"విక్టరీ" వెంకటేష్ షాడో సినిమా ఈ రోజు వెలుగుని చూసింది . " సక్సెస్" స్పెల్లింగ్ తెలీకపోయినా "పస " లేని సినిమాలను స్టైలిష్ గా చుట్టేసే మెహర్ రమేష్ దీనికి దర్శకుడు . మొన్నటి దాకా అలరించిన పెద్ద హీరోలకు ఇప్పుడు కొంచెం గడ్డు కాలమే . పవన్ కళ్యాణ్ , మహేష్ , ఎన్టీఆర్ , రామ్ చరణ్ , ప్రభాస్ ల జామానా లో మునపటి "పెద్ద" హీరోలు వెనకపడటం మనం చూస్తూనే ఉన్నాం . మరి సోలో గా వెంకి చేసిన షాడో విన్యాసాలు ఎలా ఉన్నాయో చూద్దాం .
కథ :
అనగనగా రాజు గారు వేటకు వెళ్ళారు . ఏడు చేపలు తెచ్చారు . ఒకటి ఎండలేదు . ఎందుకు ఎండలేదు అని ఎవడో కథ చెప్పటం మొదలెడితే ఏమంటాం ..!! బాబు నాయనా ఈ కథ ఇప్పటికి 100 సార్లు విన్నా నస ఆపమని పక్కకి వెళతాం . కాని మెహర్ ధియేటర్ కి ఒచ్చిన వారికి బయటకి వెళ్ళే అవకాశం లేకుండా పాత కథే మల్లి చెప్పాడు .
ఒక నిజాయితీ గల జర్నలిస్ట్ రఘు రామ్ ని ఆరుగురు విలన్లు కిరాతకం గా చంపుతారు . వారి మీద అతని కొడుకు పగ బట్టి ఎలా చంపాడు అనేది కథ . మొదటి సీన్ లోనే క్లైమాక్స్ గెస్ చేసే సత్తా ఉన్న కథ ఇది .
షాడో లో పాత్రలు
ఎంతో అనుభవం ఉన్న వెంకటేష్ ఇలా ఈ మెహర్ బుట్టలో ఎలా పడ్డాడో అర్ధం కావటం లేదు . అది కూడా తనకి అసలు నప్పని ఎన్నో గెటప్స్ లో వెంకి కనిపివ్వడం ఆశ్చర్యం కలిగించింది . కాని ఏ పాత్రలో అయిన ఒదిగిపోయే విక్టరీ తన వంతు గా ఎక్కడా తడబడలేదు . మధ్యలో పవన్ పేరడీ కూడా బానే చేసాడు . తను ఇలాంటి రొటీన్ సినిమాల జోలికి వెళ్ళకుండా ఉంటె బెటర్ .
హీరో గారు గడ్డం తో అసలు బాగోకుండా ఉన్నా అతన్ని ఫస్ట్ లుక్ లోనే ప్రేమించే రొటీన్ హీరోయిన్ పాత్ర తాప్సిది . కాని ఈ సినిమాలో చాలా బాగుంది . పాటల్లో ఇంకా అందంగా చూపించారు .
దొంగని జేబులో పెట్టుకుని ఊరంతా వెతికే అమాయక పోలీస్ పాత్ర శ్రీకాంత్ ది .
ఎమ్మెస్ నారాయణది సైకో శ్రీను పాత్ర . పోస్ట్ మొర్టుం స్పెషలిస్ట్ . ఉన్నంతలో నవ్వించినా సగం సార్లు కల్పించినవి లా ఉన్నాయి సీన్లు . జై ప్రకాష్ రెడ్డి హోం మంత్రిగా కాసేపు నవ్వించాడు . కృష్ణ భగవాన్ , తాగుబోతు రమేష్ etc పర్లేదు .
విలన్లు ఆరేడుగురు ఉండటం వల్ల మనకి టార్చర్ టైం రెట్టింపయ్యింది . చచ్చే ముందు రెండు మూడు బెదిరింపు మాటలు తప్పితే పెద్ద పీకిందేమి లేదు .
నాగేంద్ర బాబు పాత్ర ని పాపం ఒక సీన్ లో లేప్పెయ్యడానికి మాత్రమే తీసుకుంటున్నట్టు ఉన్నారు . మొన్న బాద్షా లో కూడా ఇంతే .
రెండు సగాలు ..
ఇక చెప్పుకోడం మోదలేట్టాం కదా చెప్పేసుకుందాం . మొదటి సగం మలేషియా . పూరి జగన్నాథ్ పుణ్యమా అని డాన్లు మలేషియా బ్యాంగ్ కాక్ ల్లోనే తిరుగుతున్నారు . పోలీసులు "నానా" భాయి గ్యాంగ్ ని పట్టుకోడం కోసం "నానా" తంటాలు పడుతూ ఉంటె, తన పగ కోసం షాడో చాలా సింపుల్ గా పిచ్చి వేషాల్లో ఒచ్చి పోలిసులకంటే ముందే వారిని చంపుతూ ఉంటాడు .ఈ సగం లోనే గబ్బర్ సింగ్ పేరడీ అంటూ కాసేపు మనని కూడా ఎర్రగడ్డ తీసుకెళతారు .
ఇక రెండో సగం ఇండియాలో . విడిపోయిన అమ్మ చెల్లి బావలని మన షాడో ఈ సగం లోనే కలుస్తాడు . ఫస్టాఫ్ లో ఓ ముగ్గురిని చంపాక మిగిలిన ఓ నలుగురిని ఈ హాఫ్ లో చంపుతాడు , అలాగే కష్టపడి టికెట్ తీస్కొని హాళ్ళో కూర్చున్న నా లాంటి అమాయక ప్రేక్షకులని కూడా ఉపేక్షించలేదు .
బాగున్నవి ..
మెహర్ కథ ఎలా చెపుతాడో వినాలని ఉంది . ఎందుకంటే ఇంతోటి కథకి కూడా బోలెడంత డబ్బు పెట్టాడు నిర్మాత . పాటలు ఉన్న లొకేషన్స్ అండ్ చిత్రీకరణ పర్లేదనిపిస్తాయి . ఇదే సినిమా ఒక 20 సంవత్సరాలు అంటే ఈ సినిమా వెంకి చిన్నపుడు రిలీజ్ చేసుంటే బాగుండేది . అంటే అప్పటి ప్రకారం చూస్తె బాగానే ఉంది నీట్ గా .
అదే పులి ... అదే మేక
పులి మేక కథ తెలిసే ఉంటుంది అందరికి . ఇలా వరస పెట్టి "అదిగో పులి " అంటే పాపం ఆడియన్స్ ఓ మూడు సార్లు పరిగెత్తుకుంటూ ఒచ్చారు మన డైరెక్టర్ సినిమాలకి . మరి ఈ సారి ఒస్తారొ లేదో డౌటే .
గాలి పట్టుకోలేరు .. నిప్పుని ముట్టు కోలేరు .. ఈ షాడో ని తట్టుకో లేరు
రేటింగ్
40/100