప్రకాష్ రాజ్ మాత్రమె చేసే పాత్ర .. ఆయన సూపర్ గా చేసాడు అని చెప్పటం సచిన్ టెండూల్కర్ మంచి ఆటగాడు అని చెప్పటం లాంటిది ..
అలాగే శ్రీకాంత్ బాబాయి లా అటుక్కుపోయాడు బంగారి గా . మెగా ఫామిలీ తో ఉన్న రిలేషన్ వల్ల .. "నా అన్న కొడుకు" అని అంటుంటే నిజమే అనిపిస్తుంది ..
కాజల్ .. కృష్ణ వంశీ కి ఈ చందమామ కొత్త కాదు .. కాని కొత్తగా చూపించాడు కాజల్ ని .. రామ్ చరణ్ - కాజల్ వండర్ఫుల్ పెయిర్ అంతే .
కమ్ముల బామ కమలిని కి మంచి రోలే దొరికింది .. కాజల్ తో పాటు నేను ఒక హీరోయిన్ నే అనిపించేలా సినిమా అంతా అందంగా కనిపించింది . జయ సుధ కి గ్లిసరిన్ బాటిల్ ఇస్తే ఊరుకుంటుందా .. మొత్తం అవచేస్తుంది ..
కోట .. రావు రమేశ్ విలనీ మీద పెద్ద ధ్యాస పెట్టలేదు కిట్టయ్య .
అంతా బావుంది కాని అంతేనా అనిపించింది ...
అరటి తోరణాలతో .. దీపావళి కాంతులతో .. ముగ్గురు అత్తలు .. ఇద్దరు మరదళ్ళు .. వరసైన బావలు .. సూపర్ స్ట్రిక్ట్ నాన్న .. సెంటిమెంటు అమ్మ .. ఇంత సరంజామా ఉంటే కృష్ణవంశీ ఊరుకుంటాడా .. దున్నుకుంటూ పోయాడు .. చాలా సునాయాసంగా ..
అప్పుడెప్పుడో నేను చదువుకునే రోజుల్లోనే మురారి తో తెలుగుదనం ఉన్న సినిమా అంటే ఇది అన్ని ఈనాటి ప్రేక్షకులకు రుచి చూపించాడు కృష్ణ వంశీ . సో కథ లో మురారి బావ మరదల్లు.. "అతడు"లోని వారసుడి చాయలు కనిపించినా .. ఏ సీన్ కి ఆ సీన్ బాగుంది అనిపించేలా సాగిపోయింది సినిమా .. ముఖ్యం చరణ్ కి ఇలాంటిది మొదటిసారి .. శ్రీకాంత్ క్యారెక్టర్ ఇవి బాగా కలిసొచ్చాయి .. ఆహా అద్బుతం అనేంత లేదు కాని పర్వాలేదు బాగుంది అనిపించారు డైరెక్టర్ .
యువన్ ఇచ్చిన పాటలు స్క్రీన్ మీద ఇంకా బాగున్నాయి. కృష్ణ వంశీ పాటలకి వంకలా ... ఎలా ఎలా ..? మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మిస్సింగ్ ఇక్కడ ..
అమ్మో చివర ఇరవై నిమిషాలు ఇరగ అని మన బండ్ల గణేష్ చెప్పాడని ఓ కర్చీఫ్ మోసుకుని వెళ్తారేమో .. సినిమా మొత్తం చుట్టేసినట్టే చివరకి కూడా చాలా సింపుల్ గా లాగించేసారు వంశీ గారు .
చివరగా ..
కొన్ని సినిమాలకి టైమింగ్ బలం .. మాస్ మసాలాలు .. బ్రహ్మనందాలు ..కిక్కు ఇవ్వని టైం లో ఈ గోవిందుడు ఇంకాస్త ముద్దుగా కనిపిస్తాడు .. అన్నట్టు ఈ సినిమాలో బ్రహానందం గారు లేరండో..
కుంభ స్థలాన్ని కొట్టక పోయినా ఈ పండగకి కావలసినంత కలెక్షన్స్ కొల్లగొ డతాడు గోవిందుడు ..
రేటింగ్
68/100