కారణాలు ఏవైతేనేం ... ఎప్పుడో రావాల్సిన ఎవడు .. మొత్తానికి సంక్రాంతి గిత్త లా ముస్తాబయ్యి బరిలోకి దిగింది . తండ్రి లాగే మాస్ ప్రేక్షకులని ఆకట్టుకున్న 'చిరు'త'నయుడు రామ్ చరణ్ కిది ఏడో సినిమా . ఈ 'ఏడు' పవన్ ఫాన్స్ కి 'ఖుషి'నిచ్చింది, మహేష్ కి ఒక్కడయ్యింది .. ఎన్టీఆర్ ని సింహాద్రి ని చేసింది. మరి చరణ్ ని ఏం చేసిందో చూద్దాం .
కథ ( సినిమా చూడకుండా చదివేస్తే ఎలా అని కంగారు పడాల్సిన అవసరం లేదు )
సత్య ( అల్లు అర్జున్) .. దీప్తి (కాజల్) ప్రేమించుకుంటారు . దీప్తి సినిమా హీరోయిన్ లా అందం గా ఉంటుంది కాబట్టి వీరుభాయి(రాహుల్ దేవ్) అనే విలన్ ఓ కన్నేస్తాడు . ఈ సినిమాలో అల్లు వారబ్బాయి హీరో కాదు కాబట్టి దీప్తి తో సహా అతన్నిపొడిచేస్తారు . కాని అనూహ్యంగా కోన ఊపిరి తో ఉన్న అర్జున్ సినిమాటిక్ గా ( ప్లాస్టిక్ సర్జరీ) సహాయం తో రామ్ (రాంచరణ్ ) లా మారతాడు .
ఇక త్వరత్వరగా అతని పగ ఎలా తీర్చున్నాడు ... అలాగే తనకి అతికించిన చరణ్ అనే ఇంకో కుర్రాడి గతం తాలూకు వ్యవహారాలని ఎలా చక్కదిద్దాడో తెలియాలంటే 'ఎవడు' చూడాల్సిందే .
మాస్ అంటే చరణ్ .. చరణ్ అంటే మాస్
రచ్చ .. నాయక లాంటి సాదా సీదా కథల్ని హిట్లు గా మలిచాడు రామ్ చరణ్ . పాటల్లో కళ్ళు చెదిరే స్టెప్పులు ... గుండాల్ని చితకొట్టే ఫైట్లు .. చరణ్ కి 'జీన్స్' తో పెట్టిన విద్య . తన పేరుని రెండు ముక్కలుగా చేసిన రెండు పాత్రల్లో చెర్రీ ఒక మాస్ హీరో ఎలా చెయ్యాలో .. అంత కంటే ఒక అడుగు ఇంకా ముందుకేసి సూపర్బ్ అనిపించుకున్నాడు . ఎప్పుడు ఒకేలాంటి కథలు కావాలనుకుంటే చరణ్ కి మగధీర వచ్చేది కాదు ... మాస్ సినిమాల్లో ఇంకొంచెం వైవిద్యం చూపించాలి జుస్త్ ప్లాస్టిక్ సర్జరీ సరిపోదు . కొన్నిస్టెప్పులు చిరంజీవి లా చేసాడు జస్ట్ సరదాగా . బాబాయి పవన్ మీద అభిమానం చాటుకున్నాడు "చే గోవేరా" బుక్కు చదువుతూ .. ప్రియురాలితో గబ్బర్ సింగ్ చూస్తూ !!
బావ మరుదులు బావల బ్రతుకు కోరతారు .. అచ్చు మన అల్లు అర్జున్ లా
ఎం చేస్తాం హీరో ఓరియెంటెడ్ సినిమాలు, కమల్ హాసన్ తనయ శృతి కూడా పాటకి రెండు నిమషాలు అటు ఇటు మాత్రమె స్క్రీన్ మీద కనిపించింది . కానీ ఆమెకి ఇంకా ఓ మూడు పాటలు ఇస్తే బాగుంది అనిపిస్తుంది . చాలా రోజుల్లయ్యింది చూసి కాబోలు ... కాజల్ భలే ముద్దోచ్చింది . అమీ జాక్సన్ రాబోయే శంకర్ సినిమాలో సింగల్ హీరోయిన్ అంటే నమ్మడం కష్టం . బీచ్ సాంగ్ లో తన వంతు కృషి చేసింది .
సాయికుమార్ కి మరి ఇంత పెద్ద సినిమా ఎందుకో ఎవరు ఇవ్వలేదు . రెగ్యులర్ విలన్ పాత్రే అయినా తన స్ధాయికి తగట్టుగా చేసి ఆకట్టుకున్నాడు . కోట వాడుకున్నోల్లకి వాడుకున్నంత . "పిల్లి గుడ్డిదయితే ఎలుక నిక్కరిప్పి డాన్సులు ఎసిందట " అలాగే క్లైమాక్స్ లో " చూస్కో పళ్ళ" అని ఆయన చెప్తే ఎవ్వరైనా నవ్వాల్సిందే .
జయసుధ హుందాగా చేసింది . ఇప్పుడైతే నడియాని తీస్కోనే వారేమో !! బ్రహ్మానందం ఉండాలి కాబట్టి ఉండటమే . ఒక మాస్ సినిమాలో ట్రైలర్ లో పోస్టర్ లో .. ఆయన పేస్ కనపడాల్సిందే !!
అరె నాకు అన్ని ముందే తెలిసిపోతున్నాయి !!!
ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకేవో అతీత శక్తులు ఒచ్చెసాయి ... లేక పోతే హీరోయిన్ ఇలా రాగానే .. అప్పుడు కచ్చితంగా ఏ పాట రాబోతుందో ముందే కనిపెట్టేసా !! హీరోని విలన్ ఒక క్లిష్టమైన పరిస్థితి లో పడేసినప్పుడు హీరో ఎం చేస్తాడని అనుకున్నానో చరణ్ అదే చేసాడు ... భలే భలే !! విలన్ ఒచ్చి ఊరోల్లని బెదిరించినపుడు ముందు ఎవరు ఎదిరిస్తారో నాకు ముందే తెలుసు.. మీరు ఒకసారి పరీక్షించు కొండి ..
ఎంత రొటీన్ గా ఉన్నా ...
సినిమాలో రెండు కథలున్నాయి రెండు కొత్తవేం కాదు ... కాని వంశి పైడిపల్లి మాత్రం చాలా చకచక చెప్పేసాడు రెండు కథల్ని . మొదటి సగం లో ఎక్కడ సాగ దీకుండా హీరో పగ పూర్తిగా చల్లారిపోతుంది . ఈ సగం లో మెయిన్ హీరోయిన్ , విలన్ అసలు కనిపించరు.. సో ఇంకా ఏదో ఉండే ఉంటుంది అనే ఎదురుచూపులో ఇంటర్వెల్ బెల్ మోగింది . రెండో సగం లో న్యాయ పోరాటం . సాయికుమార్ , కోట, జయసుధ ... ముగ్గురు తలా ఒక చెయ్యి వేసారు .
దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన అన్ని పాటలు చూడటానికి బాగున్నాయి . నీ జతలొ నెనుండాలి ..ఇక నుంచి వన్ ఆఫ్ ది మొస్ట్ ఫావోరెట్ సాంగ్ నాకు
సరే పండక్కి ఏ సినిమా చూడాలి ..
రోజు ఇంట్లో అదే ఫుడ్డు తినే నాలాంటోడు ఒకడు .. ఈ పండక్కి వెరైటీ గా ఏదన్న తిందామని ఓ 1Talian రెస్టారెంట్ కి వెళ్ళాడు .. మెనూ చూస్తె అన్ని కొత్త పేర్లు అలవాటు లేని తిండాయే .. నోటికొచ్చింది ఆర్డర్ చేసాడు .. కొత్త ఫుడ్డు కదా ....కొంచెమ్ కొత్తగా .. కొంచెం పిచ్చిగా అనిపించింది .. పైగా అసలు మసాలాలు లేవు .. ఏదో లా తినేసి అదే ఎలా ఉందొ కూడా అర్ధం కాకుండా ఇంటికొచ్చేసాడు .
ఇంకా ఆకలేస్తుంది .. సో ఎం చేస్తాం రాత్రికి బిరియాని పాయింట్ కి వెళ్ళాడు . చాలా సార్లు అక్కడ బిరియాని తినేసినా ఎప్పటి లాగానే ఉన్నా ... ఆకలి ఎస్తుంది మరి సర్డుకోక తప్పలేదు . కడుపు నిండింది .. కాక పొతే మసాలాలు దంచికోట్టినట్టునారు కడుపులో కొంచెం మండింది .
ఇంటి కొచ్చాక పడుకుంటే అనిపించింది .. ఈ పండగలు "ఎవడు" కనిపెట్టాడు రా బాబు అని
ఫైనల్ గా ..
మాస్ హీరో మంత్రం మరో సారి పని చేసే ఛాన్స్ ఉంది . పాటలు, చరణ్ +స్టార్ కాస్ట్ 'ఎవడు' హై లైట్స్ . టైం పాస్ కోసం నాలాగే మీరు చూసెయ్యండి రెండు సినిమాలు !!
రేటింగ్
61/100 .. మర్చిపోయా నిన్నకూడా ఇంతే ఇచ్చానా కొంపదీసి !!