ఈ ఏడాది 'అధినాయకుడు' ...'ఊ కొడతారా...' తరువాత వెంటనే ముచ్చటగా మూడోసారి తన అభిమానుల్ని అలరించడానికి నందమూరి బాలకృష్ణ "శ్రీమన్నారాయణ" గా బాక్సాఫీస్ దగ్గర సందడి చేయడానికి వచ్చాడు. 'మిరపకాయి' 'బిజినెస్ మెన్ ' 'పూల రంగడు ' ...ఇలా వరుస విజయాలు అందించిన ఆర్ ఆర్ మేకర్స్ నుంచి చాలా వేగంగా నిర్మించబడింది ఈ సినిమా ...అంతకు ముందు సామాన్యుడు లాంటి సినిమా తీసిన రవి చావలి దీనికి దర్శకుడు... సైలెంట్ గా వచ్చిన ప్రతిసారి బాలయ్య విజ్రంభించాడు ....సో ఈ సారి అలాంటి surprise ఏదన్న ఉందేమో చూద్దాం...
కట్టే కొట్టే తెచ్చే ....
శ్రీమన్నారాయణ ఓ బాద్యత గల జర్నలిస్ట్ ...రైతుల కోసం పోగు చేసిన 5000 కోట్ల నిధి కోసం ఆరుగురు విలన్లు శ్రీమన్నారాయణ తండ్రి(విజయకుమార్)ని పధకం ప్రకారం చంపేస్తారు..సో వారందరినీ చంపి ఆ డబ్బుని ఎలా రైతుల కి పంచాడో అనేదే క్లుప్తంగా ఈ సినిమా కథ ....
శ్రీమన్నారాయణ & కో
బాలయ్య బాబుకి జర్నలిస్ట్ అంటే కొంచెం కొత్త పాత్రే ...ఎప్పటిలా బారి డైలాగులు కాకుండా "బాదడానికి బయోడాట ఎందుకు రా " "చెప్పడం లో confusion ఉండదు..కొట్టడం లో compromise ఉండదు " అంటూ పోకిరి స్టయిల్ లో కొచ్చేసాడు ....అడపా దడపా కొంచెం పెద్ద డైలాగులు కూడా ఉన్నాయిలెండి ...ఇక ఇద్దరు బామలతో సరసం అంటే బాలకృష్ణుడు సదా రెడిగా ఉంటాడు....కాని పాటల్లో మాత్రం పెరుగుతున్న బరువుని దాచలేకపోయాడు . సినిమాలో విలన్లని చంపడానికి కొన్ని కొత్త గెట్టప్పులు వేసాడు...వాటిలో నరసింహ స్వామీ అవతారం ఒక హైలైట్ అని చెప్పొచు ...మొత్తానికి మోతాదు మించకుండా ....ఆవేశాన్ని..కామెడిని..ఫైట్ స్ ని సింపుల్ గా చుట్టేసాడు
లక్కి గా బాలయ్య బాబు కి ఈ సారి ఇరువురు బామలు బానే సెట్ అయ్యారు ....పువ్వాయి పువ్వాయి అంటూ అలరించిన పార్వతి మిల్టన్కి జర్నలిస్ట్ గా మంచి రోలే దొరికింది ...పాటల్లో మంచి expressions ఇస్తూ ...కొంచెం నిడివి ఎక్కువున్న పాత్రే బాగా చేసింది ... ఇదే బ్యానర్ లో ఇషా చావ్లా కి మూడో సినిమా ...కూతంత కలరోచ్చి పార్వతి కి పోటిగా గ్లామర్ చిలికించింది ...
దువ్వాసి మోహన్ చేసిన "sim card" కామెడి క్లిక్ అయ్యింది ....కృష్ణ బగవాన్ ..ఎమ్మెస్ ఎపిసోడ్ తుస్సంది ...
ఈ సినిమాకి ఆరుగురు విలన్లు ....కోట,రావురమేష్."మర్యాద రామన్న" నాగినీడు, "చత్రపతి కాట్రాజు" సుప్రీత్, జయప్రకాష్ రెడ్డి అండ్ ఒకప్పటి హీరో సురేష్ ....అందరు జస్ట్ ఓకే అనిపించుకుంటారు...
నాన్న గా విజయకుమార్ ఓకే ఓకే ...అమ్మ గా సుధా ఆంటీ overaction షరా మామూలే ...జైలర్ గా ఆహుతి ప్రసాద్ ...CBI ఆఫీసర్ గా వినోదకుమార్ బాగున్నారు ....ముఖ్యంగా ఆ రోల్స్ బాగున్నాయి ...
శ్రీమన్నారాయణ ....ద PASSWORD SPECIALIST...
చెప్పడానికి one line స్టొరీ గా ఉన్న ఈ కథ ని password కాన్సెప్ట్ తో కొంచెం కొత్తగా మలిచాడు దర్శకుడు . ఒకే password ఆరుగురు విలన్లు షేర్ చేస్కోడం ...వారిని చంపుతూ ఆ password చేదించడం..అనేది ముగింపు తెలిసినా కూడా సినిమాని కొంచెం interesting గా తీయడానికి ఉపయోగ పడింది ...కాకపొతే సినిమా మొత్తం ఈ password అనే word వాడటం కొంచెం నవ్విన్చోచ్చు. అలాగే దువ్వాసి మోహన్ అండ్ హీరోయిన్ల మధ్య జరిగే sim cards...out of coverage area... అంటూ సాగే కామెడి దియేటర్లో ఆడియన్స్ ని బానే నవ్వించింది ...fights ఈ సినిమాకి highlight. ఎక్కడ స్రుతి మించకుండా crispy గా ఉన్నాయి ...చక్రి సింహ కి ఇచ్చిన పాటాలే మళ్లీ వాడుంటే పోయేది ....ఉన్న వాటిల్లో ఇద్దరు హీరోయిన్లతో వచ్చే పాట బెటర్ ...అండ్ "తక తై తక తై" బాగుంది ...రవి చావలి అబ్బో సూపెర్ గా తీసాడు అనిపించుకోక పోయినా ...ఆ పర్వాలేదులే అనిపించుకుంటాడు ....
పొరపాట్లు ....
యంగ్ జనరేషన్ తో పోటి పడాలంటే వారిలా స్లింగా ఫిట్ గా ఉండి తీరాలి.. సో బాలయ్య అర్జంటుగా కొంచెం తగ్గాలి... పెద్ద హీరోల సినిమాలు జస్ట్ మామూలు కథ తో ఆడే రోజులు పోయాయి ....సినిమాలో "అహో అద్బుతం" అనేలా విషయం ఉంటేనే వారి సినిమాలకి ఆడియన్స్ వస్తున్నారు ...సినిమాలో ఆరుగురు విలన్లు ఉన్నా...అందరు ఒకరి తర్వాత ఒకరు హీరో చేతిలో చావడానికి క్యూ కట్టడమే తప్పితే పెద్దగా చేసేదేం లేదు ....దర్శకుడు విలన్లని చంపడానికి ఓ మూడు వెరైటీ గెట్టప్పులు వేయించి సగం లోనే హ్యాండ్ ఇచ్చాడు... వాటిల్లో నరసింహ స్వామి ఒక్కటే హైలైట్ ...విలన్లని ఇంకొంచెం తెలివిగా చూపించి ఉంటె హీరో రోల్ ఇంకా elevate అయ్యేది ...పాటలు ఇంకా బాగుండాల్సింది ....
చివరగా....
ఇద్దరు హీరోయిన్లు ...ఆరు ఫైట్లు ...నాలుగు మాస్ పాటలు...కొన్ని కామెడి బిట్లు .... మన తెలుగు సినీ ఫార్ములా ఎక్కడా మిస్ అవ్వలేదు ... బాలకృష్ణ అభిమానులకి ఎప్పటిలా సంతోశాన్నిచే సినిమా..
మంచి స్క్రీన్ ప్లే...అండ్ ఎక్కడా extras లేకపోవటం వల్ల మిగతావారికి కూడా బోర్ కొట్టకపోవచ్చు... వచ్చే వారాల్లో షిరిడి సాయి అండ్ life is beautiful ఉండటం వల్ల ...కేవలం మాస్ జనాన్ని కొన్నాళ్ళు అలరించోచ్చు...బాలకృష్ణ సినిమాలు ఇష్టపడే వారు సరదాగా ఓ సారి చూసెయ్యండి .....
రేటింగ్ ....
అబ్బో ఈ రేటింగ్ ఇవ్వడం పెద్ద trouble ...trouble అంటే ఈ సినిమా లో ఓ హైలైట్ డైలాగ్ గుర్తొచ్చింది
Dont trouble the trouble... If you trouble the trouble... trouble troubles you. i am not the trouble i m the truth
2.75